పనులు ప్రారంభం | Script work started for Mahesh Babu-Rajamouli movie | Sakshi
Sakshi News home page

పనులు ప్రారంభం

Published Mon, Nov 21 2022 4:16 AM | Last Updated on Mon, Nov 21 2022 4:16 AM

Script work started for Mahesh Babu-Rajamouli movie - Sakshi

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు రాజమౌళి. ‘‘నా సినిమాలకు మా నాన్నగారు (ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌) కథలు అందిస్తుంటారు. నేను ఎప్పట్నుంచో ఓ అడ్వెంచర్‌ స్టోరీ చేయాలనుకుంటున్నాను.

రెండు నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్స్‌ మొదలయ్యాయి’’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement