మహేశ్-రాజమౌళి సినిమాపై ఒడిశా డిప్యూటీ సీఎం ట్వీట్ | Odisha Dy CM Pravati Parida Tweet On SSMB 29 | Sakshi
Sakshi News home page

SSMB29: మొన్న 'పుష్ప 2'.. ఇప్పుడు ఈ సినిమా

Published Wed, Mar 12 2025 12:16 PM | Last Updated on Wed, Mar 12 2025 12:34 PM

Odisha Dy CM Pravati Parida Tweet On SSMB 29

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఒడిశాలో షూటింగ్ జరుగుతోంది. రెండు రోజుల క్రితం చిత్రీకరణలో మహేశ్ పాల్గొన్న వీడియో ఒకటి లీక్ అయింది. దీంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది.

సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు మహేశ్-రాజమౌళి మూవీపై స్వయంగా ఒడిశా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రవతి పరిడ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇందులో పుష్ప 2 మూవీ గురించి కూడా ప్రస్తావించడం విశేషం.

(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: టాలీవుడ్ నిర్మాత)

'గతంలో మల్కన్ గిరిలో పుష్ప 2, ఇప్పుడు రాజమౌళి తీస్తున్న ssmb29. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్, అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా.. కోరాపుట్ లో షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీనిబట్టి ఒడిశా.. సినిమా చిత్రీకరణకు స్వర్గధామం అని అర్థమవుతోంది. ఇది ఒడిశా పర్యటక రంగానికి కూడా ప్రోత్సాహమే. మా దగ్గర షూటింగ్స్ చేసేందుకు అన్ని భాషా ఇండస్ట్రీలని స్వాగతిస్తున్నాం. మేం పూర్తిస్థాయి మౌళిక సదుపాయాలు కల్పిస్తాం' అని ప్రవిత పరిడ చెప్పుకొచ్చారు.

బీజేపీ తరఫున గతేడాది ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె.. ఒడిశా రాష్ట్రానికి తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగానూ ఘనత సాధించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా మూవీస్ షూటింగ్ జరగడం గ్యారంటీ!

(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement