Odisha government
-
భారత హాకీ జట్టకు ఘన సన్మానం.. అమిత్‌కు రూ. 4 కోట్ల నజరానా
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టుకు తమ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహకారం కొనసాగిస్తుందని... 2036 వరకు భారత హాకీ జట్టుకు ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్‌గా కొనసాగుతుందని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు.బుధవారం భువనేశ్వర్‌లో భారత జట్టు సభ్యులకు ఒడిశా ప్రభుత్వం సన్మానించింది. పారిస్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో కీలక సభ్యుడైన ఒడిశాకు చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్‌కు రూ. 4 కోట్ల నజరానాను చెక్ రూపంలో అందించింది. జట్టులోని ఇతర ఆటగాళ్లకు తలా రూ. 15 లక్షల, సహాయక సిబ్బదికి రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేసింది. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.ఈ సందర్భంగా భారత సారథి హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ‘జర్మనీతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చాం. చాలా అవకాశాలు సృష్టించుకున్నాం. అయితే అది మా రోజు కాదు. అయినా కాంస్య పతక పోరులో తిరిగి సత్తాచాటాం. స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పారిస్‌కు వెళ్లాం. కానీ అది సాధ్యపడలేదు. వరసగా రెండు విశ్వక్రీడల్లో పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఒడిశా ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరవలేనివని.. ఇక్కడ హాకీకి కావాల్సిన సకల సదుపాయాలు ఉన్నాయి’ అని అన్నాడు. -
రూ.40 వేల కోట్ల పెట్టుబడి.. 11000 జాబ్స్ - ప్రభుత్వంతో జేఎస్‌డబ్ల్యు ఒప్పందం
ప్రముఖ కార్పొరేట్ సంస్థలలో ఒకటైన 'జేఎస్‌డబ్ల్యు గ్రూప్' త్వరలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV), ఈవీ బ్యాటరీ తయారీ విభాగంలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. త్వరలో ఏర్పాటు చేయనున్న మెగా మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల కోసం కంపెనీ ఏకంగా రూ.40,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీకి జిందాల్ స్టీల్ ఓడిశాలోని కటక్ వద్ద ఓ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, ఎలక్ట్రిక్ విడి భాగాల తయారీకి పరదీప్ (Paradip)లో ఒక యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ రెండు ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి సంస్థ రూ. 40వేలకోట్లు పెట్టుబడి పెట్టనుంది. కటక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం రూ. 25000 కోట్లు, పరదీప్‌లో యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ. 15000 కోట్లు వెచ్చించనుంది. ఈ రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యూనిట్లు రెండు దశల్లో పూర్తి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సంస్థల్లో పూర్తిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్! జిందాల్ గ్రూప్ ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్స్ వల్ల 11,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రత్యక్ష ఉపాధి మాత్రమే కాకుండా ఈ ప్లాంట్స్ నిర్మాణం పూర్తయిన తరువాత పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి జిందాల్ స్టీల్ అడుగుపెట్టడంతో దేశీయ ఉత్పత్తులు మెరుగుపడతాయని స్పష్టంగా తెలుస్తోంది. -
రాజకీయ రంగంలో ఒకేరోజు రెండు విషాదాలు
బెంగళూరు: రాజకీయ రంగంలో ఒకేరోజు రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. కర్ణాటక, ఒడిశా మాజీ స్పీకర్లు మంగళవారం తుదిశ్వాస విడిచారు. కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ దారదహళ్లి బైరేగౌడ చంద్రేగౌడ(87) ఈరోజు తెల్లవారుజామున చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకా దారదహళ్లిలోని తన నివాసంలో కన్నుమూయగా, ఒడిశా మాజీ స్పీకర్ మహేశ్వర్ మొహంతి(67) భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1936 ఆగస్టు 26న జన్మించిన దారాదహళ్లి బైరేగౌడ.. రాజకీయంగా సుధీర్ఘసేవలు అందించారు. కర్ణాటక స్పీకర్‌గా మాత్రమే కాకుండా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం.. జనతా దళ్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో కొనసాగింది. 1983-85 వరకు స్పీకర్‌గా పనిచేసిన ఆయన.. 1986లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. Former Speaker of Karnataka Legislative Assembly Daradahalli Byregowda Chandregowda passed away at his residence in Mudigere Taluk's Daradahalli in Chikmagalur District early morning today: Karnataka DIPR (file pic) pic.twitter.com/pk7texGTVG — ANI (@ANI) November 7, 2023 ఒడిశా మాజీ స్పీకర్ మహేశ్వర్ మొహంతి(67) బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొహంతి కన్నుమూశారు. 2004-08 మధ్య ఒడిశా ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన మెహంతీ.. పూరి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సీఎం నవీన్ పట్నాయక్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో దుండగుల కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. Odisha | Former Speaker and ex-minister Mahwswar Mohanty passed away while undergoing treatment at a private hospital in Bhubaneswar. (File photo) pic.twitter.com/ABrQkF7YgN— ANI (@ANI) November 7, 2023 ఇదీ చదవండి: మాజీ డ్రైవరే హంతకుడు -
భారత హాకీకి సంబంధించి ఒడిశా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం
భువనేశ్వర్: భారత సీనియర్, జూనియర్ పురుషుల, మహిళల హాకీ జట్లకు మరో పదేళ్లపాటు (2033 వరకు) స్పాన్సర్ షిప్ చేస్తామని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018 నుంచి ఒడిశా జాతీయ హాకీ జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. 2018, 2023లలో పురుషుల ప్రపంచకప్ టోర్నీలకు ఒడిశా ఆతిథ్యమిచ్చింది. -
బెదిరింపులు.. బుజ్జగింపులు!
సాలూరు: కొటియా పల్లెల్లో ఒడిశా దూకుడు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఆంధ్రాలోనే ఉంటామంటూ తేల్చి చెప్పిన గిరిజనులపై చర్యలకు దిగుతోంది. ఒడిశా ప్రభుత్వం ఈ నెల 18న కొటియా పల్లెల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. తామంతా ఆంధ్రాలోనే ఉంటామంటూ కొందరు గిరిజనులు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. వారి అప్పీల్‌ను సోమవారం కోర్టు స్వీకరించింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు బహిష్కరించాలని స్థానిక గిరిజన నేతలు, ప్రజలు నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఒడిశా ప్రభుత్వం వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఆంధ్రా వైపు మొగ్గుచూపుతున్న 12 మంది.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ మంగళవారం సాయంత్రం పొట్టంగి తహసీల్దార్ సమన్లు జారీచేశారు. వాటిని తీసుకునేందుకు గిరిజన నాయకులు తిరస్కరించడంతో ఒడిశా పోలీసులు వాగ్వాదానికి దిగారు. అప్పటికీ సమన్లు తీసుకునేందుకు నిరాకరించడంతో స్థానిక నేతలు బుజ్జగించే యత్నాలు ప్రారంభించారు. ఒడిశాలోని పొట్టంగి మాజీ ఎమ్మెల్యే ప్రపుల్ల పంగి, స్థానిక నేతలు కొందరు బుధవారం సాయంత్రం పట్టుచెన్నేరుకు వచ్చి ఎన్నికల్లో పాల్గొనాలని గిరిజనులతో మధ్యవర్తిత్వం నడిపారు. ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ మావోలు ఇప్పటికే లేఖ విడుదల చేశారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొటియాపల్లెల్లో నెలకొంది. -
ఈ ఒప్పందం ఆదర్శం, అనుసరణీయం
దేశాల మధ్య, ఒకే దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య జలవిద్యుత్ పంపిణీ సమస్యలకు ‘సంప్రదింపుల’తో ఇచ్చిపుచ్చుకునే ప్రవృత్తి చాలా అవసరం. ‘నిర్బంధ మధ్యవర్తిత్వం కన్నా పరస్పర సహకారం, సౌభ్రాతృత్వం ద్వారానే’ తగాదాలు పరిష్కారం కావాలనీ, అవుతాయనీ ఆంధ్ర, ఒడిశా ముఖ్యమంత్రులు ఇటీవలే మార్గం చూపారు. రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలపై వీరిరువురు చరిత్రాత్మక సంధి కుదుర్చుకున్నారు. ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా జలవనరులు, సరిహద్దు విద్యుత్ తదితర అంశాలను పరిష్కరించుకోవడంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవగాహనకు వచ్చారు. ఈ ఒప్పందాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ‘ఒజ్జబంతి’గా భావించాలి. ఏపీ, ఒడిశాల మధ్య దశాబ్దాలుగా పరి ష్కారానికి నోచుకోకుండా కొన్ని కీలక సమ స్యలు వాయిదాపడి ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి సంబం ధించి, ఉభయ రాష్ట్రాలు నిర్ణయాత్మకమైన చరిత్రాత్మక సంధి కుదుర్చు కోవడానికి తొలిసారిగా ఇటీవలే అంకురార్పణ జరిగింది. రెండు రాష్ట్రాల ప్రజల ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా జలవనరులు, సరి హద్దు విద్యుత్ తదితర అంశాలను పరిష్కరించుకోవడంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. మొదటిసారిగా ఫలవంతమైన చర్చలు జరిగినందుకు సంతోషం ప్రకటిస్తూ, ఇవి త్వరలోనే సత్ఫలితా లనివ్వ గలవని ఏపీ, ఒడిశా సీఎంలు వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్‌లు ప్రకటించారు. – (పత్రికా వార్తలు 9–11–21) ఫెడరల్ వ్యవస్థ, రాజ్యాంగ విలువలు బతికిబట్టకట్టాలంటే అంతర్ రాష్ట్ర ప్రజలకూ, విద్యుత్ పంపిణీకి సంబంధించిన వివాదాల పరి ష్కారం కీలకమవుతుంది. అలాగే రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల మధ్య, ఒకే ప్రాంతంలోని పలు గ్రామాల మధ్య జల వివాదాల పరి ష్కారం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో, ఆంధ్ర– ఒడిశాల మధ్య 60 ఏళ్ల తర్వాత చరిత్రాత్మక ఒడంబడిక కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ‘ఒజ్జబంతి’గా భావించాలి. వలస పాలనలోనూ, దేశ స్వాతంత్య్రానంతరమూ అనేక న్యాయస్థానాలు ప్రాంతాల మధ్య జలవిద్యుత్ పంపిణీ వ్యవస్థను ఎలా పరిష్కరించు కోవచ్చునో పెక్కు సందర్భాలలో సూచనలు చేస్తూ వచ్చాయి. దాదాపుగా 60 ఏళ్లపాటు నిద్రమత్తులో ఉన్న పాలకుల చండితనాన్ని వదిలించడానికి ఏ వ్యవస్థ కూడా ప్రయత్నించలేదు. ఈ పరిస్థితుల్లో దేశాలమధ్యనే కాకుండా, ఒకే దేశంలోని ప్రాంతాల మధ్య నెలకొన్న జల, విద్యుత్ పంపిణీ వ్యవస్థల తీరు తెన్నుల్ని, వాటిపై వివాదాలను కూడా సవరించడానికి ప్రపంచ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. 1966లో హెల్సెంకీ అంతర్జాతీయ మహాసభ ఈ విషయ మైన కొన్ని శాశ్వత నిర్ణయాలు ప్రకటించి, యావత్ ప్రపంచానికీ ఆదేశించి ఉందని మరచిపోరాదు. అలాగే చరిత్రను మనం మరచిపోకపోతే... వలస పాలనలో బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాలను కూడా ధిక్కరించి గోదావరి, మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలకు చెందిన ప్రజాబాహుళ్యం మౌలిక సమస్యను గుర్తించి పరిష్కరించిన సర్ ఆర్థర్ కాటన్ మనకు గుర్తుకు రాక మానడు. ఈ రెండు ప్రాంతాల రైతాంగం కరువు భూములకు సేద్య ధారలు అందించిన వ్యక్తిని మనం ఎన్నటికీ మరచిపోలేం. మను షులు తోటి మనుషుల్ని కుక్కల్లా పీక్కుతినేలా చేసిన ‘ధాత’ కరువు నుంచి ప్రజా బాహుళ్యాన్ని రక్షించడానికి 19వ శతాబ్దంలోనే గోదావరి ఆనకట్ట నిర్మాణాన్ని తలపెట్టిన మహనీ యుడు కాటన్. ఈ కారణం చేతనే ఆనాటినుంచి ఈనాటిదాకా గోదావరి మండలంలో ప్రజలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సందర్భంగా వల్లించే స్తోత్రాలలో ‘కాట నాయ నమః’ అని తలచుకుంటూనే ఉండటం మరో విశేషం! అలాగే కొండల్ని పిండిచేసి, మహానదుల గమనాల్నే ప్రజాసేవకు మళ్లించగల మహనీయులుగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య, శొంఠి రామమూర్తి, డాక్టర్ కె.ఎల్. రావు లాంటి వారు వెలుగొందారు. వీరు దేశంలోని జల, విద్యుత్ ప్రాజె క్టుల నిర్మాణ రంగంలో మహోద్దండ పిండాలు! బ్రహ్మపుత్రా నదీ జలాలను భారతదేశంలోకి పారించి ఏడాది పొడవునా అన్ని ప్రాంతా లకు, ఆరుగాలమూ అందేటట్టు భారతదేశం నడిబొడ్డులో మహా సాగర నిర్మాణానికి ఏతమెత్తినవాడు కాటన్. ఎందుకంటే, నీటికి రాజ కీయం తెలియదు. విద్యుత్ ప్రవాహం భౌతికశాస్త్ర సూత్రాలపై తప్ప కేవలం రాజకీయ ఆదేశాలపై సాగదని విశ్వసించినవాళ్లు మన ఇంజ నీర్లూ, ప్రాజెక్టుల నిర్మాణ నిపుణులూ! 1966 నాటి హెల్సెంకీ అంత ర్జాతీయ సంధిపత్రం, నిర్ణయాలు, నిబంధనలు కూడా ఇదే సత్యాన్ని చాటి చెప్పాయి. దేశాల మధ్య, ఒకే దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య జలవిద్యుత్ పంపిణీ సమస్యలకు ‘సంప్రదింపుల’తో ఇచ్చి పుచ్చుకునే ప్రవృత్తి చాలా అవసరం. ఈ ఇచ్చి పుచ్చుకునేతత్వం వల్లే సమస్యలకు పరిష్కారం సాధ్యమనీ, ‘నిర్బంధ మధ్యవర్తిత్వంకన్నా పరస్పర సహ కారం, సౌభ్రాతృత్వం ద్వారానే’ తగాదాలు పరిష్కారం కావాలనీ హెల్సెంకీ ప్రపంచ మహాసభ అప్పట్లోనే సూత్రీకరించింది. అంతేకాదు, అంతర్జాతీయ జల, విద్యుత్ పంపిణీకి సంబంధిం చిన తగాదాలు న్యాయస్థానాల తీర్పులతోనే సంతృప్తికరంగా పరి ష్కారం కాజాలవు. ప్రపంచదేశాల జల తగాదాలను, సరిహద్దు వివా దాలను నిశితంగా అధ్యయనం చేసిన నిపుణుడు బార్బర్ (1959) ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాడు. రివర్బోర్డులు ఉండి కూడా తగా దాలు తీరడం లేదు. కనుకనే ‘నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు’ అన్న సామెత పుట్టుకొచ్చి ఉంటుంది. ఇప్పుడు ‘ఎత్తిపోతల పథకాల’ ద్వారా పల్లంలోని నీరుసైతం ఎత్తులకు ఎగబాకి పోగలుగుతోంది! కనుకనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తలపెట్టలేని విధంగా డజన్ల కొద్దీ ప్రాజెక్టులను ప్రాంతాల వారీగా ఆచరణసాధ్యం చేయడానికి ప్రయత్నించారు. ఈ ప్రాజెక్టులను తన హయాంలోనే నిర్మించి ఆచరణలో ప్రజల అనుభ వంలోకి రావడానికి ఉద్యమించిన మేటి నాయకుడు వైఎస్సార్. ప్రాజె క్టుల నిర్మాణంలో ఆయన రాజకీయాలకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా వ్యవహరించగలిగారు. కాబట్టే కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య పేరిట వెలిగొండ ప్రాజెక్టును ఆయన ఆనాడు ఆవిష్కరించారు అదే స్ఫూర్తిని ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ‘నవరత్నాల సాక్ష్యంగా కొనసాగిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం, పేదల అభ్యున్నతి కోసం, అనేక సంక్షేమ పథకా లను ప్రకటించి అమలు చేస్తున్నారు. ఈ పథకాల అమలు ద్వారా రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే ఉద్దండ పిండంగా గుర్తింపు పొంది, తన వ్యక్తిత్వ ప్రతిభతో ఆదర్శ జీవిగా వైఎస్ జగన్ నిలబడ గల్గుతున్నారు. ఆ స్ఫూర్తితోనే మన పొరుగునే ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయిన ఏపీ సీఎం... రెండు రాష్ట్రాల మధ్య ఆరు దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రతిష్టంభనను ఛేదించగలిగారు! ఈ విశాలదృష్టి లేనందునే బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునళ్ల చుట్టూ ఇన్నా ళ్లుగా కాళ్ళకు బలపం కట్టుకొని తిరగవలసి వచ్చింది. అమెరికాలో మసాచూసెట్స్ రాష్ట్రానికీ దాని దిగువన ఉన్న కనెక్టికట్ రాష్ట్రానికి మధ్య జల, విద్యుత్ కేటాయింపుల విషయంలో సంవత్సరాల తరబడీ తలెత్తిన తగాదాల సందర్భంగా ఆ రెండు రాష్ట్రాల పాలకులకు జస్టిస్ బట్లర్ తన చరిత్రాత్మక తీర్పుతో హితబోధ చేశాడు. ‘ఉభయత్రా స్థానిక పరిస్థితులను బట్టి స్వార్థాలు బలిసి ఉంటాయి. కాబట్టి పరీవాహక ప్రాంత రాష్ట్రాల హక్కులకు సంబం ధించిన చట్టాలు తగాదాల పరిష్కారానికి తోడ్పడవు, హక్కుల సమా నతా సూత్రం ప్రాతిపదికపైన మాత్రమే నీటి తగాదాలు పరిష్కారం కావాలి. అంతేగాదు, నీ రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య జల వివాదాల పంపిణీపై తగాదా వస్తే నీవు ఏం చేస్తావో ఆలోచించుకొని, ఆ సూత్రాన్నే రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే జల వివాదానికి కూడా వర్తింపచేసుకోమన్నారు, జస్టిస్ బట్లర్! ఆ ఇంగిత జ్ఞానంతోటే, ప్రజాప్రయోజనాల దృష్టితోటే వైఎస్ జగన్–నవీన్ పట్నాయక్‌లు... దశాబ్దాలుగా నానుతున్న ఆంధ్ర– ఒడిశాల తగాదాలకు భరతవాక్యం చెబుతూ చారిత్రక ఒడంబడికకు శ్రీకారం చుట్టగలిగారు! కాబట్టి, ఇకపై పరస్పరం నిందలు మోపుకొనే నీలి మాటలకు, గాలి మాటలకు విలువుండదు! చిత్రకారుడి సజీవ చిత్రానికి ఎంత విలువ ఉంటుందో, ఆంధ్ర–ఒడిశాల చారిత్రక ఒప్పం దానికి ఆచరణలో అంత విలువ రాగలదని, రావాలని ఆశిద్దాం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆంధ్రా పుణ్యంతోనే అన్నం తింటున్నాం..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రస్తుత ఆంధ్రా పాలకుల దయవల్ల ఆనందంగా జీవించగలుగుతున్నామని, తమను ఆంధ్రప్రదేశ్ వాసులుగానే పరిగణించాలని ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న అమ్మ ఒడి, వైఎస్సార్ రైతుభరోసా, జగనన్న చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి సంక్షేమ పథకాలు తమను ఎంతగానో ఆదుకుంటున్నాయని వారు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో వివాదాస్పదంగా మారిన కొటియా, గంజాయిభద్ర, పనికి, రణసింగి, దిగువశెంబి, ఎగువ శెంబి, సినివలస, కోనదొర తదితర కొటియా గ్రూపు 21 గ్రామాల నుంచి 50 మంది సోమవారం విజయనగరం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్ ఎ.సూర్యకుమారిని కలిసి తమ గ్రామాల సమస్యలను విన్నవించారు. తాము ఆంధ్రులమని, తమది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విన్నవించారు. 21 కొటియా గ్రామాలను ఆక్రమించేందుకే ఒడిశా ప్రభుత్వం హుటాహుటిన భవనాల నిర్మాణం చేస్తోందని తెలిపారు. ఇటీవల కాలంలో కోరాపుట్ ఎమ్మెల్యే, పోలీసులు తమపై రౌడీయిజం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కూర్మనాథ్‌ను కూడా కొటియా గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. పూర్వం నుంచి తాము ఆంధ్రులమేనని, అందుకు సంబంధించిన భూమిశిస్తు తామ్రపత్రాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కొటియా ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం సమావేశ మందిరంలో కొటియా గ్రామప్రజలను కలెక్టర్ సత్కరించారు. వారితో కలిసి భోజనం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు జీసీ కిశోర్‌కుమార్, మహేష్‌కుమార్, వెంకటరావు, మయూక్ అశోక్, డీఆర్వో గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. అన్నివిధాలా రక్షణ... కొటియా గ్రామాల ప్రజలకు అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక హామీ ఇచ్చారు. ఒడిశా పోలీసుల దౌర్జన్యాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కొటియా ప్రజలు ఆమెను కలిశారు. కొటియాలో త్వరలోనే పోలీసుస్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరినట్లు ఆమె చెప్పారు. వారికి నిత్యావసర వస్తువులను ఎస్పీ అందించారు. -
ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. వాళ్లకు ‘నడక’యాతన తప్పట్లేదు
రాయగడ( భువనేశ్వర్): ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా రాయగడ జిల్లాకు ఒరిగిందేమీ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మారుమూల గ్రామాలే కాకుండా జిల్లా కేంద్రానికి సమీప గ్రామాలు కూడా కనీసం రహదారి సదుపాయానికి నోచుకోలేదని వాపోతున్నారు. జిల్లాను ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మారుమూల గ్రామాల నుంచి గర్భిణులను మంచాలపై మోసుకుంటూ అంబులెన్స్ వరకు తీసుకువస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. నిండు గర్భిణినైనా రెండు కిలోమీటర్ల నడవాల్సిందే ఈ క్రమంలో నిండు గర్భిణిని రెండు కిలోమీటర్ల దూరం నడిపించుకుంటూ తీసుకువెళ్లిన సంఘటన గురువారం జరిగింది. అయితే అదేదో మారుమూల కుగ్రామం అనుకుంటే పొరబడినట్లే. జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ సంఘటన సంభవించడంతో అధికారులు సైతం ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి సమీప తడమ పంచాయతీ పరిధి హులుకి గ్రామానికి చెందిన కైలాస కడ్రక భార్య సంజిత కడ్రక పురిటినొప్పులతో బాధపడుతుండడంతో సమాచారం మేరకు అంబులెన్స్ వచ్చి సరైన రహదారి లేక హులుకి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని జరఫా గ్రామంలో ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కైలాస కడ్రక, వదిన మోతికడ్రక, మరో యువతి సహాయంతో కలిసి గర్భిణి సంజిత కడ్రకను ముళ్ల పొదల మీదనుంచి అతి కష్టం మీద నడిపించుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా అక్కడ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అంబులెన్స్ వరకు డోలీలో తీసుకువెళ్లేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో నడిపించుకుని తీసుకువెళ్లాల్సి వచ్చిందని భర్త కైలాస కడ్రక తెలియజేశాడు. -
మమ్మల్ని ఆంధ్రా వాసులుగా గుర్తించండి
పాచిపెంట: తామంతా తెలుగువారమేనని.. ఒడిశా ప్రభుత్వం తమ పల్లెలను అక్రమంగా ఆ రాష్ట్రంలో కలిపేసిందని, మళ్లీ తమను ఆంధ్రాలో చేర్చి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పీవో కూర్మనాథ్‌కు గురువారం విన్నవించారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం సంపంగిపాడు పంచాయతీకి సమీపంలో ఒడిశా పరిధిలో ఉన్న కరిడి, పిలకబిట్రా, బిట్రా, జంగంవలస, అడ్డబొడ్డవలస, బొర్రమామిడి, బైరిపాడు తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు పి.కోనవలసలో ఎమ్మెల్యే, పీవోలను కలిశారు. తమ తండ్రులు సాలూరు మండలం సారికి గ్రామానికి చెందిన దివంగత ఎంపీ డిప్పల సూరిదొరకు శిస్తు చెల్లించేవారన్నారు. వాటికి సంబంధించిన రాగి ఒప్పంద పత్రాలను చూపించారు. ఒడిశా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస అవసరాలు కూడా తీరని దుస్థితిలో ఉన్నామని వాపోయారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలన బాగుందని, తమను కూడా ఆంధ్రా ప్రజలుగా గుర్తించి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని విన్నవించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే రాజన్నదొర వారికి హామీ ఇచ్చారు. -
ఒడిశా అధికారుల అదుపులోనే ఏపీ గ్రామాలు
మందస: రాష్ట్ర సరిహద్దులోని గిరిజన గ్రామాలపై ఒడిశా అధికారుల దౌర్జన్యం కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సాబకోట, బుడారిసింగి పంచాయతీల్లోని పలు గ్రామాలను ఒడిశా అధికారులు, పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. తాము ఏపీలోనే ఉంటామని చెబుతున్నా కూడా.. ఒడిశా అధికారులు మాత్రం స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేయొద్దంటూ గిరిజనులను బెదిరిస్తున్నారు. సాబకోట పంచాయతీ పరిధిలోని మాణిక్యపట్నం, మధ్యకోల.. బుడారిసింగి పంచాయతీలోని గుడ్డికోల గ్రామాలు ఒడిశా పరిధిలోనే ఉన్నాయని ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. కానీ ఈ గ్రామస్తుల రేషన్, ఆధార్ కార్డులు ఏపీకి చెందినవే. ఏపీ నుంచే సంక్షేమ పథకాలనూ అందుకుంటున్నారు. అయినా కూడా ఒడిశా అధికారులు మొండిగా వ్యవహరిస్తూ.. గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన పలువురిని బెదిరించి.. నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పోలీసులు కూడా ఈ గ్రామాల్లో తిరుగుతూ.. ఏపీలో ఓట్లు వేయొద్దని గిరిజనులను బెదిరిస్తున్నారు. బుధవారం ఈ గ్రామాల్లో ఏకంగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. గురువారం మరిన్ని బలగాలను దించుతామని, ప్రజలెవరూ పోలింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని హెచ్చరించారు. గిరిజనులు మాత్రం ఏపీలోనే ఉంటామని.. పోలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశమివ్వాలని వేడుకుంటున్నారు. ఈ విషయం మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి వెళ్లడంతో.. ఆయన ఒడిశా అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ బడే పాపారావు మాట్లాడుతూ.. పోలీసు బలగాలను ఏర్పాటు చేసి ఈ గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిపిస్తామన్నారు. -
లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రం..
భువనేశ్వర్ : ఒడిశాలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం ఏప్రిల్14 వరకు 21 రోజుల లాక్డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం నవీన్ పట్నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ను పొడగించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ‘కోవిడ్-19 సంక్షోభం కారణంగా అమలవుతున్న లాక్డౌన్ కాలంలో మీ క్రమశిక్షణ, త్యాగం కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి మాకు బలాన్ని ఇచ్చింది’ అని సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రైళ్లు, విమానాల సేవలు ఈ నెల ఆఖరు వరకు నిలిపి వేస్తున్నట్లు, జూన్ 17 వరకు విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు సీఎం తెలిపారు. అయితే వ్యవసాయ ఆధారిత పనులకు మినహాయింపు ఉందని పేర్కొన్నారు. కరోనా తర్వాత పరిస్థితులు అన్నీ ఒకేలా ఉండవని, ప్రజలంతా అర్థం చేసుకోని.. సహకరించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు.(కరోనా: 5 వేలు దాటిన కేసులు.. అక్కడ తొలి మరణం ) కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కొనసాగించడం తప్ప మరో దారి లేదంటూ పలు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. దేశంలో లాక్డౌన్ ఎత్తివేసినా తెలంగాణలో మాత్రం కొనసాగించాలనుకుంటున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. దీనిపై ఉత్తరప్రదేశ్ సర్కార్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కరోనాను పూర్తిగా కట్టడి చేశాకే లాక్డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందంటూ ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాజస్తాన్ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. కరోనా: ‘ఆ డ్రగ్ తనకు పనిచేయలేదు’ -
సర్కారుకు జరిమానా..!
భువనేశ్వర్: రక్త మార్పిడి తప్పిదం పట్ల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. బాధిత వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారం చెల్లించేందుకు కమిషన్ 2 నెలల గడువు మంజూరు చేసింది. శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కెంజొహార్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఈ ఘోర తప్పిదం 2016 వ సంవత్సరం డిసెంబరులో జరిగింది. ఈ తప్పిదంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారం వ్యక్తం చేసింది. రక్త మార్పిడిని పురస్కరించుకుని కెంజొహార్ జిల్లా ప్రధాన ఆస్పత్రి వర్గాల తప్పిదంతో సుఖాంతి నాయక్ (45) అనే మహిళ అకాల మరణానికి గురైంది. కెంజొహార్ పాత బస్తీ హడొబొంధొ సాహిలో ఉంటున్న సుఖాంతి నాయక్ ఉన్నత చికిత్స కోసం ఈ ఆస్పత్రి మెడిసిన్ వార్డులో 2016వ సంవత్సరం డిసెంబరు 13వ తేదీన భర్తీ అయింది. ఆమెకు ఒక యూనిట్ రక్త మార్పిడి చేపట్టాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ సలహా మేరకు ఆమె భర్త వీరేంద్ర నాయక్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న రక్త నిధి నుంచి లేబొరేటరీ వర్గాలు ఇచ్చిన 1 యూనిట్ రక్తం తీసుకుని సంబంధిత నర్సుకు అందజేశాడు. ఈ రక్తం మార్చిన కాసేపటికే ఆయన భార్య సుఖాంతి నాయక్ ఆకస్మికంగా కన్నుమూసింది. ఈ సంఘటనపై ఆరా తీయగా తప్పుడు గ్రూపు రక్తం మార్చడంతో ఈ ముప్పు సంభవించినట్లు తేలింది. కావలసిన గ్రూపు రక్తం బదులుగా వేరే గ్రూపు రక్తం ఎక్కించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు ఖరారైంది. విధుల నుంచి ఇద్దరు సిబ్బంది తొలగింపు ఈ విషాద సంఘటనపై జిల్లా ప్రధాన వైద్య అధికారి నిర్వహించిన విచారణలో ఇద్దరు సిబ్బంది బాధ్యులుగా తేలింది. ఈ సిబ్బందిని విధుల నుంచి బహిష్కరించారు. రక్త నిధి లేబొరేటరీ టెక్నిషియన్ భారతి మహంత తప్పిదం, విధి నిర్వహణలో స్టాఫ్ నర్సు హేమాంగిని మహంత నిర్లక్ష్యంతో చికిత్స కోసం విచ్చేసిన మహిళ మృతి చెందినట్లు నివేదిక వెల్లడించింది. కెంజొహార్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఒకే పేరుతో (సుఖాంతి నాయక్) ఇద్దరు వేర్వేరు మహిళా రోగులకు ఒకేసారి రక్త మార్పిడి చేయాల్సి వచ్చింది. ఆస్పత్రి మెడిసిన్, గైనకాలజీ వార్డుల నుంచి రక్త నిధికి రెండు యూనిట్ల రక్తం ఏర్పాటుకు అభ్యర్థనలు జారీ చేశారు. గైనకాలజీ వార్డు రోగికి అ గ్రూపు రక్తం, మెడిసిన్ వార్డు రోగికి వేరే గ్రూపు రక్తం అవసరాల కోసం అభ్యర్థించగా పంపిణీ దశలో ఈ రెండు గ్రూపుల రక్తం తారుమారైంది. ఈ తప్పిదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా స్టాఫ్ నర్సు హుటాహుటిన మెడిసిన్ వార్డులో ఉన్న రోగికి మార్చడంతో అకస్మాత్తుగా మరణించినట్లు జిల్లా ప్రధాన వైద్యాధికారి స్పష్టం చేశారు. ఈ తప్పిదం పట్ల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్వచ్ఛందంగా స్పందించి చొరవ తీసుకుంది. -
‘దిశ’ ప్రతులను పంపాలని ఒడిశా ప్రభుత్వం కోరింది
సాక్షి, అమరావతి :అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్య ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. చట్టం ప్రతులను పంపాలని ఒడిశా ప్రభుత్వం తమను కోరిందని.. చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తామని ఆ ప్రభుత్వం చెప్పినట్టు సభలో వెల్లడించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ చట్టంపై తమను సంప్రదించిందని, ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించినట్టు స్పీకర్ చెప్పారు. దిశ చట్టాన్ని ఆమోదించడం అసెంబ్లీకి గర్వకారణమని, ఈ చట్టంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందన్నారు. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చరిత్రాత్మక చట్టాలు చేశాం.. దిశ చట్టంపై అసెంబ్లీలో విపక్ష సభ్యుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని తప్పుపట్టడంతో స్పీకర్ జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వాలు మంచి చట్టాలను ప్రజల కోసం తయారు చేస్తాయన్నారు. జరుగుతున్న సంఘటనలన్నీ చట్టాలు లేకుండా జరుగుతున్నాయా అని స్పీకర్ నిలదీశారు. నిన్నగాక మొన్న ‘దిశ’ చట్టం వచ్చిందని.. ఎందుకు గాభరా పడుతున్నారంటూ విపక్ష సభ్యులను ప్రశ్నించారు. సభ ప్రారంభం కాగానే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సమావేశాల్లోనే చరిత్రాత్మక చట్టాలు చేశామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు జోక్యం చేసుకుని.. చట్టం వచ్చాక గుంటూరులో చిన్నారిపై లైంగిక వేధింపులు జరిగాయని, ఒక్క ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదన్నారు. హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ సోమవారమే వెళ్లి పరామర్శించామని, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినట్టు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించినట్టు వివరించారు. -
నిక్షేపాల ఖిల్లా.. కొటియా ఆశలకు బీట
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. 2014లో నవ్యాంధ్రగా రూపాంతరం చెందింది. ఈ 66 ఏళ్లలో ఎన్నో రాజధానులు మారాయి. భౌగోళికంగా ఎన్నెన్నో మార్పులొచ్చాయి. కానీ, దాదాపు 75 ఏళ్లుగా.. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో గిరి శిఖరాన గల కొటియా గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తాయనే వివాదం మాత్రం తేలలేదు. అక్కడి ఆదివాసీలు తమను ఆంధ్ర రాష్ట్ర పరిధిలోకి తీసుకెళ్లాలని ఏళ్ల తరబడి కోరుతుండగా.. అక్కడున్న అపార ఖనిజ నిక్షేపాలపై కన్నేసిన ఒడిశా ప్రభుత్వం ఆ ప్రాంతంపై పట్టు బిగిస్తోంది. అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా ఆ ప్రాంతాన్ని వశం చేసుకునేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు.. వాటిమధ్య అమాయక ఆదివాసీలు.. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ శివారు ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని 34 గిరి శిఖర గ్రామాల సమాహారమైన కొటియా ప్రాంతమది. విలువైన ఖనిజ నిక్షేపాలకు నిలయమైన ఆ ప్రాంతంపై ఒడిశా ప్రభుత్వం కన్నేసింది. ఆ గ్రామాలను వశం చేసుకునేందుకు పట్టు బిగిస్తోంది. అభివృద్ధి పనుల వేగం పెంచి.. రహదారులు, ఆస్పత్రి, వసతి గృహాలను నిర్మిస్తోంది. త్వరలో పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతోంది. ఓటుహక్కు వినియోగించుకోలేని గిరిజనులు దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రత్యేక కృషితో కొటియా గ్రూప్ గ్రామాల్లో విరివిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు జరిగేవి. దండిగాం నుంచి కొటియాకు తారు రోడ్డు మంజూరైంది. ఎగువశెంబి వరకు రోడ్డు నిర్మించారు. వైఎస్సార్ హఠాన్మరణం తరువాత రోడ్డు ఫార్మేషన్ జరిగినా నిర్మాణం పూర్తికాలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమను ఎవ్వరూ పట్టించుకోలేదని ఇక్కడి ప్రజలు అంటున్నారు. గత ఎన్నికల్లో కొటియా ప్రజలు ఆంధ్రా ఓట్లను వినియోగించుకోలేకపోయారు. ఇదే అదనుగా ఒడిశా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఖనిజ నిక్షేపాల కోసమే ఆరాటం ఇక్కడ ఉన్న విలువైన ఖనిజాల కోసమే ఒడిశా ఆరాటపడుతోంది. ఒడిశా ప్రభుత్వం ఇక్కడ కొన్నేళ్లుగా రహస్యంగా ఖనిజాన్వేషణ చేస్తోంది. ఎగువశెంబి, కొటియా, కుంబిమడ మధ్య బంగారం నిక్షేపాలు గల కొండ ఉందనే ప్రచారం నేపథ్యంలో దానిని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పాగా వేసేందుకు గిరిజనులకు సౌకర్యాల ఎర వేస్తోందని ఆ ప్రాంత గిరిజన నాయకులు చెబుతున్నారు. రూ.180 కోట్లతో ఎర కొటియా గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఒడిశా ప్రభుత్వం సుమారు రూ.180 కోట్లను మంజూరు చేసింది. అక్కడి ప్రజలు ఘనంగా జరుపుకునే కోరాపుట్ గిరిజన (పరబ్) పండుగకు సుమారు రూ.15 లక్షలు వెచ్చించింది. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లతోపాటు మరో 21 గ్రామాలకు కొత్తగా రహదారులు నిర్మిస్తోంది. 10 పడకల ఆస్పత్రి, బీఎస్ఎన్ఎల్ టవర్, పోలీస్ స్టేషన్, పాఠశాల, వారపు సంతలో వసతులు, ఎగువ గంజాయిభద్ర, దిగువ గంజాయిభద్ర మధ్య ఆశ్రమ పాఠశాల, కొండనుంచి వచ్చే ఊట నీరు కిందికి వృథాగా పోకుండా ట్యాంక్‌ల ద్వారా స్థానిక పంటలకు మరల్చడం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. గంజాయిభద్రలో పాఠశాల భవన నిర్మాణం అసలు వివాదం ఇదీ స్వాతంత్య్రానికి పూర్వం పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాల ఏర్పాటు ఆలోచన సాగింది. దానికోసం బ్రిటిష్ ప్రభుత్వం 1942లో సర్వే జరిపించింది. ఆ క్రమంలో ఏపీ–ఒడిశా మధ్య సరిహద్దుల్లోని 101 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో ఒడిశా రాష్ట్రంలో విలీనం చేయగా మిగిలిన కొటియా పంచాయతీ పరిధిలో 21 గ్రూపు గ్రామాల సంగతి తేల్చలేదు. ఈ గ్రామాలు తమవని ఒడిశా, ఆంధ్రా పట్టుబడుతున్నాయి. అప్పట్లో 21 మాత్రమే ఉన్న ఆ గ్రామాల సంఖ్య ఇప్పుడు 34కి పెరిగింది. ఇక్కడ 15 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో 3,813 మంది ఓటర్లు. వీరు ఆంధ్రాలోనూ, ఒడిశాలోనూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ గ్రామాల వివాదంపై రెండు రాష్ట్రాలు 1968లో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. నేటికీ పరిష్కారం లభించలేదు. గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాం.. అసెంబ్లీలో ప్రస్తావిస్తాం అక్టోబర్ 31న సాలూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి కొటియా గ్రామాల సమస్యను తీసుకువెళ్లాం. ఇరు రాష్ట్రాలను సమన్వయపరిచి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరాం. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొటియా ప్రజలకు మంచి జరిగేలా ప్రయత్నిస్తాం. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు ప్రభుత్వం పట్టించుకోవాలి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొటియా ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా మా ప్రాంతాన్ని విడిచిపెట్టేసింది. ఇప్పుడు ఒడిశా ప్రభు త్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. మాకు మాత్రం ఆంధ్రావైపు ఉండాలని ఉంది. – బీసు, మాజీ ఉప సర్పంచ్, గంజాయిభద్ర త్వరలో పర్యటిస్తా కొటియా గ్రామాల్లో త్వరలో పర్యటిస్తాను. ఈ గ్రామాల అభివృద్ధికి ఆం ధ్రా ప్రభుత్వం తరఫున కృషి చేస్తాం. దీనిపై సమ గ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. – బీఆర్ అంబేడ్కర్, ఐటీడీఏ పీవో, పార్వతీపురం -
గాంధీజీ ప్రమాదంలో చనిపోయారట!
భువనేశ్వర్: జాతిపిత మహాత్మా గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయారంటూ ఒడిశా విద్యా శాఖ ప్రచురించిన బుక్లెట్ తీవ్ర వివాదాస్పమైంది. దీనిపై రాజకీయ నేతలు, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ క్షమాపణ చెప్పాలని, తప్పును వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. గాంధీజీ హత్యను ప్రమాదంగా ప్రచురించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల నేపథ్యంలో ఆమా బాపూజీ: ఏక్ ఝలకా (మన బాపూజీ: ఒక సంగ్రహ అవలోకనం) పేరిట ప్రచురించిన ఈ రెండు పేజీల బుక్‌లెట్‌లో గాంధీకి సంబంధించిన విషయాలు వివరించారు. ఈ క్రమంలో 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ ఈ వివాదంపై విచారణకు ఆదేశించామని, ఆ బుక్లెట్లను ఉపసంహరించుకున్నామని తెలిపారు. -
గవర్నర్ ఘనకార్యం.. తీవ్ర విమర్శలు..!
భువనేశ్వర్ : ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోయాయి.. అనే సామెత అందరికీ తెలిసిందే. ఒడిషా గవర్నర్ గణేషీ లాల్ చేసిన పని కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇంతకు ముందు ఒడిషా గవర్నర్లుగా పనిచేసిన వారు ఏడాది మొత్తానికి చేసిన ఖర్చును ప్రస్తుత గవర్నర్ గణేషీ లాల్ ఒక్క పర్యటనతోనే సమం చేశారు. దీంతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. సొంత రాష్ట్రం హరియాణను సందర్శించడానికి ఒడిషా గవర్నర్ గణేషీ లాల్ గత జూన్‌లో ఛాపర్లో వెళ్లారు. ఆయన సొంత ప్రాంతం సిర్సాలో ఛాపర్ దిగడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఢిల్లీ వరకే వెళ్లారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు. దీంతో పర్యటన ఖర్చులన్నీ తడిసి మోపెడయ్యాయి. అయితే, 46 లక్షల రూపాయలు వ్యయం చేసే గవర్నర్ పర్యటనకు అనుమతిస్తూ రాష్ట్రపతి భవన్, ఒడిషా ప్రభుత్వం ఆమోద ముద్ర వేశాయి. ఈ విషయం ఒడిషా రాజ్‌భవన్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఇంతటి భారీ పర్యటనకు రాష్ట్రపతి భవన్, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కాగా, తనపై వస్తున్న విమర్శలపై గవర్నర్, బీజేపీ మాజీ నేత గణేషీ లాల్ మండిపడ్డారు. తన పర్యటన ఖర్చుపై తప్పుడు వివరాలు వెల్లడించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఒడిషా గవర్నరు పర్యటన నిమిత్తం ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే మొత్తం 11 లక్షలు కావడం గమనార్హం. -
పోలవరం పనులపై ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం
-
పోలవరం ముంపుపై రీ సర్వే!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం ప్రాజెక్టుతో సరిహద్దు రాష్ట్రాల్లో ఏర్పడుతున్న ముంపుపై కేంద్రం కొత్తగా సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ రాష్ట్రాల్లో ముంపుపై అధ్యయనం చేయాలంటూ తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లు ఓ వైపు కేంద్రం వద్ద, మరోవైపు సుప్రీంకోర్టులో కొట్లాడుతున్న దృష్ట్యా ముంపుపై రీసర్వే చేసే యోచనలో ఉన్నట్లు కేంద్ర వర్గాల ద్వారా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు 36 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహం ఆధారంగా 2005లో పలు రకాల క్లియరెన్స్‌లు రాగా, తదనంతరం గరిష్ట వరద ప్రవాహ అంచనాను 50లక్షల క్యూసెక్కులకు పెంచడంతో సర్వే అనివార్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ 1980లో ఇచ్చిన అవార్డును ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చేసిందని, దీంతో తాము ముంపునకు గురవుతున్నామని ఒడిశా ప్రభుత్వం ఎప్పటినుంచో వాదిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఇదే అంశమై రేలా అనే స్వచ్చంధ సంస్థ తెలంగాణ ముంపు ప్రాంతాలపై సైతం పిటిషన్లు వేయగా, దీనిపైనా తెలంగాణ తన అభిప్రాయాన్ని లిఖిత పూర్వకంగా అటు సుప్రీంకు, ఇటు ఎన్జీటీకి సమర్పించింది. ఇందులో ప్రాజెక్టు నిర్మాణంతో ఏర్పడుతున్న ముంపుపై పర్యావరణ నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని, తాజాఅంచనాలు తయారు చేసిన తర్వాతే పనులు మొదలుపెట్టాలని కేంద్ర పర్యావరణ శాఖ 2011 ఫిబ్రవరిలో ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో సూచించినా, ఏపీ ప్రభుత్వం తదుపరి అధ్యయనం చేయకపోవడం తమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలంగాణ తెలిపింది. అయితే ఈ వినతులపై అటు కేంద్రం కానీ, ఇటు ఏపీ కానీ ఎలాంటి నిర్ణయం చేయలేదు. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దీంతో బ్యాక్‌వాటర్ స్టడీస్ చేయాలని, తద్వారా ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ముంపును అధ్యయనం చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. -
34 ఏళ్ల తర్వాత ఖజానాను తెరుస్తున్నారు!
భువనేశ్వర్: పూరీలోని ప్రఖ్యాత జగన్నాథస్వామి ఆలయం రత్న భండార్(ఖజానా)ను దాదాపు 34 ఏళ్ల తర్వాత తెరిచేందుకు ఒడిశా ప్రభుత్వం ఆలయ నిర్వాహకులకు అనుమతిచ్చింది. రత్న భండార్ పటిష్టత, భద్రతల్ని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) పరీక్షిస్తుందని ఆలయ ప్రధాన నిర్వహణాధికారి పీకే జెనా తెలిపారు. ఖజానాలోని సంపదను లెక్కించబోమని స్పష్టం చేశారు. భక్తులు స్వామివారికి సమర్పించిన విలువైన ఆభరణాలు, రాళ్లను ఈ ఖజానాలో భద్రపర్చినట్లు వెల్లడించారు. రత్న భండార్‌ను తెరవడంపై గురువారం ఆలయ పూజారులతో చర్చించి విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. 1984లో ఈ ఆలయంలో పనిచేసిన ఆర్.ఎన్.మిశ్రా మాట్లాడుతూ.. అప్పట్లో ఖజానాలోని 7 గదుల్లో మూడింటినే తాము తెరవగలిగామని చెప్పా రు. తనిఖీల కోసం నాలుగో గదికి దగ్గరకు వెళ్లగానే పాములు బుసలుకొట్టిన శబ్దాలు విన్పించాయన్నా రు. జగన్నాథస్వామి ఆలయ పునరుద్ధరణ పనుల్ని ఒడిశా హైకోర్టు పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. -
పాడ్‌మన్ స్ఫూర్తిని చాటిన ఒడిశా
సాక్షి, భువనేశ్వర్ : అక్షయ్‌కుమార్ పాడ్‌మన్ మూవీ పలువురిని కదిలిస్తోంది. ఒడిశా ప్రభుత్వం ఖుషీ పేరుతో స్కూల్ విద్యార్థినులకు ఉచిత శానిటీరీ ప్యాడ్స్ పంపిణీ పథకాన్ని చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్ధినులందరికీ ఉచితంగా శానిటరీ నాప్కిన్లను అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. రాష్ట్రంలో 17 లక్షల మంది స్కూల్ విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందించే పథకం ప్రవేశపెడుతున్నామని, సబ్సిడీ ధరలకు ఇతర మహిళలు, విద్యార్థినులకు వీటిని పంపిణీ చేసే ఉద్దేశం ఉందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో స్కూల్ విద్యార్థినుల్లో పరిశుభ్రత, ఆరోగ్యం మెరుగై మహిళా సాధికారత దిశగా అడుగులుపడతాయని చెప్పుకొచ్చారు. పాఠశాల విద్యార్థినులు విద్యను కొనసాగించేందుకూ ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
పోలవరంపై ఒడిశా మరో రెండు పిటిషన్లు
-
పోలవరంపై ఒడిశా మరో రెండు పిటిషన్లు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన మరో రెండు మధ్యంతర పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. పోలవరం ప్రాజెక్టుపై తమ ప్రధాన పిటిషన్లో సవరణలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఒకటి, గిరిజన ప్రాంతాలకు ముప్పు ఉందన్న తమ అభ్యంతరాలకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు మద్దతిస్తున్నందున విచారణలో వారిని కూడా భాగస్వాములను చేయాలని కోరుతూ మరో పిటిషన్‌ను ఒడిశా దాఖలు చేసింది. వీటిని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఒడిశా వాదనపై వైఖరి చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు కేంద్ర జలవనరులు శాఖకు ధర్మాసనం నోటీసు జారీచేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలంది. విచారణలో తొలుత ఒడిశా తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్‌ధవన్ వాదనలు వినిపించారు. తర్వాత ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపిస్తూ.. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలతో తెలంగాణకు సంబంధం లేదు. వారిని భాగస్వాములుగా చేర్చాల్సిన పనిలేదు’ అని పేర్కొన్నారు. ఏపీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు, న్యాయవాది గుంటూరు ప్రభాకర్ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో తమను భాగస్వాములను చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు గతంలో మధ్యంతర దరఖాస్తులను దాఖలు చేయగా.. అందుకు సుప్రీం కోర్టు సమ్మతించింది. పోలవరం ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లిస్తున్నందున బచావత్ అవార్డు ప్రకారం ఆ జలాల్లో తమకు వాటా దక్కాల్సి ఉందని ఆ రెండు రాష్ట్రాల న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే తదుపరి విచారణ తేదీని ధర్మాసనం ప్రకటించాల్సి ఉంది. -
పోలవరానికి వ్యతిరేక కూటమి?
సీజేసీ, టీఆర్ఎస్తో బీజేడీ స్నేహహస్తం భువనేశ్వర్: పోలవరం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ప్రభావిత రాష్ట్రాలతో కలిసి ముందుకు వెళ్లాలని ఒడిశా రాష్ట్రంలోని అధికార బీజేడీ భావిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రభావితమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే సీజేసీ, టీఆర్ఎస్ ఇటీవల ఉమ్మడిగా సమావేశ మయ్యాయని తెలిసింది. ఈప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. ప్రాజెక్ట్ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వేగవంతం చేసిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ పనుల్ని ఆపేందుకు పొరుగు ప్రభావిత రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో రాజకీయ శక్తులతో చేతులు కలిపేందుకు బీజేడీ సన్నాహాలు చేపట్టింది. ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ (సీజేసీ), తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లతో స్నేహహస్తం చాచింది. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించే వర్గాల్ని కలుపుకోవడంలో అభ్యంతరం లేదని టీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు తెలిసింది. సీజేసీ, టీఆర్ఎస్ ముందుకొస్తే తమకు అభ్యంతరం లేదని బీజేడీ అధికార ప్రతినిధి శశిభూషణ్ బెహరా తెలిపారు. -
గిరిజన మున్సి‘పోల్స్’కు గ్రీన్‌సిగ్నల్!
♦ మణుగూరు, మందమర్రి, పాల్వంచల్లో ఎన్నికలకు తొలగనున్న అడ్డంకి ♦ గవర్నర్ అనుమతితో నిర్వహణకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ సరవణ జరగక ఎన్నికలకు నోచుకోని షెడ్యూల్డ్ ప్రాంత మున్సిపాలిటీలైన మణుగూరు, మందమర్రి, పాల్వంచలలో ఎట్టకేలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యాంగ సవరణ కోసం వేచి చూడకుండా ఒడిశా తరహాలో గవర్నర్ ప్రత్యేక అనుమతితో ఈ పురపాలికల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ మున్సిపాలిటీలు ఉండటంతో ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రాజ్యాంగ సవరణతోనే ఇది సాధ్యం కావడంతో ఈ మున్సిపాలిటీలు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు. అయితే ఒడిశా ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక అనుమతితో గిరిజనులకు 50 శాతం వార్డులు, చైర్మన్ పదవిని రిజర్వ్ చేయడం ద్వారా షెడ్యూల్డ్ ప్రాంత మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించింది. ఈ తరహాలోనే ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, ఖమ్మం జిల్లా మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు మున్సిపాలిటీల్లోని 50 శాతం వార్డులతోపాటు చైర్మన్ పదవులను గిరిజనులకు రిజర్వ్ చేసి ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ మంగళవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు లేఖ రాసింది. -
'రథయాత్ర' లో వైద్యులకు నో లీవ్
భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రంలో జూలై 1 నుంచి ఆగస్టు వరకు జరగనున్న పూరీ జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని 280 మంది వైద్యులు, 650 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు అందించనున్నట్టు ఒడిషా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. నబకాలేబర్ గా పిలిచే ఈ పవిత్ర ఉత్సవంలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. జగన్నాథ ఆలయం వద్ద స్వామి వారి తోబుట్టువుల పాత ప్రతిమలను మార్చి వాటి స్థానంలో కొత్త దేవతల ప్రతిమలు ప్రతిష్ఠించి ఈ ఉత్సవాలు చేసుకుంటారు. ఈ ప్రతిమల ఊరేగింపు కార్యక్రమం జూలై 18న జరగనుంది. రథయాత్ర ఊరేగింపులో భక్తులకు సౌకర్యార్థం అత్యవసర చికిత్స అందుబాటులో ఉండేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వైద్యులకు, పారామెడికల్ వైద్యసిబ్బందికి సూచనలు చేసింది. ఎవరైనా దీనికి రాలేమని చెబితే.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అత్ను సబ్యాషి నాయక్ మీడియాకు వెల్లడించారు. ఈ విషయంలో ఒడిషా ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించనుంది. ఈ యాత్ర సమయంలో వైద్యులకు సెలవులు మంజూరు చేయబోమంటూ తేల్చిచేప్పేసింది. ఏదైనా అత్యవసరమైతే తప్ప వైద్యులకు సెలవులు మంజూరు చేస్తామని, దానికి కూడా వైద్య కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. రథ యాత్ర జరిగే ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకూ వైద్యల కొరత లేకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల వైద్యులను కూడా రప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ రథయాత్రకు 50 లక్షల మంది వరకు భక్తులు తరలిరానున్నట్టు ఒడిషా ప్రభుత్వం అంచనా వేస్తోంది.