
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, భువనేశ్వర్ : అక్షయ్‌కుమార్ పాడ్‌మన్ మూవీ పలువురిని కదిలిస్తోంది. ఒడిశా ప్రభుత్వం ఖుషీ పేరుతో స్కూల్ విద్యార్థినులకు ఉచిత శానిటీరీ ప్యాడ్స్ పంపిణీ పథకాన్ని చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్ధినులందరికీ ఉచితంగా శానిటరీ నాప్కిన్‌లను అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు.
రాష్ట్రంలో 17 లక్షల మంది స్కూల్ విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్‌లను ఉచితంగా అందించే పథకం ప్రవేశపెడుతున్నామని, సబ్సిడీ ధరలకు ఇతర మహిళలు, విద్యార్థినులకు వీటిని పంపిణీ చేసే ఉద్దేశం ఉందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో స్కూల్ విద్యార్థినుల్లో పరిశుభ్రత, ఆరోగ్యం మెరుగై మహిళా సాధికారత దిశగా అడుగులుపడతాయని చెప్పుకొచ్చారు. పాఠశాల విద్యార్థినులు విద్యను కొనసాగించేందుకూ ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment