♦ మణుగూరు, మందమర్రి, పాల్వంచల్లో ఎన్నికలకు తొలగనున్న అడ్డంకి
♦ గవర్నర్ అనుమతితో నిర్వహణకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ సరవణ జరగక ఎన్నికలకు నోచుకోని షెడ్యూల్డ్ ప్రాంత మున్సిపాలిటీలైన మణుగూరు, మందమర్రి, పాల్వంచలలో ఎట్టకేలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యాంగ సవరణ కోసం వేచి చూడకుండా ఒడిశా తరహాలో గవర్నర్ ప్రత్యేక అనుమతితో ఈ పురపాలికల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ మున్సిపాలిటీలు ఉండటంతో ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రాజ్యాంగ సవరణతోనే ఇది సాధ్యం కావడంతో ఈ మున్సిపాలిటీలు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు.
అయితే ఒడిశా ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక అనుమతితో గిరిజనులకు 50 శాతం వార్డులు, చైర్మన్ పదవిని రిజర్వ్ చేయడం ద్వారా షెడ్యూల్డ్ ప్రాంత మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించింది. ఈ తరహాలోనే ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, ఖమ్మం జిల్లా మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు మున్సిపాలిటీల్లోని 50 శాతం వార్డులతోపాటు చైర్మన్ పదవులను గిరిజనులకు రిజర్వ్ చేసి ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ మంగళవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు లేఖ రాసింది.
గిరిజన మున్సి‘పోల్స్’కు గ్రీన్‌సిగ్నల్!
Published Wed, Mar 30 2016 2:16 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
Advertisement