హైదరాబాద్ : ఉగాది పర్వదినంపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 30వ తేదీనా? లేక 31వ తేదీనా? జరుపుకోవాలా అనే దానిపై ప్రజల్లో అయోమయం నెలకొంది. ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మాత్రం 30వ తేదీ ఉగాది నిర్వహిస్తున్నారు. దీంతో ఈ పరిస్థితి తలెత్తింది. శ్రీ జయనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణాన్నీ అదే రోజు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల కోడ్ ఉండటంతో.. ఈ ఉత్సవాలకు రాజకీయ నాయకులు లేకుండా..గవర్నర్ నిర్వహించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే రాజకీయతేర ప్రముఖులకు, ఉన్నతాధికారులకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానాలు అందాయి. మరోవైపు తిరుమలతో పాటు భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 31నే ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఉగాది పర్వదినంపై సందిగ్ధత
Published Fri, Mar 28 2014 1:18 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
Advertisement
Advertisement