Jaya nama samastaram
-
ఉగాది ఉషస్సు
-
విజయం మీదే
నూతనోత్సాహంతో ఉగాదికి స్వాగతం నగరంలో సందడే సందడి సాక్షి, బెంగళూరు :ఆనందాల తీపి, అలకల పులుపు, కష్టాల చేదు, కోపతాపాల కారం.. ఇలా వివిధ రుచులు కలగలిపిన ఉగాది పచ్చడిలా మనిషి జీవితం కూడా అన్ని అనుభూతుల సమాహారం. అందుకే ఉగాది అంటే ఓ సరికొత్త సంవత్సరానికి ఆరంభం మాత్రమే కాదు, మనిషి జీవితం కష్ట సుఖాలు, జయాపజయాల సమాహారం అని తెలియజెప్పే సరికొత్త స్పూర్తికి ఆరంభం కూడా. చెట్లన్నీ కొత్త చిగుళ్లను తొడుక్కొన్న ఆమని వసంతాన, కుహూ కుహూ కూతల కోయిలల సంగీతం నడుమ ‘జయ నామ’ సంవత్సరం అందరి ముం గిళ్లలో అడుగుపెట్టింది. ఉగాది పండుగను ఘనం గా జరుపుకునేందుకు నగర వాసులు సైతం సన్నద్ధమయ్యారు. దీంతో నగరంలోని ప్రముఖ మార్కెట్లన్నీ పండుగ సందడితో కళకళల్లాడుతున్నాయి. ముఖ్యంగా వేప, వేప పువ్వు, మామిడాకులతో పాటు అన్ని రకాల పూలు, పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. అయినా మార్కెట్లన్నింటిలో కొనుగోళ్లు హుషారుగానే సాగాయి. ఇక ఉగాది సందర్భంగా బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యే క పూజలు కొగుతున్నాయి. -
‘మధు’పర్కాలు
రామదుర్గం మధుసూదనరావు ‘పచ్చ’డి బాబు ఉగాది వేళ బాబు తన అభి‘రుచి’మేరకు ప్రజలకు (వారికి ఇష్టమున్నా లేకున్నా) వడ్డిస్తున్న ఆరు రుచుల ‘పచ్చ’డి..! చేదు: ఔను నాగతం చేదు ఒప్పుకున్నా పోనిద్దు ఓసారైనా ఓటేద్దు ఓటమిలో నెట్టొద్దు! పులుపు: చావలేదు పులుపు ఇస్తున్నా పిలుపు అందరిదీ బలుపు నాదొక్కటే గెలుపు! కారం: అల్లదివో అధి‘కారం’ మీతోటే సా‘కారం’ కావాలి సహ‘కారం’ వెళ్దాం ఆ ప్ర‘కారం’! (తమ్ముళ్లూ.. కారం ఎక్కువైంది.. అలవాటు చేసుకోండి) ఉప్పు: పాయసంలో ఉప్పు వెరైటీ కాదా చెప్పు పవరిస్తే ఏం తప్పు ముంచితేనేం ముప్పు! వగరు: నా పాలన వగరు అనడమే పొగరు హైటెక్కు నగరు అదే నా మొహరు! తీపి: సీఎం పోస్టే తీపి వండాలన్నీ కలిపి నా వెనకే బీజేపీ ఆ వెంటే మన జేపీ! -
ఉగాది పర్వదినంపై సందిగ్ధత
హైదరాబాద్ : ఉగాది పర్వదినంపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 30వ తేదీనా? లేక 31వ తేదీనా? జరుపుకోవాలా అనే దానిపై ప్రజల్లో అయోమయం నెలకొంది. ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మాత్రం 30వ తేదీ ఉగాది నిర్వహిస్తున్నారు. దీంతో ఈ పరిస్థితి తలెత్తింది. శ్రీ జయనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణాన్నీ అదే రోజు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉండటంతో.. ఈ ఉత్సవాలకు రాజకీయ నాయకులు లేకుండా..గవర్నర్ నిర్వహించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే రాజకీయతేర ప్రముఖులకు, ఉన్నతాధికారులకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానాలు అందాయి. మరోవైపు తిరుమలతో పాటు భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 31నే ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.