రామదుర్గం మధుసూదనరావు
‘పచ్చ’డి బాబు
ఉగాది వేళ బాబు
తన అభి‘రుచి’మేరకు ప్రజలకు
(వారికి ఇష్టమున్నా
లేకున్నా) వడ్డిస్తున్న
ఆరు రుచుల ‘పచ్చ’డి..!
చేదు:
ఔను నాగతం చేదు
ఒప్పుకున్నా పోనిద్దు
ఓసారైనా ఓటేద్దు
ఓటమిలో నెట్టొద్దు!
పులుపు:
చావలేదు పులుపు
ఇస్తున్నా పిలుపు
అందరిదీ బలుపు
నాదొక్కటే గెలుపు!
కారం:
అల్లదివో అధి‘కారం’
మీతోటే సా‘కారం’
కావాలి సహ‘కారం’
వెళ్దాం ఆ ప్ర‘కారం’!
(తమ్ముళ్లూ..
కారం ఎక్కువైంది..
అలవాటు చేసుకోండి)
ఉప్పు:
పాయసంలో ఉప్పు
వెరైటీ కాదా చెప్పు
పవరిస్తే ఏం తప్పు
ముంచితేనేం ముప్పు!
వగరు:
నా పాలన వగరు
అనడమే పొగరు
హైటెక్కు నగరు
అదే నా మొహరు!
తీపి:
సీఎం పోస్టే తీపి
వండాలన్నీ కలిపి
నా వెనకే బీజేపీ
ఆ వెంటే
మన జేపీ!
‘మధు’పర్కాలు
Published Mon, Mar 31 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
Advertisement