ప్రముఖ కార్పొరేట్ సంస్థలలో ఒకటైన 'జేఎస్‌డబ్ల్యు గ్రూప్' త్వరలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV), ఈవీ బ్యాటరీ తయారీ విభాగంలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. త్వరలో ఏర్పాటు చేయనున్న మెగా మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల కోసం కంపెనీ ఏకంగా రూ.40,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీకి జిందాల్ స్టీల్ ఓడిశాలోని కటక్ వద్ద ఓ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, ఎలక్ట్రిక్ విడి భాగాల తయారీకి పరదీప్ (Paradip)లో ఒక యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ రెండు ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి సంస్థ రూ. 40వేలకోట్లు పెట్టుబడి పెట్టనుంది.
కటక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం రూ. 25000 కోట్లు, పరదీప్‌లో యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ. 15000 కోట్లు వెచ్చించనుంది. ఈ రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యూనిట్లు రెండు దశల్లో పూర్తి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సంస్థల్లో పూర్తిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్!
జిందాల్ గ్రూప్ ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్స్ వల్ల 11,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రత్యక్ష ఉపాధి మాత్రమే కాకుండా ఈ ప్లాంట్స్ నిర్మాణం పూర్తయిన తరువాత పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి జిందాల్ స్టీల్ అడుగుపెట్టడంతో దేశీయ ఉత్పత్తులు మెరుగుపడతాయని స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment