JSW Group
-
ప్రతి మూడు నెలలకు ఓ కొత్త కారు
ముంబై: చైనాకు చెందిన ఎస్ఏఐసీతో దేశీ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ’జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. సెపె్టంబర్ నుంచి మొదలుపెట్టి ప్రతి 3–4 నెలలకు ఓ కొత్త కారును ఆవిష్కరించాలని భావిస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఎస్ఏఐసీతో భాగస్వామ్యం ఖరారు చేసుకోవడాన్ని ప్రకటించిన సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, హలోల్‌లో (గుజరాత్) ఇప్పుడు తమకున్న ప్లాంటుకు దగ్గర్లోనే మరో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా గౌరవ చైర్మన్ రాజీవ్ చాబా తెలిపారు. దీనితో తమ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1 లక్ష యూనిట్ల నుంచి 3 లక్షలకు పెరుగుతుందన్నారు. సామర్థ్యాల పెంపు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై భాగస్వాములు భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మారుతీ తరహా విప్లవం.. కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల (ఎన్ఈవీ) విభాగంలో ఈ జేవీ ’మారుతీ తరహా విప్లవాన్ని’ తేగలదని సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. ‘నలబై ఏళ్ల క్రితం మారుతీ మార్కెట్లోకి వచి్చన తర్వాత ఆటో పరిశ్రమను మార్చేసింది. సమర్ధమంతమైన, తేలికైన, అధునాతనమైన కార్లను ప్రవేశపెట్టి ఇప్పుడు మార్కెట్ లీడరుగా ఎదిగింది. అంబాసిడర్లు, ఫియట్లు కనుమరుగయ్యాయి. కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల విభాగంలో ఎంజీ కూడా ఆ ఫీట్‌ను పునరావృతం చేయగలదని విశ్వసిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. 2030 నాటికి ఏటా 10 లక్షల యూనిట్ల విక్రయాలతో ఎన్ఈవీ విభాగంలో తమ సంస్థ మార్కెట్ లీడరుగా ఎదగాలని నిర్దేశించుకున్నట్లు జిందాల్ వివరించారు. ఎంజీ మోటర్ మాతృ సంస్థ అయిన ఎస్ఏఐసీ మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ గతేడాది నవంబర్‌లో జేవీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కొత్త స్వరూపం ప్రకారం జేవీలో జేఎస్డబ్ల్యూకి 35 శాతం, భారతీయ ఫైనాన్షియల్ సంస్థలకు 8 శాతం, ఎంజీ మోటార్ డీలర్లకు 3 శాతం, ఉద్యోగులకు 5 శాతం, మిగతా 49 శాతం వాటాలు ఎస్ఏఐసీకి ఉంటాయి. కాగా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ – ఎస్ఏఐసీ మోటార్ జాయింట్ వెంచర్ క్రింద అభివృద్ధి చేసిన ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ జరిగింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పార్త్ జిందాల్, ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రూ.40 వేల కోట్ల పెట్టుబడి.. 11000 జాబ్స్ - ప్రభుత్వంతో జేఎస్‌డబ్ల్యు ఒప్పందం
ప్రముఖ కార్పొరేట్ సంస్థలలో ఒకటైన 'జేఎస్‌డబ్ల్యు గ్రూప్' త్వరలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV), ఈవీ బ్యాటరీ తయారీ విభాగంలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. త్వరలో ఏర్పాటు చేయనున్న మెగా మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల కోసం కంపెనీ ఏకంగా రూ.40,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీకి జిందాల్ స్టీల్ ఓడిశాలోని కటక్ వద్ద ఓ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, ఎలక్ట్రిక్ విడి భాగాల తయారీకి పరదీప్ (Paradip)లో ఒక యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ రెండు ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి సంస్థ రూ. 40వేలకోట్లు పెట్టుబడి పెట్టనుంది. కటక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం రూ. 25000 కోట్లు, పరదీప్‌లో యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ. 15000 కోట్లు వెచ్చించనుంది. ఈ రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యూనిట్లు రెండు దశల్లో పూర్తి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సంస్థల్లో పూర్తిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్! జిందాల్ గ్రూప్ ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్స్ వల్ల 11,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రత్యక్ష ఉపాధి మాత్రమే కాకుండా ఈ ప్లాంట్స్ నిర్మాణం పూర్తయిన తరువాత పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి జిందాల్ స్టీల్ అడుగుపెట్టడంతో దేశీయ ఉత్పత్తులు మెరుగుపడతాయని స్పష్టంగా తెలుస్తోంది. -
సీఎం వైఎస్ జగన్ తో జేఎస్ డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ భేటీ
-
విద్యుత్ వాహనాల్లోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రస్తుతం దీనిపై గ్రూప్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వివిధ రంగాల్లోకి కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలను వివరిస్తూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ శేషగిరి రావు ఈ విషయాలు తెలిపారు. నాలుగు చక్రాల వాహనాల తయా రీ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి ప్లాంటును ఎప్ప ట్లోగా ప్రారంభించే అవకాశం ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం ప్రణాళికలు తుది దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు తమిళనాడులోని సేలంలో మిలియన్ టన్నుల వార్షికోత్పత్తి సా మర్థ్యంతో ఉక్కు ప్లాంటు ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు సహా ఆటోమొబైల్ కంపెనీలకు అవసరమయ్యే హై– వేల్యూ ఉక్కును ఈ ప్లాంటులో తయారు చేస్తున్నారు. అలాగే ఇన్ఫ్రా, సిమెంటు, పెయింట్స్ మొదలైన వివిధ రంగాల్లోనూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ విస్తరించింది. -
ఫైనాన్స్ వ్యాపారంలోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్
ముంబై: సజ్జన్ జిందాల్ సారథ్యంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా రుణాల వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఈ–కామర్స్ విభాగమైన జేఎస్‌డబ్ల్యూ వన్ ప్లాట్‌ఫామ్స్ (జేఎస్‌డబ్ల్యూవోపీ) కింద గ్రూప్‌లోని సంస్థల అవసరాల కోసం జేఎస్‌డబ్ల్యూ వన్ ఫైనాన్స్ పేరిట నాన్–బ్యాంక్ ఫైనాన్స్ సంస్థ (ఎన్బీఎఫ్సీ)ని ఏర్పాటు చేస్తోంది. అందులో రెండేళ్ల వ్యవధిలో రూ. 350– రూ. 400 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో లైసెన్సు కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోనున్నట్లు, ఆ తర్వా 7–9 నెలల్లో నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు జేఎస్‌డబ్ల్యూవోపీ సీఈవో గౌరవ్ సచ్‌దేవా చెప్పారు. ఇందులో దాదాపు 200 మంది వరకూ సిబ్బంది ఉంటారు. ఆ తర్వాత క్రమంగా గ్రూప్‌లోని సిమెంటు, స్టీల్, పెయింట్స్ తదితర ఇతర కంపెనీలకు ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అందిస్తుంది. తమ క్లయింట్లుగా ఉన్న లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు బ్యాంకింగ్ రంగం నుంచి తోడ్పాటు ఎక్కువగా లభించదని, ఈ నేపథ్యంలోనే వాటి అవసరాలను తీర్చేందుకు ఎన్బీఎఫ్సీని ఏర్పాటు చేస్తున్నట్లు సచ్‌దేవా చెప్పారు. -
బంపరాఫర్..! ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రూ. 3 లక్షల ప్రోత్సాహకాలు..!
బంపరాఫర్..! ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ప్రముఖ దేశీయ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తమ ఉద్యోగుల కోసం సరికొత్త పాలసీను ప్రకటించింది. సంప్రాదాయ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై ఆయా దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం కొత్త పాలసీలతో ముందుకువస్తున్నాయి. తాజాగా ప్రముఖ దేశీయ దిగ్గజ కంపెనీ జేఎస్డబ్య్లూ గ్రూప్ గ్రీన్ ఇనిషియేటివ్‌లో భాగంగా తమ ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీని ప్రారంభించింది. 3 లక్షలకు వరకు ప్రోత్సాహకాలు..! 2022 జనవరి 1 నుంచి ఈ కొత్త ఈవీ పాలసీ అమల్లోకి రానుంది. తమ ఉద్యోగులను ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కంపెనీ పెట్టుకుంది. కొత్త ఈవీ పాలసీతో నాలుగు చక్రాల వాహనాలు, అలాగే ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడానికి రూ. 3 లక్షల వరకు జేఎస్‌డబ్ల్యూ ప్రోత్సాహకాలను అందించనుంది. వీటితో పాటుగా ఉద్యోగుల కోసం అన్ని జేఎస్‌డబ్ల్యూ కార్యాలయాలు , ప్లాంట్లల్లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఉచిత ఛార్జింగ్ స్టేషన్లను, గ్రీన్ జోన్ పార్కింగ్ స్లాట్లను కూడా ఏర్పాటుచేయనుంది. ఈ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ... 2070 వరకు కర్భన ఉద్గారాలను సున్నాకు తెచ్చేవిధంగా కాప్-26లో భారత్ చేసిన వాగ్దానానికి మా కంపెనీ నిబద్ధతతో ఉందని అన్నారు. చదవండి: 2022లో పెరగనున్న కార్లు, బైక్స్ కంపెనీల జాబితా ఇదే..!