న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రస్తుతం దీనిపై గ్రూప్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వివిధ రంగాల్లోకి కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలను వివరిస్తూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ శేషగిరి రావు ఈ విషయాలు తెలిపారు. నాలుగు చక్రాల వాహనాల తయా రీ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి ప్లాంటును ఎప్ప ట్లోగా ప్రారంభించే అవకాశం ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం ప్రణాళికలు తుది దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు తమిళనాడులోని సేలంలో మిలియన్ టన్నుల వార్షికోత్పత్తి సా మర్థ్యంతో ఉక్కు ప్లాంటు ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు సహా ఆటోమొబైల్ కంపెనీలకు అవసరమయ్యే హై– వేల్యూ ఉక్కును ఈ ప్లాంటులో తయారు చేస్తున్నారు. అలాగే ఇన్‌ఫ్రా, సిమెంటు, పెయింట్స్ మొదలైన వివిధ రంగాల్లోనూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ విస్తరించింది.
Comments
Please login to add a commentAdd a comment