battery unit
-
రూ.40 వేల కోట్ల పెట్టుబడి.. 11000 జాబ్స్ - ప్రభుత్వంతో జేఎస్‌డబ్ల్యు ఒప్పందం
ప్రముఖ కార్పొరేట్ సంస్థలలో ఒకటైన 'జేఎస్‌డబ్ల్యు గ్రూప్' త్వరలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV), ఈవీ బ్యాటరీ తయారీ విభాగంలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. త్వరలో ఏర్పాటు చేయనున్న మెగా మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల కోసం కంపెనీ ఏకంగా రూ.40,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీకి జిందాల్ స్టీల్ ఓడిశాలోని కటక్ వద్ద ఓ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, ఎలక్ట్రిక్ విడి భాగాల తయారీకి పరదీప్ (Paradip)లో ఒక యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ రెండు ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి సంస్థ రూ. 40వేలకోట్లు పెట్టుబడి పెట్టనుంది. కటక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం రూ. 25000 కోట్లు, పరదీప్‌లో యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ. 15000 కోట్లు వెచ్చించనుంది. ఈ రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యూనిట్లు రెండు దశల్లో పూర్తి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సంస్థల్లో పూర్తిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్! జిందాల్ గ్రూప్ ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్స్ వల్ల 11,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రత్యక్ష ఉపాధి మాత్రమే కాకుండా ఈ ప్లాంట్స్ నిర్మాణం పూర్తయిన తరువాత పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి జిందాల్ స్టీల్ అడుగుపెట్టడంతో దేశీయ ఉత్పత్తులు మెరుగుపడతాయని స్పష్టంగా తెలుస్తోంది. -
Ola Electric: బ్యాటరీ సెల్స్ తయారీలోకి ఓలా!
న్యూఢిల్లీ: బ్యాటరీ సెల్స్ తయారీలోకి ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశిస్తోంది. 50 గిగావాట్ అవర్స్ వరకు సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేయాలన్నది కంపెనీ ప్రణాళిక. ఇందుకోసం జర్, సీమెన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఓలా ఎలక్ట్రిక్ చర్చిస్తోంది. వీటిలో జర్మనీ, కొరియా, జపాన్ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణ కొరియా నుంచి బ్యాటరీ సెల్స్‌ను కంపెనీ దిగుమతి చేసుకుంటోంది. సెల్ బ్యాటరీ ప్లాంటుకు రూ.7,700 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. తొలుత ఒక గిగావాట్ అవర్ వార్షిక సామర్థ్యంతో ఈ కేంద్రం వచ్చే అవకాశం ఉంది. రెండేళ్లలో అధునాతన సెల్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి భారత్‌లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద ఎంపికైన తొలి ఆటో, ఈవీ కంపెనీ తమదేనని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. చదవండి: బిజినెస్ ‘బాహుబలి’ భవీశ్ -
అమెరికన్ బ్యాటరీల సంస్థలో రిలయన్స్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా అమెరికాకు చెందిన సంస్థ ఆంబ్రీలో ఇన్వెస్ట్ చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేసిన పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ (ఆర్ఎన్ఈఎస్ఎల్) ద్వారా 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆంబ్రీ సంస్థ పవర్ గ్రిడ్లకు అవసరమైన బ్యాటరీలను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సహా పలువురు ఇన్వెస్టర్లు 144 మిలియన్ డాలర్లు ఇందులో ఇన్వెస్ట్ చేస్తుండగా.. ఆర్ఎన్ఈఎస్ఎల్ కూడా కొంత మేర పెట్టుబడులు పెడుతోంది. దీనితో ఆంబ్రీలో ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌కు 4.23 కోట్ల షేర్లు లభిస్తాయి. ఈ నిధులను తయారీ కేంద్ర నిర్మాణం, టెక్నాలజీ విక్రయం తదితర అవసరాల కోసం ఆంబ్రీ వినియోగించనుంది. 2022లో తమ లిక్విడ్ మెటల్ గ్రిడ్ బ్యాటరీ సాంకేతికతను వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవాలని కంపెనీ భావిస్తోంది. లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే సగం ధరకే ఈ టెక్నాలజీతో బ్యాటరీలను తయారు చేయొచ్చు. మరోవైపు, భారత్‌లో భారీ స్థాయి బ్యాటరీ తయారీ కేంద్రం ఏర్పాటుపై కూడా ఆర్ఎన్ఈఎస్ఎల్, ఆంబ్రీ చర్చలు జరుపుతున్నాయి. -
హైదరాబాద్ స్థలాన్ని విక్రయించిన ఎవరెడీ
హైదరాబాద్: బ్యాటరీల తయారీలో ఉన్న బి.ఎమ్.ఖైతాన్ గ్రూప్ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్.. హైదరాబాద్‌లో ఉన్న స్థలాన్ని న్యూలాండ్ టెక్నాలజీస్‌కు విక్రయించింది. డీల్ విలువ రూ.100 కోట్లు. మౌలాలి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో ఇది నెలకొని ఉంది. విక్రయం ద్వారా వచ్చిన వనరులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని ఎవరెడీ ఇండస్ట్రీస్ ఎండీ అమృతాంశు ఖైతాన్ వెల్లడించారు. ఆర్థిక వనరులు లేకపోవడంతో ఇక్కడి ప్లాంటులో ఉత్పత్తి 2010 నుంచి నిలిచిపోయింది. 2018 డిసెంబరులో కంపెనీ చెన్నైలో ఉన్న స్థలాన్ని సైతం అమ్మింది. ఒలింపియా గ్రూప్ రూ.100 కోట్లకు దీనిని దక్కించుకుంది. రుణాలను తగ్గించుకోవడమే.. ఎవరెడీకి పలు చోట్ల స్థలాలు ఉన్నాయి. ‘కీలకం కాని ఆస్తుల విక్రయమంటే కంపెనీ రుణాలను తగ్గించడమే. ఇక ఇతర స్థలాలు, ఆస్తుల విక్రయం ఆలోచన ఇప్పట్లో లేదు’ అని అమృతాంశు పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న టీ వ్యాపారాన్ని ఈ ఏడాది జూలైలో మధు జయంతి ఇంటర్నేషనల్‌కు ఎవరెడీ రూ.6 కోట్లకే విక్రయించింది. -
రాష్ట్రానికి బ్యాటరీ యూనిట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐదు గిగావాట్ల సామర్థ్యంగల లిథియమ్ అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. బ్యాటరీ తయారీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ శుక్రవారం వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. భారీ బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్ బ్యాంకు తమ వద్ద ఉందని సీఎస్ వెల్లడించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు ఔటర్ రింగురోడ్డుకు అత్యంత సమీపంలో బ్యాటరీ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన భూమి అందుబాటులో ఉందన్నారు. బ్యాటరీ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపుతోపాటు నీరు, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు, నైపుణ్యంగల మానవవనరులు కూడా అందుబాటులో ఉన్నాయని సీఎస్ వెల్లడించారు. బ్యాటరీ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు, మెరుగైన పారిశ్రామిక విధానం రాష్ట్రంలో అమల్లో ఉందని వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. భారీ బ్యాటరీ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం అనువైనదిగా పేర్కొన్న సీఎస్.. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ ద్వారా అనుమతులు సులభతరంగా ఇస్తామన్నారు. బ్యాటరీ యూనిట్ ఏర్పాటు చేసే పక్షంలో భూమి, ఇతర మౌలిక సౌకర్యాలు, అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ‘ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ’అమలవుతోందని, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దేశంలోనే అతిపెద్ద ‘ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్’ఉందని సీఎస్ వెల్లడించారు. 2025 నాటికి ఎలక్ట్రానిక్ వాహనాలు... భారీ లిథియం అయాన్ బ్యాటరీ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ ముందుకు రావడంపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ రాష్ట్రాన్ని అభినందించారు. దేశంలో ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో బ్యాటరీ యూనిట్లు నిర్మిస్తామన్నారు. 2023 నాటికి దేశంలోని అన్ని త్రిచక్ర వాహనాలు, 2025 నాటికి ద్విచక్ర వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాలు పనిచేసేందుకు వీలుగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) సాఫ్ట్ లోన్లు, రూఫ్‌టాప్ ఇన్స్టలేషన్స్, మైక్రో గ్రిడ్లు తదితరాలను ప్రోత్సాహకాలుగా ఇస్తుందని అమితాబ్ కాంత్ తెలిపారు. కాగా, ‘ట్రాన్‌ఫార్మేటివ్ మొబిలిటీ, స్మార్ట్ స్టోరేజ్’పై నీతి ఆయోగ్ సీఈఓ అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ‘ఇంటర్ మినిస్టీరియల్ స్టీరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసింది. -
అమర రాజా కొత్త బ్యాటరీ యూనిట్లో ఉత్పత్తి షురూ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తాము కొత్తగా ఏర్పాటుచేసిన బ్యాటరీ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్లు అమర రాజా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. నాలుగు చక్రాల వాహనాలకు వినియోగించే బ్యాటరీలను ఏడాదికి 2.25 మిలియన్ యూనిట్ల తయారీ సామర్థ్యంతో చిత్తూరు జిల్లాలో యూనిట్‌ను కంపెనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అమర రాజా నాలుగు చక్రాల వాహనాల బ్యాటరీ తయారీ సామర్థ్యం 8.25 మిలియన్ యూనిట్లకు చేరింది.