
అమర రాజా కొత్త బ్యాటరీ యూనిట్లో ఉత్పత్తి షురూ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తాము కొత్తగా ఏర్పాటుచేసిన బ్యాటరీ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్లు అమర రాజా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. నాలుగు చక్రాల వాహనాలకు వినియోగించే బ్యాటరీలను ఏడాదికి 2.25 మిలియన్ యూనిట్ల తయారీ సామర్థ్యంతో చిత్తూరు జిల్లాలో యూనిట్‌ను కంపెనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అమర రాజా నాలుగు చక్రాల వాహనాల బ్యాటరీ తయారీ సామర్థ్యం 8.25 మిలియన్ యూనిట్లకు చేరింది.