న్యూఢిల్లీ: బ్యాటరీ సెల్స్ తయారీలోకి ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశిస్తోంది. 50 గిగావాట్ అవర్స్ వరకు సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేయాలన్నది కంపెనీ ప్రణాళిక. ఇందుకోసం జర్, సీమెన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఓలా ఎలక్ట్రిక్ చర్చిస్తోంది. వీటిలో జర్మనీ, కొరియా, జపాన్ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణ కొరియా నుంచి బ్యాటరీ సెల్స్‌ను కంపెనీ దిగుమతి చేసుకుంటోంది. సెల్ బ్యాటరీ ప్లాంటుకు రూ.7,700 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. తొలుత ఒక గిగావాట్ అవర్ వార్షిక సామర్థ్యంతో ఈ కేంద్రం వచ్చే అవకాశం ఉంది. రెండేళ్లలో అధునాతన సెల్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి భారత్‌లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద ఎంపికైన తొలి ఆటో, ఈవీ కంపెనీ తమదేనని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది.
చదవండి: బిజినెస్ ‘బాహుబలి’ భవీశ్
Comments
Please login to add a commentAdd a comment