కథలు రాస్తున్నా | Radhika Apte Is Writing Scripts | Sakshi
Sakshi News home page

కథలు రాస్తున్నా

Published Mon, Jun 8 2020 3:30 AM | Last Updated on Mon, Jun 8 2020 5:13 AM

Radhika Apte Is Writing Scripts - Sakshi

రాధికా ఆప్టే

‘‘రాబోయే రోజుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఈ సమయాన్ని అసంతృప్తిగా గడపవద్దు. నేనలా చేయను. జీవితంలో నేను సంతోషంగా ఉండటానికి ఇదొక ముఖ్య కారణం’’ అంటున్నారు రాధికా ఆప్టే.  ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? అనే ప్రశ్నను రాధికా ఆప్టే ముందుంచితే – ‘‘ఎనిమిదేళ్లుగా విరామం లేకుండా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాను. ఈ లాక్‌డౌన్‌ వల్ల కాస్త రిలాక్స్‌ కావడానికి సమయం దొరికినట్లయింది. కొన్ని స్క్రిప్ట్స్‌ కూడా రాశాను.

ఇంకొన్ని రాయాలనుకుంటున్నాను. కానీ సమయం గడిచే కొద్దీ ఈ లాక్‌డౌన్‌తో నాలో కొత్త ఆలోచనలు కలుగుతున్నాయి. సినిమా కెరీర్‌ను పక్కన పెట్టి ఓ రెస్టారెంట్‌ ఆరంభిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన కూడా వచ్చింది (నవ్వుతూ)’’ అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఇటీవల ఓ షార్ట్‌ఫిల్మ్‌ను డైరెక్ట్‌ చేశారట రాధిక. అది ఓ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు కూడా  ఎంపికయిందట. ఈ సినిమా వివరాలను త్వరలోనే చెబుతా అన్నారు రాధికా ఆప్టే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement