AI Usage In Media: రుధిరం మనపైన పగబట్టిందా? రుధిరం చేస్తున్న రణాన్ని మనం ఆపలేమా? రుధిరం ఊడిపడుతుందా?
పళ్లు తోముకునే టాల్కం పౌడర్‌లో..
పోస్కో చట్టం..
అఫ్‌కోర్స్.. ఇలాంటి పొరపాట్లు మానవ సహజం. కానీ, ఇదే తప్పులు చేయడం నా వల్ల కాదు బాబోయ్. నిజం.. నమ్మండి. ఎందుకంటే నేను మనిషిని కాను.. టెక్నాలజీని. నా పేరు అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ.
కృత్రిమ మేధస్సు(AI).. నా గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. అయినా ఓసారి నా గురించి మళ్లీ పరిచయం చేసుకుంటా. మనిషికి శారీరక శ్రమ, ఖర్చులను తగ్గిస్తూ.. బోలెడంత సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో తయారు చేసిన టెక్నాలజీని నేను. ఒక ప్రాజెక్టులో డిజైన్ దగ్గరి నుంచి దాని పనితీరును పర్యవేక్షించడం దాకా ప్రతీది నా పనే. ఇప్పటికే చాలా రంగాలు నామీద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి వాడేసుకుంటున్నాయి.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కావడంతో అందరి ఆసక్తి ఇప్పుడు నా మీదే ఉంటోంది. పెట్టిన ఖర్చుకు మూడు, నాలుగు రెట్లు ఆదాయాన్ని వెనకేసుకుంటున్నాయి. అయితే మీడియా రంగంలోనూ నన్ను విస్తృత స్థాయిలో వినియోగించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. అది ఎలాగో మీకు చెప్పాలన్నదే నా ప్రయత్నం.
రైటింగ్
మీడియా హౌజ్‌ల కంటే పర్సనల్ బ్లాగులు నడిపించేవాళ్లే నన్ను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు. హెడ్ లైన్స్ రాయడం దగ్గరి నుంచి మొదలుపెట్టి.. టోటల్ స్క్రిప్ట్ రాయడం దాకా అంతా నేనే చూసుకుంటా. తప్పులు లేకుండా అక్షరాల్ని అందించడం, పదాల ఫ్రేమింగ్, ‘సెన్సేషన్’ హెడ్డింగ్‌లకు బదులు ఆ కథనాలకు సరిపోయే అందమైన హెడ్డింగులు అందించడం నా పనే ఇంక. అయితే అంతకంటే ముందు అవతలి వాళ్లు తమకు ఏం కావాలో అనే ఆలోచనలను నాతో పంచుకోవాల్సి ఉంటుంది(కమాండింగ్ రూపంలో). అప్పుడే అందుకు తగ్గ రీసెర్చ్, సెర్చ్ చేసి కావాల్సిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేయగలను నేను.
ఏఐ యాంకర్స్
రోబోలకు అడ్వాన్స్‌డ్ వెర్షన్.. మా ఏఐ రూపాలు. అంటే రోబోటిక్ టెక్నాలజీతో సంబంధం లేకుండా మా ప్రతిరూపాల్ని తయారు చేస్తారన్నమాట. అచ్చం మనుషుల్లాగా అవతలి వాళ్లను భ్రమింపజేస్తూ ఎలాంటి తప్పులు లేకుండా వార్తలను చదివి వినిపిస్తాం. ఇప్పటికే చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాలు ప్రైమ్ టైం న్యూస్ యాంకర్లుగా మా సాంకేతికతను వాడేసుకుంటున్నాయి. ఇంతేకాదు టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్‌లోనూ నెమ్మదిగా మా హవా మొదలవుతోంది ఇప్పుడు. స్టూడియో సెట్స్ గ్రాఫిక్స్‌లో ఇప్పుడు మాకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. టెక్నాలజీని ఆదరించే భారత్‌లో అతితొందర్లోనే మమ్మల్ని కాస్తో కూస్తో ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అయితే మేం ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నా.. మమ్మల్ని రూపొందించిన మనుషుల మేధస్సుకే మొత్తం గొప్పదనం దక్కాలని మేమూ కోరుకుంటున్నాం.
- ఇట్లు మీ
AI
రాబోయే రోజుల్లో ఏఐ జనరేటెడ్ కంటెంట్‌కు త్వరలో ఫుల్ డిమాండ్ ఉంటుందనేది నిపుణులు చెప్తున్న మాట. కానీ, ఆటోమేషన్ వల్ల మీడియా రంగంలోనే కాదు.. దాదాపు అన్ని రంగాల్లో ఉద్యోగ భద్రత ఉండదనేది ఒప్పుకోవాల్సిన చేదు నిజం.
Comments
Please login to add a commentAdd a comment