ప్రపంచంలో తొలి ఏఐ యాంకర్లు! | China's Xinhua unveils world's first virtual news anchors | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో తొలి ఏఐ యాంకర్లు!

Published Sat, Nov 10 2018 3:53 AM | Last Updated on Sat, Nov 10 2018 12:24 PM

China's Xinhua unveils world's first virtual news anchors - Sakshi

వార్తలు చదువుతున్న కృత్రిమమేధ యాంకర్‌

కట్టడాలు, టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్న చైనా మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారి కృత్రిమమేధతో పనిచేసే సింథటిక్‌ వర్చువల్‌ యాంకర్లను తెచ్చింది. ప్రభుత్వ అధికారిక వార్తాసంస్థ జిన్హువాలో ఈ కృత్రిమమేధ యాంకర్లు విధులు నిర్వహిస్తున్నారు. మనుషుల్లా హావభావాలు పలికించేలా శాస్త్రవేత్తలు తీర్చిదిద్దారు. వీటిలో ఒక యాంకర్‌ చైనీస్‌ భాషలో వార్తలు చదివేలా, మరొకటి ఇంగ్లిష్‌లో చదివేలా సమాచారాన్ని ఫీడ్‌ చేశారు. చైనాలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ సౌగౌ, జిన్హువాలు సంయుక్తంగా ఈ యాంకర్లను అభివృద్ధి చేశాయి. చైనాలో ప్రతిఏటా జరిగే ‘వరల్డ్‌ ఇంటర్నెట్‌ కాన్ఫరెన్స్‌’ ఈ యాంకర్లను ఆవిష్కరించారు. ఈ విషయమై జిన్హువా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ వర్చువల్‌ యాంకర్లు అలసట అన్నది లేకుండా 24 గంటలు విధులు నిర్వహిస్తారని తెలిపారు. బ్రేకింగ్‌ వార్తలను వేగంగా ఈ యాంకర్ల ద్వారా చేరవేయవచ్చన్నారు.



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement