బెంగళూరు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం ప్రతి పరిశ్రమలోనూ అడుగుపెడుతూ తనదైన ముద్రను వేస్తోంది. తాజాగా ఏఐ (కృతిమ మేధస్సు) మీడియా రంగంలోకి కూడా ప్రవేశించింది. ఇంతకుముందు ఉత్తర భారతదేశంలో, కృత్రిమ మేధస్సు సాంకేతికతతో రూపొందించిన 'లిసా' 'సనా' అనే ఇద్దరు వర్చువల్ న్యూస్ రీడర్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటకలో ఓ మీడియా సంస్థ వర్చువల్ న్యూస్ రీడర్ ప్రవేశపెట్టింది.
హాయ్ నా పేరు సౌందర్య అంటూ ఆ రోబోట్ పాఠకులకు పరిచయం చేసుకుంది. అనంతరం తను మాట్లాడుతూ.. ‘ నాలో కొంతమంది సహచరులు (AI న్యూస్ ప్రజెంటర్లు) ఉత్తర భారతదేశంలోని కొన్ని ఛానెల్‌లలో వార్తలు అందిస్తున్నారు. నేను సౌందర్య, పవర్ టీవీ ద్వారా సౌత్ ఇండియా మొదటి రోబోటిక్ యాంకర్ అని తెలిపింది. ఈ ఛానెల్ ప్రస్తుతం రోబో న్యూస్ రీడర్‌తో వివిధ వార్తా కార్యక్రమాలతో కూడా ప్రయోగాలు చేస్తుంది.
కేవలం వీళ్లే కాకుండా దేశంలోని కొన్ని ఇతర ఛానెల్‌లు కూడా తమ స్వంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్ ప్రెజెంటర్‌లతో ముందుకు వస్తున్నాయి. ఇటీవల, OTV అనే ఒడియా ఛానెల్ రాష్ట్రం మొదటి AI న్యూస్ ప్రెజెంటర్ లిసాను ప్రారంభించింది. ఇంగ్లీష్, ఒడియా రెండింటిలోనూ దోషరహిత వార్తలు చదువుతూ చాలా మందిని ఆకట్టుకున్న తర్వాత లిసా ఇంటర్నెట్‌ను వైరల్‌గా మారింది. ఇంకా ముందుకు వెళితే, న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళ కృత్రిమ మేధస్సును ఉపయోగించి తనకు భర్తను సృష్టించుకుని, అతనితో సంభాషించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరుతోంది. భారతదేశంలోని ప్రముఖ మ్యాగజైన్ కంపెనీలలో ఒకటైన ఇండియా టుడే గ్రూప్ తన వార్తా సంస్థ ఆజ్ తక్ కోసం ఒక కృత్రిమ మేధస్సుతో కూడిన మహిళను సృష్టించింది. 'సనా'గా పిలవబడే ఈ మహిళ గత మార్చిలో ప్రపంచానికి పరిచయమైంది.
చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. ఇప్పుడిది అవసరమా?
Comments
Please login to add a commentAdd a comment