ఏఐ పోలీస్‌.. ఆన్‌ డ్యూటీ | The first robot police is ready in Kerala | Sakshi
Sakshi News home page

ఏఐ పోలీస్‌.. ఆన్‌ డ్యూటీ

Published Sun, Sep 1 2024 5:25 AM | Last Updated on Sun, Sep 1 2024 5:25 AM

The first robot police is ready in Kerala

సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవం 

ప్రపంచ దేశాల చూపు ఏఐ పోలీసింగ్‌ వైపు 

ఏఐ వినియోగంలో ముందంజలో దుబాయ్‌ 

ఒక్క పోలీస్‌ కూడా లేకుండానే చైనాలో ఏఐ పోలీస్‌స్టేషన్‌..! 

అదే బాటలో యూఎస్, యూకేలు ఫిర్యాదుల స్వీకరణ నుంచి.. 

నిందితుల గుర్తింపు వరకు అన్నింటికీ కీలకంగా ఏఐ 

ఏఐ పోలీసింగ్‌ వైపు అడుగులు వేస్తున్న భారత్‌ 

కేరళలో తొలి రోబో పోలీస్‌ సిద్ధం  

ఇకపై పెట్రోలింగ్‌కు నో పోలీస్‌..  ట్రాఫిక్‌ క్లియరెన్స్‌కీ నో పోలీస్‌..   ఫిర్యాదు స్వీకరించేందుకూ నో పోలీస్‌..   నిందితుల గుర్తింపునకు నో పోలీస్‌..   ఓన్లీ ఏఐ కాప్‌ అన్ని పనులు పూర్తి చేసేస్తుంది మరి.    రోడ్డు మీద పోలీసులు ఎవ్వరూ కనబడటంలేదు కదా.. ఇష్టమొచ్చినట్లు వెళదాం.. మనల్ని ఎవర్రా ఆపేది అనుకుంటూ రయ్‌ మని దూసుకెళితే.. ఏఐ కాప్‌ కంట్లో మీరు పడ్డట్లే. ఫైన్‌ కడితేగానీ  అది కదలనివ్వదు. ఇలాంటి ఏఐ పోలీస్‌లు ఇప్పటికే కొన్ని దేశాల్లో వినియోగంలోకి వచ్చాయి. మనకీ ఆ రోజులు త్వరలోనే రానున్నాయి.  

బ్యాచ్‌ నంబర్‌ గిటెక్స్‌.  వెర్షన్‌ ఏఐ.   7 కిలోమీటర్స్‌ పర్‌ అవర్‌.   360 డిగ్రీస్‌ మోనిటరింగ్‌..   పోలీస్‌ కాప్‌ పెట్రోలింగ్‌ వెహికల్‌ రిపోర్టింగ్‌ సర్‌..   అంటూ దుబాయ్‌ పోలీసులకు  ఓ పెట్రోలింగ్‌ వాహనం సాయమందిస్తోంది.  వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే  వాహనం ముందుకు వచ్చి మరీ ఫైన్‌ కట్టాలంటూ రశీదు చేతికిస్తోంది.  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రపంచ వ్యాప్తంగా పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది. మనుషుల స్థానంలో రోబో పోలీసులు విధులు నిర్వ­హించే పరిస్థితులు వస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న నేరాలను నియం­త్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానా­న్ని అన్ని దేశాలు ఆశ్రయిస్తున్నాయి. ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) టెక్నాలజీతో మనుషులు లేకుండానే పోలీసుల పనులన్నీ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాయి. 

ఇందులో దుబాయ్‌ కాస్తా ముందంజలోనే ఉందని చెప్పవచ్చు. పోలీస్, సెక్యూరిటీ ఆపరేషన్స్‌లో ఏఐను దుబాయ్‌ విస్తృతంగా వినియోగిస్తోంది. దీనిలో భాగంగా స్మార్ట్‌ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో అమ్నా పేరుతో ఉండే ఓ ఫీచర్‌లో.. ఫస్ట్‌ లెఫ్టినెంట్‌ స్థాయిలో ఉండే ఒక వర్చువల్‌ పోలీస్‌ అధికారి ప్రజల ప్రశ్నలకు ఇంగ్లి‹Ù, అరబిక్‌ భాషల్లో సమాధానాలు ఇస్తున్నారు. ఇలా 2023లో ఏకంగా 20 వేల మందికి సమాధానాలిచ్చారు. 

ఒళ్లంతా కళ్లే..  
ఇక దుబాయ్‌ పోలీసులకు ఓ ఏఐ పెట్రోలింగ్‌ వాహ­నం సాయమందిస్తోంది. ఈ వెహికల్‌లో 360 డిగ్రీస్‌­లో స్పష్టంగా ఫుటేజ్‌ అందించే కెమెరాలున్నాయి. అను­మానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నా, మారణా­­యు­ధాలు కలిగిఉన్నా, వెంటనే సమీపంలో ఉన్న పోలీసుల­కు సమాచారం చేరవేస్తుంది. వారు వచ్చేలోగా సదరు నిందితుడ్ని ఫాలో అవు­తుంది. 15 గంటల పాటు నిరి్వరామంగా పనిచేసే సామర్థ్యం ఈ ఏఐ పెట్రోలింగ్‌ వెహికల్‌ సొంతం. కొద్దిరోజుల్లోనూ ఇది దుబాయ్‌ రోడ్లపై నిశ్శబ్దంగా తిర­గ­నుంది. 65 మంది ఇంజనీర్లు దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి దీనిని రూపొందించారు.

ఫిర్యాదు కాపీ 8 సెకన్లలో...! 
అమెరికా పోలీసింగ్‌లోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఫిర్యాదుదారులు చెప్పే విషయాన్ని నోట్‌ చేసుకుంటూ చాట్‌ జీపీటీ ద్వారా కేవలం 8 సెకన్లలో ఫిర్యాదు కాపీని తయారుచేసి ఇచ్చే సాంకేతికను ఓక్లహామా నగరంలో మొదటిసారిగా వినియోగిస్తున్నారు. కేవలం ఫిర్యాదు కాపీనే కాకుండా.. ఏదైనా సంఘటనపై చాట్‌ జీపీటీ ద్వారా సెకన్లలోనే డ్రాఫ్ట్‌ను సిద్ధం చేస్తోంది. ప్రయోగాత్మక పరిశీలనలో తప్పులు లేకుండా 100 శాతం పర్‌ఫెక్ట్‌ రిపోర్టును సిద్ధం చేసినట్టు ఆ సిటీ పోలీసులు ప్రకటించారు.

లండన్‌లో...! 
ప్రధానంగా పాత నేరస్తులను పట్టుకునేందుకు ఏఐను బ్రిటన్‌ ప్రభుత్వం ఉపయోగిస్తోంది. గతంలో దొంగతనం చేసి, మర్డర్లు చేసి, బ్యాంకులను దోచుకుని తప్పించుకు తిరుగుతున్న సుమారు 10 మంది పాత నేరస్తులను.. గుంపులో తిరుగుతుండగా ఏఐను ఉపయోగించి లైవ్‌ ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ (ఎల్‌ఎఫ్‌ఆర్‌) కెమెరాల ద్వారా గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనిని విస్తృతంగా వినియోగించాలని ఆ ప్రభుత్వం నిర్ణయించింది.  

చైనాలో ఏఐ పోలీస్‌స్టేషన్‌...! 
మనుషులే లేని పోలీస్‌ స్టేషన్‌ను చైనా సిద్ధం చేసింది. వుహాన్‌ నగరంలో ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా ఈ స్టేషన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ రిజి్రస్టేషన్‌ సేవలను అందించనుంది. అదేవిధంగా డ్రైవింగ్‌లో ఎదురయ్యే సమస్యలు, యాక్సిడెంట్‌ చేసింది ఎవరు? ఎలా చేశారు? ఎవరిది తప్పు వంటి వాటిని పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోలీస్‌ స్టేషన్‌ 24/7 అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే చైనాలో ఏఐ టెక్నాలజీని నిఘా కోసం వినియోగిస్తున్నారు.



సింగపూర్‌లో స్వతంత్ర నిర్ణయాలతో.. 
సింగపూర్‌ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తమంతట తాముగా నిర్ణయాలు తీసుకునే రోబోలను పోలీస్‌ శాఖలో ఉపయోగించనున్నట్టు సింగపూర్‌ ప్రభుత్వం వెల్లడించింది. గత ఐదేళ్లుగా సింగపూర్‌లో ఈ పోలీస్‌ రోబోలతో ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ రోబో కాప్‌ ఎత్తు 5.7 అడుగులు. దీనికి అమర్చే కెమెరాతో 360 డిగ్రీల్లో వీక్షించవచ్చు. 

ప్రాణాలకు తెగించే ఆపరేషన్లలో పాల్గొనేందుకు ఈ రోబోల్ని వినియోగించాలని సింగపూర్‌ పోలీసులు నిర్ణయించారు. ఇందులో ఉండే స్పీకర్లు.. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న వారితో మాట్లా­డేందుకు ఉపయోగపడతాయి. ఈ పోలీస్‌ రోబో సేవలను సింగపూర్‌ ప్రభుత్వం ఎంతో రద్దీగా ఉండే చాంగీ ఎయిర్‌ పోర్టులో వినియోగించాలని నిర్ణయించింది. 

చిట్టితో.. సమస్యలు! 
రజనీకాంత్‌ రోబో సినిమాలో హ్యుమనాయిడ్‌ చిట్టితో అనేక  సమస్యలు వస్తాయి. అదేవిధంగా ప్రతి సాంకేతిక పరిజ్ఞానంలోనూ  సమస్యలు తలెత్తుతుంటాయి. ఏఐ టెక్నాలజీ వినియోగం  రోజురోజుకీ పెరుగుతోంది. దీని ద్వారా ఉద్యోగాల కల్పన విషయంలో సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆక్స్‌ఫర్డ్‌  యూనివర్సిటీ సర్వే ప్రకారం అమెరికాలోనే 2033 నాటికి 47 శాతం ఉద్యోగాలు ఆటోమేషన్‌ కానున్నాయని తెలుస్తోంది.  

హ్యాకింగ్‌ సమస్యలు, సొంత  అవసరాలకు  వినియోగించుకునే అవకాశం కూడా ఉంది.  ఏఐ వినియోగించుకునే అవసరమైన డేటా సేకరణ, స్టోరేజీతో... ప్రైవసీ పోయే ప్రమాదం ఉంది.  

కేవలం మనం  ఇచ్చిన డేటాతో మాత్రమే ఏఐ పనిచేస్తుంది. సృజనాత్మక ఆలోచనలకు అవకాశం లేకుండా పోతుంది.

ఏఐ దిశగా.. భారత్‌ అడుగులు
పోలీస్‌ వ్యవస్థలో ఏఐని వినియోగించే దిశగా భారత్‌ కూడా అడుగులు వేస్తోంది. ప్రస్తుత మొబైల్‌ క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ (ఎంఈసీటీఎన్‌ఎస్‌)తో ఈ ఏఐ వ్యవస్థని అనుసంధానించనున్నారు. ఈ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌లో ఉండే పాత డేటా ఆధారంగా తన రేడియస్‌ పరిధిలో ఎవరైనా క్రిమినల్‌ కనిపించినా.. వెంటనే కంట్రోల్‌ రూమ్‌కి సమాచారం ఇచ్చేలా ప్రోగ్రామింగ్‌ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

కేరళలో తొలి రోబో పోలీస్‌ సేవలందించేందుకు సిద్ధమవుతున్నాడు. కేరళ పోలీస్‌ అసిమోవ్‌ రోబోటిక్స్‌ సంస్థ సహకారంతో మానవ తరహాలో ‘కేపీ–బాట్‌’ని అభివృద్ధి చేశారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ కెమెరా ద్వారా.. నిందితుల్ని గుర్తించగల సామర్థ్యం దీని సొంతం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement