టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ప్రపంచంలో కొత్త కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే గార్డెన్స్ శుభ్రం చేయడానికి, గడ్డి కత్తిరించడానికి 'ఏఐ ఎలక్ట్రిక్ షీప్' (AI Electric Sheep) అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏఐ ఎలక్ట్రిక్ షీప్ అనేది ఎలా పని చేస్తుందనేది ఇక్కడ వీడియోలో గమనించినట్లయితే.. ఇది అవుట్‌డోర్ మెయింటెనెన్స్ బాట్ అంచుల చుట్టూ తిరుగుతూ, చెత్తను కొట్టి, పవర్ టూల్స్‌తో పట్టుకోవడం వంటివి చూడవచ్చు. దీనిని నిర్వహించడానికి కూడా ప్రత్యేకమైన బృందం అవసరం లేదు.
ఏఐ ఎలక్ట్రిక్ షీప్‌ను ఇప్పటికే అనేక రకాలుగా టెస్ట్ చేశారు. ఇందులో బ్యాటరీ, కెమరాలు వంటివి ఫిక్స్ చేశారు. కాబట్టి ఇది పరిసరాలను పరిశీలిస్తుంది. తద్వారా ఎత్తులు, పల్లాలను పరిశీలిస్తుంది. కాబట్టి ఇది దాదాపు అడ్డంకులను అధిగమించి తనకు తానుగా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళుతుంది.
ల్యాండ్‌స్కేపింగ్ ప్రపంచంలో ట్రిమ్మింగ్, ఎడ్జింగ్ వంటి పనుల కోసం ఇది మొదటి ఏఐ రోబోట్. దీనిని ప్రత్యేకమైన టెక్నాలజీతో రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఇది కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో దీనిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి, కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment