ప్రపంచం అభివృద్ధివైపు పరుగులు పెడుతున్న తరుణంలో కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) అరంగేట్రం చేసింది. ఇది చాలా రంగాలకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. సైబర్ నేరగాళ్లు ఈ టెక్నాలజీ ఉపయోగించి కొత్త నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, కేరళ కోజికోడ్‌కు చెందిన 'రాధాకృష్ణన్' అనే వ్యక్తికి గుర్తుతెలియని ఒక నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. అవతలి వైపు మాట్లాడుతున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని అతని మాజీ సహోద్యోగిని పోలి ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తి అనుకుని సంభాషణ కొనసాగించాడు. మాట్లాడుతున్న సమయంలో తాను ఆసుపత్రిలో ఉన్న బంధువుకు సాయం చేయాలనీ రూ. 40,000 కావాలని అభ్యర్థించాడు.
ఏఐ డీప్‌ఫేకింగ్..
తెలిసిన వ్యక్తి కష్టాల్లో ఉన్నాడని వెంటనే రాధాకృష్ణన్ రూ. 40,000 పంపించాడు. ఆ తరువాత కొంతసేపటికి మళ్ళీ రూ. 35000 కావాలని అడిగాడు. దీంతో సదరు వ్యక్తికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజాలు వెల్లడించారు.
(ఇదీ చదవండి: ఇషా అంబానీ నివాస భవనం ఎన్ని కొట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!)
మోసానికి పాల్పడిన వ్యక్తి AI డీప్‌ఫేకింగ్ ఉపయోగించి డబ్బు తీసుకున్నట్లు, లావాదేవీలు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడికి డబ్బు తిరిగి అప్పగించినట్లు సమాచారం. కేరళలో ఇలాంటి చీటింగ్ వెలుగులోకి రావడం కేసు ఇదే మొదటిదని భావిస్తున్నారు. కావున ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment