అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై సుమారు 726 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసింది. సేఫ్ కేరళ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కెమెరాలు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిని గుర్తించి వారికి చలానాలు జారీ చేస్తాయి.
ఏఐ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి కేరళలో ట్రాఫిక్ ఉల్లంఘనలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. సీట్ బెల్టు ధరించకపోయినా, హెల్మెట్ పెట్టుకోకపోయినా ఆలాంటి వాహనాలను గుర్తించి ఏఐ కెమరాలు ఫోటోలు తీస్తాయి. సంబంధిత అధికారులు చలానాలు జారీ చేస్తారు.
గతంలో ఓ స్కూటరిస్టుకు ఏకంగా రూ. 86,500 చలాన్ జారీ చేసిన సంఘటన మరువక ముందే.. ఏఐ కెమెరా ఇటీవల పోలీస్ వాహనానికి కూడా చలాన్ జారీ చేసింది. KL01 BK 5117 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన కారులో వెళ్తున్న పోలీసు (కో-ప్యాసింజర్) సీట్ బెల్ట్ ధరించకపోవడంతో ఫోటో తీసి చలాన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment