ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్! గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగి పోతున్న టెక్నాలజీ. ఈ అధునాతమైన సాంకేతికత కారణంగా టెక్నాలజీతో పాటు ఇతర రంగాలకు చెందిన కోట్లాది ఉద్యోగాలు పోయే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు నిపుణులు.
ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ఆధారిత సేవల్ని ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా, మీడియా రంగంపై ఏఐ ప్రభావం భారీ స్థాయిలో ఉంటుందని తేలింది. ప్రముఖ జర్మన్ మీడియా సంస్థ ఆక్సెల్ స్ప్రింగర్ తన న్యూస్ రూమ్ సిబ్బందిలో 20 శాతం మందిని తొలగించి, కొంతమంది ఉద్యోగులను కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎలాన్ మస్క్ స్నేహితుడిగా పేరొందిన కంపెనీ సీఈఓ మథియాస్ డోఫ్నర్ ఓన్లీ డిజిటల్ విధానం వైపు మళ్లినట్లు సీఎన్ఎన్ తెలిపింది.
పలు నివేదికల ప్రకారం. ఆక్సెల్ స్ప్రింగర్ ప్రింట్ ప్రొడక్షన్‌లో పాల్గొనే ఎడిటర్లు, ఫోటో ఎడిటర్లు, ప్రూఫ్ రీడర్లు, ఇతర విభాగాల్లో ఉద్యోగుల్ని ట్రాన్స్‌ఫర్ చేయడమో లేదంటే దశల వారీగా తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా,యూరప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న వార్తాపత్రికల్లో ఆక్సెల్ స్ప్రింగర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు మీడియా వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment