OTV Launches Odisha’s First Artificial Intelligence News Anchor Lisa - Sakshi
Sakshi News home page

AI Anchor Lisa: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్‌చల్‌

Published Mon, Jul 10 2023 2:57 PM | Last Updated on Mon, Jul 10 2023 5:38 PM

OTV launches Odisha's first Artificial Intelligence news anchor Lisa - Sakshi

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత  పెను మార్పులకు నాంది పలుకుతోంది. తాజాగా  దేశంలోనే తొలిసారిగా  "కృత్రిమ మహిళా" యాంకర్‌ రంగంలోకి  వచ్చేసింది.  ఒడిశా లోని ఒక మీడియా సంస్థ  ‘ లీసా’ పేరుతో తొలి ఏఐ యాంకర్‌ను పరిచయం చేసింది.  దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.ఘొ

ఒడిశాలోని ఓ టీవీ  న్యూస్ ఛానల్  టెక్నాలజీ ఉపయోగించి కృత్రిమ మహిళ న్యూస్ యాంకర్ లీసా యాంకరింగ్‌ను షురూ చేసింది.  చీరకట్టుతో తెరపై అలవోకగా వార్తలు చదువుతున్న యాంకర్‌ను చూసి నెటిజన్లు ఔరా అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సాయంతో లేడీ యాంకర్‌ను తలపించేలా వార్తలను చదవడం  విశేషంగా నిలుస్తోంది. ఒడియాతో పాటు ఇంగ్లిష్లోనూ వార్తలు చదివేలా లీసాను ప్రోగ్రామ్ చేసినట్లు సంస్థ ఎండీ జాగి మంగత్ పాండా వెల్లడించారు. లీసాకు బహుళ భాషలు మాట్లాడగల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒరియా, ఇంగ్లిష్ వార్తలపైనే దృష్టి పెట్టామన్నారు. (గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్‌ ఫైలింగ్‌ జాగ్రత్తలు, లాభాలు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement