
బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్స్ వచ్చినా కూడా చాలామంది మురికి బట్టలను చేతితోనే ఉతుకుతుంటారు. పైగా బట్టలను వాషింగ్ మెషిన్‌లో లోడ్ చేయటం, ఉతికిన బట్టలను తిరిగి అన్‌లోడ్ చేసి ఆరేయటం అంతా మనమే చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది ఈ రోబో.
ఏఐ టెక్స్‌టైల్ ప్రాసెసింగ్, పాయింట్ క్లౌడ్ ఆధారిత అల్గారిథంతో తయారు చేసిన ఈ రోబో ఎలాంటి బట్టల మురికినైనా, చేతితో రుద్ది రుద్ది పోగొడుతుంది. తెల్ల బట్టలను ఒక రకంగా, రంగు పోయే దుస్తులను ఒక విధంగా ఇలా.. ఏ రకం దుస్తులను ఏ విధంగా ఉతకాలో ఆ విధంగానే ఉతుకుతుంది.
వాషింగ్ మెషిన్ కేవలం బట్టలను ఉతకడం మాత్రమే చేస్తుంది. కాని, ఈ రోబో బట్టలను ఆరేస్తుంది. ఆరేసిన బట్టలను మడతపెడుతుంది. ఆర్డర్ ఇస్తే ఇస్త్రీ కూడా చేస్తుంది. బాగుంది కదూ! త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment