టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన సంస్థ తయారు చేస్తున్న హ్యూమనాయిడ్ రోబోట్ ‘ఆప్టిమస్’నడుస్తున్న వీడియోను ప్రపంచానికి పరిచయం చేశారు. కంపెనీకి చెందిన ఓ ఫ్లోర్ లో ఆప్టిమస్ నడుస్తున్న వీడియోని ఎక్స్.కామ్ లో షేర్ చేశారు. అయితే 1 నిమిషం 18 సెకన్ల పాటు నడిచే రోబోట్ నడకను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
‘ఆప్టిమస్ ల్యాబ్ చుట్టూ తిరుగుతోంది’అని ఎలోన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో వీడియోను షేర్ చేయగా.. ఆ వీడియోను ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా వీక్షించారు.
సురక్షితంగా నడవడం లేదంటే ఫ్యాక్టరీ అంతస్తులో పని చేయడం వంటి ఆప్టిమస్ సామర్థ్యాలను అందించడానికి టెస్లా తన డ్రైవర్ లెస్ కారులో వినియోగించే టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తున్నట్లు ఆ కంపెనీ ఇంజినీర్లు గతంలో తెలిపారు.
Optimus strolling around the lab pic.twitter.com/E25ttHGsF0
— Elon Musk (@elonmusk) February 24, 2024
గత నెలలో మస్క్ రోబోట్ పనితీరుపై ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేసేలా ఆప్టిమస్ చొక్కా మడతపెట్టిన వీడియోను పంచుకున్నారు . టెస్లా ఆప్టిమస్ రోబోట్‌లను అధిక ధరలకు ఉత్పత్తి చేసేలా రూపొందిస్తోందని, దీని ధర బహుశా 20 వేల డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని మస్క్ ఆ సమయంలో చెప్పారు. కాగా, మస్క్ భవిష్యత్తులో మనుషులు చేసే రకరకలా పనులను ఈ రోబోట్ లు భర్తీ చేయనున్నాయని ఓ సందర్భంలో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment