
రూబిక్స్ క్యూబ్ పజిల్‌ను పరిష్కరించడానికి చాలా కష్టపడుతుంటారు కొంతమంది. ఇప్పుడు సులువుగా పరిష్కరించే పద్ధతిని నేర్పిస్తుంది ఈ ‘ఎక్స్ మ్యాక్ రోబో క్యూబ్’ చూడటానికి సాధారణ రూబిక్స్ క్యూబ్‌లాగే ఉంటుంది కాని, ఇందులోని ఆరు మోటార్లు రూబిక్స్ క్యూబ్‌లోని బ్లాక్స్‌ను సులువుగా తిప్పుతూ స్వయంగా పరిష్కరిస్తుంది.
ఎవరైనా పజిల్‌ను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వివిధ రంగుల లైట్లు, సంగీతాలను ప్లే చేస్తూ అర్థమైయ్యేలా మార్గనిర్దేశం చేస్తుంది. ఇలా దీని సాయంతో చిన్న పిల్లలు కూడా రూబిక్స్ క్యూబ్‌ను సులువుగా పరిష్కరించగలరు. ధర కాస్త ఎక్కువ. ఆన్‌లైన్‌లో దొరుకుతుంది.
Comments
Please login to add a commentAdd a comment