Gadget
-
మొబైల్లో ఆర్డర్‌చేసి కిచెన్‌లోకి వెళితే వంట రెడీ!
వై-ఫైతో అనుసంధానమయ్యే గ్యాడ్జెట్లు మన హాల్ నుంచి తిన్నగా వంట గదిలోకి ప్రవేశిస్తున్నాయి. ఎలాగంటారా.. కిచెన్‌లోనూ స్మార్ట్ పరికరాల సంఖ్య పెరుగుతోంది. హాల్లో ఎక్కువగా స్మార్ట్ టీవీ, స్మార్ట్ హోం థియేటర్, స్మార్ట్ ఫ్యాన్, సెన్సార్ డోర్లు.. వంటి పరికరాలు వాడుతుంటాం. మరి కిచెన్‌లోనూ వై-ఫైతో అనుసంధానమయ్యే ఏఐ పరికరాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కరెంట్ లేకపోయినా ఇండక్షన్ కుకర్ పనిచేస్తే.. మనకేం కావాలో మొబైల్లో ఆర్డర్ పెట్టి కిచెన్‌లోకి వెళితే వంట సిద్ధంగా ఉంటే.. మైక్రోఓవెన్లో పెట్టే పదార్థాలు ఎంత సమయంలో వేడి అవుతాయో ముందుగానే తెలిస్తే.. ఊహించుకుంటేనే ఆహా అనిపిస్తుంది కదా. ఇటీవల సీయాటెల్లో జరిగిన స్మార్ట్ కిచెన్ సమ్మిట్(ఎస్కేఎస్)లో కంపెనీలు ఇలాంటి పరికరాలనే ప్రదర్శించాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.మొబైల్లో ఆర్డర్‌పెట్టి కిచెన్‌లోకి వెళితే..స్మార్ట్ కిచెన్ సమ్మిట్‌లో చెఫీ అనే కంపెనీ కొత్తరకం పరికరాన్ని పరిచయం చేసింది. కంపెనీకు చెందిన యాప్‌లో మనకు కావాల్సిన వంటను ఆర్డర్‌పెట్టి కాసేపయ్యాక కిచెన్‌లోకి వెళితే ఆ వంట సిద్ధంగా ఉంటుంది. ఎలాగంటారా.. కిచెన్‌లో వంటచేసే స్మార్ట్ పరికరాన్ని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో వంటకు కావాల్సిన కూరగాయలు, పప్పులు, ఇతర ధాన్యాలు, బియ్యం..వంటివాటిని ఏర్పాటుచేసుకోవాలి. ట్రేల్లో వాటికి కేటాయించిన ప్రత్యేక సెటప్‌లో పెట్టుకోవాలి. కిచెన్‌లోని పరికరం వై-ఫైకు అనుసంధానమై ఉంటుంది. దాంతో యాప్ ద్వారా మనకు కావాల్సిన పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే అందుకు తగ్గట్టుగా ముందే ఉంచిన ట్రేల్లోని ముడి పదార్థాలను ఉపయోగించుకుని వంట సిద్ధం చేస్తుంది. ఈమేరకు కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Chefee Robotics (@chefeerobotics)బ్యాటరీతో పనిచేసే ఇండక్షన్ కుకర్ఇంపల్స్ ల్యాబ్స్ తయారుచేసిన ఇండక్షన్ కుక్‌టాప్ కరెంట్ లేకపోయినా పనిచేస్తుంది. ముందుగా వినియోగించినపుడు విద్యుత్ ద్వారా కుకర్‌లో ఉండే బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. కరెంటులేని సమయంలో తిరిగి ఆ బ్యాటరీల ద్వారా కుకుర్ను వేడిచేసి వంట చేసుకునే వీలుంటుంది.ముందే సమయాన్ని చెప్పే థర్మామీటర్మైక్రోఓవెన్లో ఏదైనా పదార్థాన్ని వేడి చేయాలనుకున్నప్పుడు కంబషన్ కంపెనీ తయారుచేసిన థర్మామీటర్ ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా మనం వేడి చేయాలనుకున్న ఆహారంపై థర్మామీటర్ ఉంచాలి. అందులోని ఎనిమిది సెన్సార్లు అది ఎలాంటి పదార్థమే గుర్తించి తినడానికి అనువుగా వేడి అవ్వాలంటే ఎంతసమయం పడుతుందో తెలియజేస్తుంది.ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి పోలీసులకు చిక్కారా..? మీకోసమే ‘డిజీలాకర్’స్మార్ట్ కిచెన్ సమ్మిట్‌లో కలినరీ టెక్నాలజిస్ట్ స్కాట్ హెమెండెంగర్ మాట్లాడుతూ..‘ఈ సమ్మిట్‌లో ఎన్నో అద్భుతమైన ప్రాడక్ట్స్ ప్రదర్శించారు. ఇవన్నీ చూస్తుంటే కొద్ది రోజుల్లోనే మన కిచెన్లు స్మార్ట్గామారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. Wife అయితే గరిటెను ఎలా అయినా వాడుతుంది. కానీ Wi-Fi మాత్రం గరిటెను స్మార్ట్ కిచెన్ కోసమే వాడుతుంది’ అన్నారు. -
ఎక్కువ శ్రమ లేకుండా.. బాడీ స్లిమ్‌గా ఎలా..!?
అధిక బరువు ఆరోగ్యానికే కాదు అందానికీ శత్రువే. ఆ బరువును తగ్గించుకోవడానికి మితాహారం.. వ్యాయామాలే మార్గం అంటారు ఫిట్నెస్ నిపుణులు. మితాహారం ఓకే.. అతికష్టమ్మీద నాలుకను చంపుకొని కడుపు కట్టుకోవచ్చు. కానీ మైండ్‌ని ఎంత ప్రిపేర్ చేసినా వ్యాయామానికి సిద్ధమవదు. ఓ పక్క బద్ధకం అడ్డొస్తుంది. అందుకే ఈ ఎక్సర్సైజ్ కుషన్ చూడండీ.. చాలా యూజ్ అవుతుంది. పెద్దగా శ్రమ లేకుండానే బాడీని స్లిమ్‌గా మారుస్తుంది. ఇది కాళ్లు, తొడలు, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును ఇట్టే కరిగిస్తుంది. శరీరం సన్నగా, అందంగా అవడానికి సహకరిస్తుంది. దీని సాయంతో వ్యాయామం చేస్తే.. కొవ్వు తగ్గి నాజూగ్గా మారుతారు. ఈ ఎక్సర్సైజర్కి ఇరువైపులా కాళ్లు పెట్టుకోవడానికి వీలుగా హోల్స్ ఉంటాయి. వాటిలోకి కాళ్లను జొప్పించి.. పడుకుని లేదా కూర్చుని చిత్రంలో చూపించిన విధంగా వ్యాయామం చేసుకోవచ్చు. దానివల్ల.. పొట్ట నుంచి కాళ్ల వరకూ పేరుకున్న కొవ్వు వేగంగా తగ్గుతుంది. ఈ టూల్‌ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. ఇది ఇంట్లో ఉంటే.. మీకు కావాల్సిందల్లా కాస్త స్థలం.. కొంత సమయం మాత్రమే. అవిరెండూ దొరికితే.. అందం, ఆరోగ్యం మీ సొంతం. పక్షవాతంతో బాధపడుతున్న కొందరు (కాస్త కదలికలున్నవారు) పేషెంట్స్ కూడా ఈ టూల్‌ని ఉపయోగించి.. వ్యాయామం చేసుకోవచ్చు. రెడ్ లేదా బ్లాక్ కలర్స్‌లో ఈ ఎక్సర్సైజ్ కుషన్ అందుబాటులో ఉంది. దీని ధర 51 డాలర్లు. అంటే 4,219 రూపాయలన్న మాట. ఇవి చదవండి: Naila Grewal: నా యాక్టింగ్‌కి 'టెలివిజనే' నాకు ప్రేరణ! -
ఈ మినీ ఎలక్ట్రిక్ మేకర్ వెరైటీల గురించి మీకు తెలుసా..!
హైక్వాలిటీతో రూపొందిన ఈ మినీ మేకర్.. చాలా వెరైటీలను నిమిషాల్లో రెడీ చేస్తుంది. నూడుల్స్, పాస్తా, రైస్ ఐటమ్స్, పాన్ కేక్స్, కుకీస్, కట్లెట్స్, కేక్స్, బ్రెడ్ ఆమ్లెట్ వంటివెన్నో వండుకోవచ్చు. ఇందులో ఉడికించుకోవడం, గ్రిల్ చేసుకోవడం రెండూ సులభమే. అవసరాన్ని బట్టి ఈ డివైస్‌ని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పైనున్న హ్యాండిల్ పాన్‌తో పాటు.. అడుగున ఉన్న నాన్‌స్టిక్ అటాచ్డ్ బౌల్లో కూడా ఫుడ్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఇంట్లో సరే.. క్యాంపింగ్లకూ చక్కగా యూజ్ అవుతుంది. దీనికి ప్రీహీట్ ఇండికేటర్ లైట్ ఉండటంతో ఏ వంటకాన్నయినా ఇట్టే చేసేయొచ్చు. ఈ మినీ పర్సనల్ ఎలక్ట్రిక్ మేకర్ ధర 14 డాలర్లు (రూ.1,161). ఇవి చదవండి: ఈ 'గాడ్జెట్'.. రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా.. -
ఈ 'గాడ్జెట్'.. రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా..
క్విక్ అండ్ ఈజీ టెక్నాలజీతో ఈ గాడ్జెట్.. వేసవిలో చల్లటి డ్రింక్స్‌తో కూల్‌గా ఉంచుతుంది. వింటర్లో వేడి వేడి కాఫీ, టీలతో వెచ్చబరుస్తుంది. పార్టీలను చిల్ చేస్తుంది. ఇది రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్‌ని ఈ మగ్‌లో ఉంచి.. స్విచ్ ఆన్ చేస్తే.. అవి క్షణాల్లో కూల్ అవుతాయి. అలాగే ఓపెన్ చేసి.. వాటిని మగ్లోనే వేసుకుని మూత పెట్టుకోవచ్చు. అంతేకాదు వేడివేడిగా సూప్స్, టీ, కాఫీలనూ పెట్టుకోవచ్చు. చల్లగా కావడానికి వేరుగా.. వేడిగా కావడానికి వేరుగా ఆప్షన్స్ ఉంటాయి. ఏది కావాలనుకుంటే దాన్ని సెట్ చేసుకోవాలంతే. ఈ డివైస్ చిన్నగా.. తేలిగ్గా ఉండటంతో.. దీన్ని పార్టీలు.. బీచ్‌లకు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. బాగుంది కదూ!. ఈ కూల్ అండ్ హాట్ కప్ ధర 34 డాలర్లు (రూ.2,818). ఇవి చదవండి: అంతరించిన పక్షికి మళ్లీ ప్రాణం..! -
చూడటానికి డబ్బాలా కనిపించే ఈ గాడ్జెట్ .. మొక్కలకు మంచి నేస్తం
చూడటానికి డబ్బాలా కనిపించే ఈ పరికరం మొక్కలకు స్మార్ట్ నేస్తం. ఇది మొక్కలకు నిత్యం నీటిని సరఫరా చేస్తూ, వాటి పచ్చదనాన్ని కాపాడుతుంది. ఇందులో ఐదులీటర్ల వాటర్‌ట్యాంకు ఉంటుంది. దీనిని ఇంటి ఓవర్‌హెడ్ ట్యాంకు లేదా సంప్కి అనుసంధానం చేసుకోవచ్చు. దానివల్ల ట్యాంకులో నీటిమట్టం నిరంతరం ఒకేలా ఉంటుంది. ఇందులోని నీరు దీని వెనుకనున్న సన్నని గొట్టాల ద్వారా మొక్కలకు చేరుతుంది. ఇది స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా పనిచేస్తుంది. ఇందులోని మ్యాగ్నెటిక్ సెన్సర్లు పరిసరాల్లోని ఉష్ణోగ్రతను, మొక్కల్లోని తేమను, మట్టిలోని తేమను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటాయి. మొక్కల అడుగున మట్టిలోను, మొక్కల్లోను తేమ ఏమాత్రం తగ్గినా, వాటికి తగిన నీటిని విడుదల చేస్తుంది. ‘ప్లాంట్మేట్’ పేరుతో స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ప్లాంటప్’ కంపెనీ ఇటీవల దీనిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఇంట్లో ఉన్నట్లయితే, ఇంట్లోని మొక్కల సంరక్షణ గురించి ఎలాంటి దిగులు ఉండదు. ఒకవేళ ఇల్లు విడిచి కొద్దిరోజులు ఊరికి వెళ్లాల్సి వచ్చినా మొక్కలకు నీరు అందకపోయే సమస్యే ఉండదు. దీని ధర 199 డాలర్లు (రూ.16,561) మాత్రమే! -
బ్యాటరీతో పనిచేసే ఎయిర్‌ప్యూరిఫైయర్, అదెలా పనిచేస్తుందంటే?
ఇప్పటి వరకు ఫ్యాన్ మాదిరిగా నేరుగా కరెంట్ కనెక్షన్‌తో పనిచేసే ఎయిర్ ప్యూరిఫైయర్స్నే చూశాం. ఇప్పుడు రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఎయిర్ ప్యూరిఫైయర్ అందుబాటులోకి వచ్చింది. ఇది మూడంచెల్లో గాలిని శుభ్రపరుస్తుంది. అమెరికన్ కంపెనీ ‘డ్రియో’ ఈ మ్యాక్రో ప్రో బ్యాటరీ పవర్డ్ ఎయిర్ పూరిఫైయర్ను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది గాలిలోని కాలుష్యానికి కారణమయ్యే సూక్ష్మ కణాలను, ప్రమాదకరమైన సూక్ష్మజీవులను తొలగిస్తుంది. గాలిలో వ్యాపించే వాసనలను తొలగిస్తుంది. దీనిని స్థూపాకారంలో నిర్మించడం వల్ల 360 డిగ్రీల్లో పనిచేస్తూ, గదిలోని అన్ని దిశల్లోనూ గాలిని సమానంగా శుభ్రపరుస్తుంది. ఇందులోని హెచ్13 హెపా ఫిల్టర్లు గాలిలోని సూక్ష్మాతి సూక్ష్మ కణాలను కూడా సమర్థంగా క్షణాల్లో పీల్చేసుకుంటాయి. ఇది 680 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న గదికి చక్కగా సరిపోతుంది. దీని ధర 109.99 డాలర్లు (రూ.9,156) మాత్రమే! -
కట్టేసుకుంటే చాలు, నొప్పిని ఇట్టే మాయం చేసే గాడ్జెట్.. అదెలా పనిచేస్తుందంటే
ఆటలాడేటప్పుడో, చిన్నా చితకా ప్రమాదాల్లోనో గాయాలు తగలడం సహజం. కొన్నిసార్లు కండరాలు వాచిపోయేలా, ఎముకల వరకు నొప్పి పాకేలా దెబ్బలు తాకుతుంటాయి. ఇంకొన్నిసార్లు కాళ్లు చేతులు బెణుకుతుంటాయి. నెత్తురు కనిపించని ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు ఉపశమనం కోసం కాపడం పెట్టడం, మంచుముక్కలను రుద్దడం వంటివి చేస్తుంటాయి. ఈ చర్యలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్న చోట కట్టేసుకుంటే ఇట్టే నొప్పిని మాయం చేసేస్తుంది. నడుము, భుజాలు, తొడలు, మోకాళ్లు– ఇలా ఎక్కడైనా కట్టుకునేందుకు వీలుగా ఉండే బెల్ట్ వల్ల దీనిని ఉపయోగించుకోవడం చాలా తేలిక. ఇది కాపడంలోని వెచ్చదనాన్నీ, మంచుముక్కల్లోని చల్లదనాన్నీ అందించగలదు. వెచ్చదనం కోసం ఒక స్విచ్, చల్లదనం కోసం మరో స్విచ్ ఇందులో ఉంటాయి. కోరుకున్న రీతిలో వీటిని ఎంపిక చేసుకుని, టెంపరేచర్‌ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని వాడటం వల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఈ పరికరాన్ని ‘రికవరీ థెర్మ్‌క్యూబ్’ పేరుతో ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 149 డాలర్లు (రూ.12,402) మాత్రమే! -
బ్రేక్‌ఫాస్ట్ నుంచి స్నాక్స్ వరకు అన్ని ఈజీగా ఇందులోనే!
పూరీలు, పునుగులు వంటి బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌తో పాటు.. గవ్వలు, గోరుమిటీలు, మురుకులు వంటి పిండి వంటకాలు.. ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ వింగ్స్ వంటి వెరైటీలనూ తయారు చేసుకోవాలంటే శ్రమ తప్పదు అనుకుంటున్నారా? అలాంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఈ మినీ డీప్ ఫ్రైయర్. నూనె తక్కువ పీల్చుకుంటూ.. హెల్దీ రుచులను అందిస్తుంది.1.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మెషిన్ బేస్ పాత్రకు లోపల.. ఆయిల్ ఇండికేటర్ ఉంటుంది. దాని ప్రకారం ఆయిల్ పోసుకుని.. నెట్ బాస్కెట్లో పిండి వంటకాలు, ఫ్రైలు, డీప్ ఫ్రైలు చేసుకోవచ్చు. బాస్కెట్‌కి పొడవైన హ్యాండిల్ ఉంటుంది. దాంతో ఈ డివైస్‌ని వినియోగించడం చాలా తేలిక. ఇందులో 140 డిగ్రీల సెల్సియస్ నుంచి 190 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. సుమారు 4 నిమిషాల నుంచి 15 నిమిషాల లోపు ఇందులో ఎలాంటి ఆహారాన్నైనా సిద్ధం చేసుకోవచ్చు. యాంటీ స్కాల్డింగ్ డిజైన్‌తో రూపొందిన ఈ గాడ్జెట్‌ను క్లీన్ చేయడం, ఇతర ప్రదేశాలకు మూవ్ చేసుకోవడం చాలా సులభం. (చదవండి: గుండె పదిలంగా ఉండాలంటే..ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!) -
ఈ స్మార్ట్ రింగ్ ఫింగర్లో ఉంటే ఫికర్ లేదు!
ఫిట్నెస్ ట్రాకర్‌గా పనిచేసే స్మార్ట్ రింగ్‌ను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ బోట్ భారతదేశంలో విడుదల చేసింది. చేతి వేళ్లకు ధరించగలిగేలా తయారు చేసిన రింగ్ యూజర్ల బయోమెట్రిక్స్, రోజువారీ ఫిజికల్ యాక్టివిటీస్‌ను పర్యవేక్షిస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ నీరు, చెమట నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని వ్యాయామ సెషన్లు లేదా నీళ్లలో యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా ధరించవచ్చు. స్టెప్ కౌంట్, నడిచిన దూరం, కేలరీలు ఎంత మేర కరిగాయి, హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలతో సహా అనేక రకాల ఆరోగ్య కొలమానాలను ఈ స్మార్ట్ రింగ్ ట్రాక్ చేస్తుంది. ఇందులో బాడీ రికవరీ ట్రాకింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఇది హార్ట్ బీట్ వేరియబిలిటీ అనాలిసిస్‌తో పాటు ఓవరాల్ యాక్టివిటీ రికార్డులను ఉపయోగించి యూజర్ల మొత్తం ఆరోగ్య స్థితి గురించి తెలియజేస్తుంది. శారీరక శ్రమను ట్రాక్ చేయడంతో పాటు నిద్రను కూడా ఈ స్మార్ట్ రింగ్ పర్యవేక్షిస్తుంది. మొత్తం నిద్ర వ్యవధి, వివిధ నిద్ర దశలలో గడిపిన సమయం సంభావ్య నిద్ర భంగం వంటి అంశాలను కవర్ చేస్తూ సమగ్ర స్లీప్ డేటాను అందిస్తుంది. ఇక రుతుక్రమం ఉన్న మహిళల కోసం రుతు చక్రాలను ట్రాక్ చేసే, అంచనా వేసే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ సమాచారాన్ని నేరుగా యూజర్ల ఫోన్‌కు నోటిఫికేషన్లు, రిమైండర్ రూపంలో అందిస్తుంది. ఈ మొత్తం డేటా బోట్ రింగ్ యాప్‌లో స్టోర్ అవుతుంది. దీంతో యూజర్లు తమ ఆరోగ్య ప్రమాణాలను, పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతుంది. అయితే ఈ స్మార్ట్ ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని బోట్ సంస్థ పేర్కొంది. -
బెల్ట్ తొడుక్కుంటే.. ఎండలో హాయిగా తిరుగొచ్చు
ఎండాకాలం బయటకు అడుగు పెట్టాలంటే కష్టమే! ఎండలు మండిపడుతున్నప్పుడు వీథుల్లోకి వెళితే ఒళ్లంతా వేడెక్కి, ముచ్చెమటలతో తడిసి ముద్దయిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎండలు భగభగమని మండిపడుతున్నా, బయటకు వెళ్లాలంటే ఇదివరకటి కాలంలో గొడుగులు ఉపయోగించేవారు. గొడుగులు తల మీద కాస్తంత నీడనివ్వగలవేమో గాని, ఒంటికి చల్లదనాన్ని ఇవ్వలేవు. అయితే, ఈ ఫొటోలోని వ్యక్తి తొడుక్కున్న బెల్ట్‌లాంటిది మీరూ తొడుక్కుంటే, ఎండలో కూడా హాయిగా బయట వ్యాహ్యాళికి వెళ్లొచ్చు. ఎందుకంటే, ఇది ఏసీ బెల్ట్. కెనడా కంపెనీ ‘స్పార్కల్ టీమ్’ దీనిని రూపొందించింది. ‘స్పార్కల్ టోర్నడో’ పేరిట రూపొందించిన ఈ బెల్ట్ చుట్టూ ఐదు ఫ్యాన్లు ఉంటాయి. ఇది 12 వోల్టుల రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని ఫ్యాన్లు చప్పుడు చేయకుండా తిరుగుతూ, 500 మిల్లీమీటర్ల వ్యాసార్ధం పరిధిలో ఉన్న గాలిని చల్లబరుస్తాయి. ఇవి నిమిషానికి 583 లీటర్ల గాలిని చల్లబరుస్తూ, ఒంటికి వేడి సోకకుండా రక్షణనిస్తాయి. ఇందులోని బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకుంటే, మూడుగంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. మూడుగంటల కంటే ఎక్కువసేపు బయట ఎండలో గడపాల్సి వస్తే, పవర్‌బ్యాంక్‌ను వెంట తీసుకుపోవడం ఉత్తమం! ‘స్పార్కల్ టీమ్’ క్రౌడ్ ఫండింగ్ ద్వారా దీని ఉత్పత్తి చేపట్టనుంది. దీని ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. చదవండి👉 ట్విటర్ సీఈవోగా లిండా నియామకం.. ఎలాన్ మస్క్‌పై ప్రశంసల వర్షం! -
కళ్లకు గంతలు కాదు.. హైటెక్ మసాజర్
ఫొటోలో కనిపిస్తున్న యువతి కళ్లకు తెల్లని గంతలు తొడుక్కున్నట్లు కనిపిస్తోంది కదూ! ఆమె కళ్లకు తొడుకున్నది గంతలు కాదు, హైటెక్ మసాజర్. అమెరికన్ కంపెనీ ‘ట్రూరెల్’ రూపొందించిన ‘ఐ మసాజర్’. ఇది బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది. అలసిన కళ్లను సుతారంగా మర్దన చేస్తుంది. కళ్ల చుట్టూ తగినంత నులివెచ్చదనాన్ని కలిగిస్తుంది. (Radhika Merchant Bag: అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. అందరి దృష్టి దానిపైనే.. ధర ఎంతో తెలుసా?) ఇందులోని ఎస్టీవీ టెక్నాలజీ ద్వారా కోరుకున్న రీతిలో వైబ్రేషన్స్, పల్సింగ్ సృష్టించి, తగినంత వెచ్చదనాన్ని, గాలి పీడనాన్ని కలిగించి కళ్ల అలసటను ఇట్టే మటుమాయం చేస్తుంది. ఇది అడ్జస్టబుల్ హెడ్‌సెట్‌తో లభిస్తుంది. తల పరిమాణానికి తగినట్లుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోని ప్లేలిస్ట్‌లో ఉన్న పాటలను వింటూ, కళ్లకు మర్దన తీసుకుంటూ, హాయిగా సేదదీరవచ్చు. దీని ధర 105 డాలర్లు (రూ.8,678) మాత్రమే. (వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్) -
అదిరిపోయే గాడ్జెట్.. ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు
దోమల నివారణకు చాలా పరికరాలే అందుబాటులో ఉన్నాయి. అవి మహా అయితే గదిలోని దోమలను పారదోల గలవేమో! ఆరుబయట పిక్నిక్ల వంటి వాటికి అవి పెద్దగా ఉపయోగపడవు. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం ఉంటే, ఆరుబయటి దోమలు, ఇతర కీటకాలు కూడా క్షణాల్లో పరారైపోతాయి. ‘థర్మాసెల్’ అమెరికన్ కంపెనీ రూపొందించిన ఈ‘థర్మోసెల్ ఈఎల్55’ అనే పరికరం రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. గదిలోనే కాదు, ఆరుబయట కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దోమలను పారదోలడంతో పాటు ఇది లాంతరులా కూడా పనిచేస్తుంది. ఇతర పరికరాల మాదిరిగా ఇందులో ఎలాంటి రసాయనాలను వాడనవసరం లేదు. కాబట్టి ఇబ్బందికరమైన వాసనలేవీ దీని నుంచి వెలువడవు. దీని ధర 49.99 డాలర్లు (రూ.4,126) మాత్రమే! -
ఆహార వ్యర్థాల్ని ఎరువుగా మార్చే హైటెక్ డస్ట్ బిన్!
ఇది చూడటానికి కాస్త ఆకర్షణీయమైన డస్ట్‌బిన్‌లా కనిపిస్తుంది గాని, నిజానికిది అధునాతనమైన ఎరువు తయారీ పరికరం. వంటింట్లో మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను ఇందులో వేసి, స్విచాన్ చేసుకుంటే చాలు, కొద్దిసేపట్లోనే ఆ వ్యర్థాలన్నీ ఎరువుగా మారిపోతాయి. ‘మిల్’ అనే అమెరికన్ కంపెనీ ఈ హైటెక్ ఫుడ్ స్క్రాప్ కంపోస్టర్ బిన్ను ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. వృథా అయిన ఆహారాన్ని చెత్తకుప్పల్లో పడవేయకుండా, ఇలా ఈ ఫుడ్ కంపోస్టర్లో పడేస్తే, ఇంచక్కా ఎరువుగా మారిపోతుంది. ఈ ఎరువును పెరటి తోటలకు, ఇళ్లల్లో ఏర్పాటు చేసుకునే పూలమొక్కల కుండీల్లోకి భేషుగ్గా వాడుకోవచ్చు. ఇంట్లో ఆహార వ్యర్థాల వల్ల తయారయ్యే ఎరువు పరిమాణం ఎక్కువగా ఉంటే, ఇతరులకు ఆ ఎరువును అమ్ముకోవచ్చు కూడా! ‘మిల్’ ఫుడ్ స్క్రాప్ కంపోస్టర్ ధర 396 డాలర్లు (రూ.32,415) మాత్రమే! -
ఒంట్లో కొవ్వెక్కడున్నా కనిపెట్టే సూపర్ గాడ్జెట్!
ఒంట్లోని కొవ్వు చాలా నిశ్శబ్దంగా పెరుగుతూ పోతుంది. బరువు పెరిగి, దుస్తులు బిగుతైనప్పుడు గాని ఒంట్లోని కొవ్వు కథ అర్థం కాదు. ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల తలెత్తే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి ఒంట్లోని కొవ్వు పేరుకుపోతున్న సంగతిని ముందుగానే గుర్తించి, కరిగించుకునే చర్యలు త్వరగా మొదలుపెడితే తప్ప ఫలితం ఉండదు. మరి ఒంట్లో పేరుకుపోతున్న కొవ్వును ముందుగానే గుర్తించడం ఎలా అనుకుంటున్నారా? ఈ ఫొటోలో కనిపిస్తున్న బుల్లి పరికరాన్ని చూశారుగా! ఇది చేతిలో ఉంటే చాలు, ఒంట్లో కొవ్వు ఎక్కడ పేరుకున్నా, ఇట్టే కనిపెట్టేస్తుంది. ఈ పరికరం పేరు ‘బెల్లో’. ఇది ‘డిస్క్రీట్ మల్టీ వేవ్‌లెంగ్త్ నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ’ సాంకేతికతతో పనిచేస్తుంది. దీన్ని స్విచాన్ చేసుకుని, ఒంట్లో కొవ్వు పెరిగిందనుకునే భాగాల వద్ద ఉంచి, స్కాన్ బటన్ నొక్కితే చాలు, మూడు నిమిషాల్లోనే యాప్ ద్వారా మొబైల్ ఫోన్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఆలివ్ హెల్త్‌కేర్’ దీనిని రూపొందించింది. దీని ధర 189 డాలర్లు (రూ.15,427) మాత్రమే! -
మీ చిన్నారుల కోసం.. భలే గాడ్జెట్ వచ్చేసింది!
బుడిబుడి అడుగులైనా రాని చిన్నారి బుజ్జాయిలను షికారు తిప్పడానికి స్ట్రోలర్లు వాడటం మామూలే! ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో చాలామంది స్ట్రోలర్లు వాడుతుంటారు. రోడ్లు బాగున్నప్పుడు మాత్రమే వీటిలో షికారు బాగుంటుంది. గతుకులమౖయెన దారుల్లో స్ట్రోలర్ల షికారు చిన్నారులకు అంత సుఖంగా ఉండదు. గతుకుల కుదుపుల వల్ల వాళ్లకు వెన్ను, వీపు నొప్పి తలెత్తవచ్చు. గతుకుల దారుల్లోనైనా కుదుపులు లేకుండా ప్రయాణించేలా అధునాతన పరిజ్ఞానంతో సరికొత్త తరహా స్ట్రోలర్‌ను అమెరికన్ కంపెనీ ‘గ్లక్స్కైండ్’ రూపొందించింది. ‘ఎల్లా’ పేరిట రూపొందించిన ఈ స్ట్రోలర్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అందువల్ల నిత్యం దీనిని వెనుక నుంచి నెట్టాల్సిన పని ఉండదు. ఎగుడు దిగుడు దారుల్లో వెళ్లాల్సి వచ్చినా, లోపల ఉన్న చిన్నారులకు కుదుపుల ఇబ్బంది కలగనివ్వదు. దీనిని ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదు. ఈ ఏడాది జరగనున్న ‘కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో’లో ప్రదర్శించనున్నారు. -
ఎయిర్‌పాడ్స్ మిస్, స్మార్ట్ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?
బెంగళూరు:బెంగళూరుకు చెందిన యువతి ఆటోలో తన ఖరీదైన ఎయిర్పాడ్లను మర్చిపోయింది. ఆగండాగండి.. అయ్యో...అని అపుడే మీరు ఫిక్స్ అయిపోకండి..టెక్నాలజీపై అవగాహన ఉన్న ఆటో డ్రైవర్ చేసిన పని గురించి తెలుసుకుంటే.. శభాష్ అంటారు. టెక్ సిటీ బెంగళూరులో స్మార్ట్ అండ్ టెక్సావీ ఆటో డ్రైవర్ చేసిన పని ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. (ఆ విషయంలో మనవాళ్లు చాలా వీక్! మీరు అంతేనా?తస్మాత్ జాగ్రత్త!) సరే.. సూటిగా విషయంలోకి వచ్చేస్తే...షిడికా అనే యువతి ఆఫీసుకు వెళ్లే హడావిడిలో తన ఎయిర్పాడ్లను పనికి వెళుతుండగా ఆటోలో మర్చిపోయింది. కానీ కేవలం అరగంటలో తన విలువైన గ్యాడ్జెట్ దొరకడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. దీంతో ఈ విషయాన్నిఆమె ట్విటర్లో షేర్ చేశారు. దీంతో పోస్ట్‌కి వేలకొద్దీ లైక్స్, కామెంట్స్ వచ్చాయి. జయహో ఆటో డ్రైవర్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. (స్పోర్టీ లుక్‌లో 2023 కవాసాకి నింజా 650 బైక్: ధర తెలిస్తే షాకే!) ఆటోలో ఖరీదైన గ్యాడ్జెట్ ఎయిర్‌పాడ్స్‌ను గుర్తించిన ఆటో డ్రైవర్ దాని కనెక్ట్ చేసి, ఆమె పేరు ఉంటో కనుకున్నాడు. తనకు పేమెంట్ చేసిన ఫోన్‌పే ద్వారా నంబరు తెలుసుకుని ఆమెను డ్రాప్ చేసిన ప్లేస్కొచ్చి, అక్కడి బసెక్యూరిటీకి వాటిని హ్యాండోవర్ చేయడంతో కథ సుఖాంతమైందన్నమాట. Lost my AirPods while traveling in an auto. Half an hour later this auto driver who dropped me at WeWork showed up at the entrance & gave it back to security. Apparently, he connected the AirPods to find the owner's name & used his PhonePe transactions to reach me. @peakbengaluru — Shidika Ubr (@shidika_ubr) November 15, 2022 Auto drivers are more tech enthusiasts then engineers or what ?? ( Especially in Bangalore) 😂 — Dibyadyoti Sarkar (@dibyadyoti_) November 15, 2022 -
వావ్! వాట్ ఏ కూల్ గ్యాడ్జెట్.. పది నిమిషాల్లోనే మీ వాతావరణం మారుస్తుంది
వేసవిలో ఆరుబయట వనభోజనాలు, పిక్నిక్ పార్టీలు చేసుకునేందుకు ఎవరైనా సాహసిస్తారా? వేసవి ఎండలను తలచుకుంటేనే ముచ్చెమటలు పోస్తాయి, ఇక ఆరుబయట పిక్నిక్ పార్టీలు కూడానా అని అనుకుంటున్నారా? మరేం ఫర్వాలేదు ఈ ఫొటోలో కనిపిస్తున్న పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ వెంట ఉంటే, వేసవిలోనైనా ఆరుబయట వనభోజనాలు, పిక్నిక్ పార్టీలు భేషుగ్గా చేసుకోవచ్చు. ఇళ్లల్లో అమర్చుకునే ఏసీల మాదిరిగా దీనికి ఇన్స్టాలేషన్ బెడద ఉండదు. ఎక్కడికంటే అక్కడకు తేలికగా తీసుకుపోవచ్చు. దీని బరువు పది కిలోలు మాత్రమే. పవర్ అడాప్టర్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ఉష్ణోగ్రతను 16 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు కోరుకున్న రీతిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకున్న పది నిమిషాల వ్యవధిలోనే పరిసరాల్లోని ఉష్ణోగ్రతను ఇది ఇట్టే చల్లబరచేస్తుంది. చైనాకు చెందిన ‘నైట్‌కోర్’ బహుళజాతి సంస్థ ఈ పోర్టబుల్ ఏసీని అందుబాటులోకి తెచ్చింది. చదవండి: Smartphone Printer: సెల్ఫీ లవర్స్ కోసం.. అదిరిపోయే ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం! -
మన ముందుకు మెటా ప్రపంచం.. ఎప్పటి నుంచి అంటే?
సోషల్ మీడియాలో ఫేస్బుక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కాలంలో ఇన్‌స్టా, ట్విటర్, టిక్‌టాక్‌లు సోషల్ మీడియాను కొత్త ఎత్తులకు తీసుకెళ్లాయి. ఇప్పుడు సోషల్ మీడియా కాదు ఏకంగా వర్చువల్ యూనివర్స్‌గా మెటావర్స్ తెస్తానంటున్నాడు మార్క్ జూకర్బర్గ్. దాదాపు ఏడాది కాలంగా మెటావర్స్ గురించి వింటున్నా చాలా మందికి ఇంకా అది కొరుకుడు పడని విషయంగానే ఉంది. దీన్ని గమనించిన జూకర్బర్గ్ మెటావర్స్ ఎక్సీపీరియన్స్ మరింత చేరువ చేసే పనిలో పడ్డారు. మెటావర్స్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే ప్రత్యేకమైన గ్యాడ్జెట్స్ అవసరం. లేటెస్ట్ సెన్సార్ల ఆధారంగా పని చేసే ఈ గ్యాడ్జెట్స్ ఉన్నప్పుడే మెటావర్స్ అనుభూతిని ‘ఫీల్’ అవగలం లేదంటూ వర్చువల్ రియాలిటీ, యానిమేషన్ వీడియోలకు మరో రూపం మెటావర్స్ అన్నట్టుగా ఉంటుంది. దీంతో మెటావర్స్ ఫీల్‌కు ఉపయోగపడే గ్యాడ్జెట్స్‌తో మెటాస్టోర్ను అందుబాటులోకి తెస్తున్నారు. కాలిఫోర్నియాలో బర్లింగేమ్ క్యాంపస్‌లో తొలి మెటాస్టోర్ని 2022 మే 9న ప్రారంభించబోతున్నారు. అదే విధంగా ఆన్లైన్ పోర్టల్ మెటాడాట్కామ్ కూడా అందుబాటులోకి రానుంది. ఇందులో దొరికే గ్యాడ్జెట్స్‌ని కొనుగోలు చేసి ఉపయోగించిన తర్వాతే మెటావర్స్ మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మెటా గ్యాడ్జెట్స్ ఎంత ధరలో లభిస్తున్నాయనే అంశంపై ఇంకా పూర్తి వివరాలు జూకర్బర్గ్ రిలీజ్ చేయలేదు. చదవండి: యాపిల్ నుంచి కొత్తగా స్మార్ట్ బాటిల్స్! ధర ఎంతంటే? -
గాడ్జెట్ ఫ్రీ..‘బాల్య’నగరి..
టీవీల విజృంభణతో చిన్నారుల్లో శారీరక చురుకుదనం లోపించడం ప్రారంభమై, గాడ్జెట్స్ పుణ్యమాని పతాక స్థాయికి చేరింది. ఇక కరోనా దెబ్బకు ఈ సమస్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో నగరంలో ఏర్పాటవుతున్న పలు కిడ్స్ జోన్స్, ప్లే ఏరియాలు గాడ్జెట్ ఫ్రీ, సే నో టు గాడ్జెట్స్ వంటి నినాదాలతో నగరవాసుల్ని ఆకర్షిస్తున్నాయి. కొంపల్లి, పోచారం, నెక్లెస్‌రోడ్, మియాపూర్.. వంటి ప్రాంతాల్లో ఉన్న ఈ ప్లే ఏరియాస్ భాగ్యనగరంలో బాల్యనగరాల్లా వారాంతాల్లో కిటకిటలాడుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో ‘గాడ్జెట్ల జోరు వల్ల చెమట్లు పట్టేంత స్థాయిలో పిల్లలు ఆటలాడటం అరుదైపోయింది. అయితే అలాంటి ఆటల ద్వారానే చిన్నారుల్లో మానసిక, శారీరక వికాసం సాధ్యమవుతుంది. అందుకే మేం సంపూర్ణంగా గాడ్జెట్ ఫ్రీ ప్లే ఏరియా ఏర్పాటు చేశాం’ అని నెక్లెస్‌రోడ్ మీద నెలకొల్పిన సిమ్ అండ్ శామ్స్ ప్లే, పార్టీ టౌన్ నిర్వాహకులు చెప్పారు. నగరంలోనే అతిపెద్ద ఇండోర్ స్పోర్ట్స్ స్పేస్ ఫర్ చిల్డ్రన్ తమదే అన్నారాయన. ఆటలు టు ఆరోగ్యం.. గాడ్జెట్ అడిక్షన్ నుంచి చిన్నారుల్ని బయటకు తీసుకురావాలంటే అంతకు మించి ఆసక్తిని పెంచే ఆటల్ని అందిస్తున్నారు. ట్రాంపొలైన్స్, స్టిక్కీ వాల్, డోనట్ స్లైడ్, స్పైరల్ స్లైడ్, వాల్ క్లైంబర్స్, నింజా సర్క్యూట్, వల్కనో స్లైడ్, బబుల్ రోల్, మంకీ బ్రిడ్జి.. వంటి శారీరక వ్యాయామానికి ఉపకరించి ఆరోగ్యాన్నిచ్చేలా, పలు ప్రత్యేకమైన డిజైన్డ్ గేమ్స్ ఇలాంటి ప్లే ఏరియాల్లో ఏర్పాటు చేస్తున్నారు. జంప్స్, రన్స్.. స్కూల్స్, ఇంటి పరిసరాల్లో ఆడుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో వీటికి చిన్నారులు ఆకర్షితులవుతున్నారు. నాలుగేళ్లలోపు చిన్నారులకు ప్రత్యేకమైన టాడ్లర్ ఏరియా నెలకొల్పుతున్నారు. మిగిలినవన్నీ 14ఏళ్లలోపు చిన్నారులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. బర్త్‌డే.. సందడే.. కేవలం ఆటపాటలకు మాత్రమే పరిమితం చేయకుండా చిన్నారుల పుట్టిన రోజులు కూడా జరుపుకునేందుకు వీలుగా వేదికలు రూపొందిస్తున్నారు. స్పెషల్ సర్కస్ థీమ్ వంటి పార్టీ ఏరియాలో.. బర్త్‌డేలు నిర్వహిస్తున్నారు. అలాగే చిన్నారులతో వచ్చే పెద్దలు బోర్ ఫీల్ కాకుండా వారికి కూడా తంబోలా, మ్యూజిక్ ఛెయిర్స్, వాల్ పాసింగ్, డ్యాన్స్ పోటీలు.. ఏర్పాటు చేస్తున్నారు. కిడ్స్.. అండ్ పేరెంట్స్.. మా ప్లే ఏరియా మొత్తం 6వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పాం. ఇందులో పిల్లలూ, పేరెంట్స్ కలిసి కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఫంక్షన్ హాల్, కెఫెటేరియా.. వంటివి ఉన్నాయి. 15 రకాల వైవిధ్యభరితమైన గేమ్స్ ఉన్నాయి. చిన్నారికి మాత్రమే ఎంట్రీ ఫీజు ఉంటుంది. చిన్నారితో వచ్చే పేరెంట్స్‌కి ఉచితంగా ప్రవేశం కల్పిస్తాం. – ప్రణీత్, సిమ్ ఎన్ శ్యామ్ -
ఈ లిప్‌స్టిక్ మిమ్మల్ని కాపాడుతుంది
ఫొటోలో కనిపిస్తున్న లిప్‌స్టిక్ సాధారణమైనది కాదు. మహిళల అందానికే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం.. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన శ్యామ్ చౌరేసియా అనే ఔత్సాహిక శాస్త్రవేత్త మహిళల స్వీయ రక్షణ కోసం ఓ ఆయుధాన్ని తయారు చేశారు. ఇది అచ్చంగా లిప్‌స్టిక్‌ను పోలి ఉండే లిప్‌స్టిక్ గన్. దీన్ని నొక్కితే పేలుడు శబ్ధం వినిపిస్తుంది. అంతేకాక నేరుగా ఎమర్జెన్సీ నంబర్ 112కు కనెక్ట్ అవుతుంది. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై ప్రమాదంలో ఉన్న మహిళకు సాయపడతారు. ఈ లిప్‌స్టిక్ గన్ ఆవిష్కర్త శ్యామ్ మాట్లాడుతూ.. ‘ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనపుడు మహిళలు ఈ లిప్‌స్టిక్‌పై ఉన్న బటన్ నొక్కితే సరిపోతుంది. వెంటనే పోలీసులకు ఫోన్ వెళుతుంది. దీనికి చార్జింగ్ సదుపాయంతో పాటు బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. నిస్సందేహంగా అందరూ తమ వెంట దీన్ని తీసుకెళ్లవచ్చు’ అని పేర్కొన్నాడు. ఈ పరికరాన్ని తయారు చేయడానికి అతనికి సుమారు ఒక నెల సమయం పట్టగా కేవలం రూ.600 మాత్రమే ఖర్చయ్యాయని తెలిపాడు. త్వరలోనే అతను ఈ లిప్‌స్టిక్ గన్‌పై పేటెంట్ హక్కులు తీసుకోనున్నాడు. కాగా ఈ పరికరాన్ని ముందుగా బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన షెఫాలి రాయ్ ప్రయోగించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇది వెంట తీసుకెళ్లడానికి ఎంతో సౌకర్యంగా ఉంది. ఈ గన్ చేసే శబ్ధం ఎంతో భయాన్ని కల్పించేదిగా ఉంది. ఇది మీ వెంట ఉంటే మిమ్మల్ని ఎవరూ అనుమానించరు. ఎందుకంటే అందరూ దీన్ని మామూలు లిప్‌స్టిక్‌గా భ్రమపడతారు’ అని చెప్పుకొచ్చింది. -
గోప్యత డొల్లేనా!
సాక్షి, హైదరాబాద్: ఫేస్బుక్ ఇటీవల ‘పోర్టల్’గాడ్జెట్ ప్రవేశపెట్టింది.. వీడియో కాలింగ్ కోసం వినియోగిస్తారు దీన్ని.. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.. ఎన్నో ప్రత్యేకతలు.. ఎన్నో వివాదాలు కూడా.. ఇంతకీ ఈ పోర్టల్ ఏమిటి? దాని వెనుక ఉన్న వివాదం ఏంటి..? మీరెప్పుడైనా వీడియో కాల్ చేశారా? చేసే ఉంటారులెండి. దీంతో చిక్కేమిటంటే.. వీడియో కెమెరా స్థిరంగా ఉంటుంది. పక్కన ఉన్నవాళ్ల మాట వినిపిస్తుందేమో గానీ.. ముఖం మాత్రం కనపడదు. ఇంకా బోలెడన్ని సమస్యలున్నాయి. వీటన్నింటికీ తాము ‘పోర్టల్’తో చెక్ పెట్టామని ఫేస్బుక్ వారం రోజుల కింద ప్రకటించింది. ఓ ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, 360 డిగ్రీ కెమెరా.. అలెక్సా లాంటి పర్సనల్ అసిస్టెంట్లతో తయారైన ఈ సూపర్ గాడ్జెట్‌లో ప్రత్యేకతలు ఎన్ని ఉన్నా.. వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందన్న ఒకే కారణంతో వివాదం మొదలైంది. ఎన్నో ప్రత్యేకతలు.. వీడియో కాలింగ్ కోసం ప్రత్యేకంగా ఓ గాడ్జెట్ తయారు కావడం పోర్టల్ మొదటి ప్రత్యేకత అని చెప్పాలి. ఇంట్లో ఓ మూలన ఇది ఉందనుకోండి. ఇంటర్నెట్ ఆధారంగా ఎవరికైనా వీడియోకాల్ చేయొచ్చు. కృత్రిమ మేధతో పనిచేసే వీడియో కెమెరా ఉండటం వల్ల కాల్ నాణ్యత బాగా ఉండటంతో పాటు జూమ్ ఇన్.. జూమ్ అవుట్లు కూడా వాటంతట అవే జరిగిపోతాయి. ఎవరు మాట్లాడుతున్నారో గుర్తించి కెమెరాను వారి వైపు ఫోకస్ చేయడం.. వ్యక్తులు కదిలితే అందుకు తగ్గట్టు కెమెరా యాంగిల్ మార్చడం వంటివన్నీ పోర్టల్ ప్రత్యేకతల్లో కొన్ని. ఇది రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఒకటేమో 15 అంగుళాల స్క్రీన్ ఉన్న ట్యాబ్లెట్‌తో కూడుకున్నదైతే.. రెండోది 10 అంగుళాల స్క్రీన్ సైజు ఉండేది. రెండింటిలోనూ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ ఉంటుంది. చిన్నదాని ఖరీదు 200 డాలర్లు కాగా.. కొన్ని అదనపు ఫీచర్లున్న పెద్దసైజు పోర్టల్ రెట్టింపు ధర పలుకుతోంది. ఇదీ వివాదం.. ఫేస్బుక్ ద్వారా వినియోగదారుల సమాచారం సేకరించడం.. దాన్ని మార్కెటింగ్ సంస్థలకు అమ్ముకోవడం ఫేస్బుక్ చాలాకాలంగా చేస్తున్న పనే. ఈ కారణంగానే మనం ఏదైనా ఒక పోస్ట్ లేదా ప్రకటనపై క్లిక్ చేస్తే చాలు.. కొంత సమయం వరకూ ఆ ప్రకటన, పోస్టులోని అంశాల ప్రకటనలే కనిపిస్తుంటాయి. వ్యక్తిగత అభిరుచులను గుర్తించి వాటికి అనుగుణమైన ప్రకటనలు గుప్పించడమూ ఫేస్బుక్ చాలాకాలంగా చేస్తోంది. ఇలా వినియోగదారుల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇతర దేశాల ప్రభావం పడిందన్న ఆరోపణలు రావడం.. ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్ అమెరికా ప్రభుత్వం ముందు ఈ విషయాన్ని ఒప్పుకోవడం ఇటీవలి పరిణామాలే. అయితే ఆ తర్వాత అయినా ఫేస్బుక్ తన పద్ధతులు మార్చుకుంటుందని ఆశించారు. పోర్టల్ ద్వారా తాము సమాచారం సేకరించబోమని ఆ సంస్థ కూడా నమ్మబలికింది. అయితే వారం రోజులు గడిచాయో లేదో.. అసలు విషయం బయటకు వచ్చేసింది. కొన్ని వెబ్సైట్లు పంపిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పోర్టల్ ద్వారా కూడా సమాచార సేకరణ సాధ్యమేనని పరోక్షంగానైనా అంగీకరించింది. వీడియో కాల్ ఎంత సేపు నడిచింది.. ఎవరికి ఎవరు ఎన్నిసార్లు వీడియో కాల్ చేశారు.. అలెక్సా సాయంతో ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నారు? ఉపయోగించిన యాప్‌లు ఎలాంటివి.. వంటి వివరాలను సేకరించే సామర్థ్యం పోర్టల్‌కు ఉందని ఫేస్బుక్ అంగీకరించింది. ప్రస్తుతానికి తాము ఈ అంశాన్ని ప్రకటనల కోసం వాడట్లేదని తెలిపింది. వాట్సాప్‌కు పోటీగా ఫేస్బుక్ సిద్ధం చేసిన చాటింగ్ అప్లికేషన్ ‘మెసెంజర్’ప్లాట్‌ఫారంపైనే పోర్టల్ కూడా పనిచేస్తుందని వివరించింది. -
యాంటీబయాటిక్ మోతాదును లెక్కించే గాడ్జెట్...
యాంటీబయాటిక్ మందులతో జబ్బులు నయం కావచ్చునేమోగానీ.. దుష్ప్రభావాలు కొన్ని ఉండనే ఉంటాయి. అయితే మందు ఏ స్థాయిలో వాడితే దుష్ప్రభావాలు తక్కువ అవుతాయో తెలుసుకుంటే ఆ ఇబ్బందులను అధిగమించవచ్చు. మిగిలిన వాటి మాటెలా ఉన్నా వాన్కోమైసిన్ అనే యాంటీబయాటిక్ మోతాదును రక్తంలో సులువుగా గుర్తించేందుకు ఈపీఎఫ్‌ఎల్ విద్యార్థులు కొందరు ఓ విన్నూతమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు. సెన్స్ యూ పేరుతో నిర్వహహిస్తున్న అంతర్జాతీయ బయోసెన్సర్ల పోటీ కోసం తయారుచేసిన ఈ వినూత్నమైన పరికరం భవిష్యత్తులో ఇతర యాంటీబయాటిక్‌లకూ ఉపయోగపడుతుందని ఈ విద్యార్థులు తెలిపారు. వాన్కోమైసిన్ వాడకం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయని, బధిరత్వం వచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిసినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు దీన్ని ఉపయోగిస్తూంటారు. రక్తంలో యాంటీబయాటిక్ ఎంత మోతాదులో ఉందో తెలిస్తే.. అందుకు తగ్గట్టుగా తదుపరి డోస్‌లను నిర్ణయించుకోవచ్చునని, తద్వారా సైడ్ ఎఫెక్ట్స్‌ను తక్కువ చేయవచ్చునని విద్యార్థులు తెలిపారు. వాన్కోమైసిన్ తో జట్టుకట్టగల ఒక పెప్టైడ్‌ను సృష్టించి, ప్రతిదీప్తి లక్షణమున్న పదార్థాన్ని జోడించడం ద్వారా తాము ఈ సెన్సర్‌ను తయారు చేసినట్లు వివరించారు. -
ఆటలా వ్యాయామం...
ఆడుతు పాడుతు పనిచేస్తూంటే అలుపు సొలుపు తెలియదట. మరి ఇది కేవలం పని విషయానికి మాత్రమేనా? వ్యాయామానికి కూడా వర్తిస్తుందా? అయోవా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వెబ్ ఆధారిత ఆటతో ఈ అంశాన్ని పరీక్షకు పెట్టారు. స్మార్ట్ఫోన్తోపాటు ఫిట్‌బిట్ గాడ్జెట్ ఉన్న వారెవరైనా ఈ గేమ్ ఆడవచ్చు. బద్దకిష్టులను కూడా వ్యాయామం చేసేలా చేయవచ్చునని వీరు అంటున్నారు. శరీరానికి కొద్దోగొప్పో పని కల్పించకపోతే ఊబకాయం వచ్చేసి మధుమేహం మొదలుకొని కేన్సర్ల వరకూ అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నది తెలిసిన విషయమే. వెబ్ గేమ్ ద్వారా వ్యాయామాన్ని చేసేందుకు చాలామంది ఆసక్తి చూపారని.. తొలి పైలెట్ పరీక్షల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని లూకాస్ కార్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ ఆట ఆడటం మొదలుపెట్టిన తరువాత ఒక్కో వ్యక్తి సగటున 2200 అడుగులు ఎక్కువ వేశాడని ఇది ఒక మైలు నడకకు సమానమని చెప్పారు. మ్యాప్ట్రెక్ పేరున్న ఈ గేమ్.. వినియోగదారులకు తరచూ చిన్న చిన్న సవాళ్లు విసురుతూ ఎక్కువ శ్రమ పడేలా చేస్తుందని, ఇరుగుపొరుగు వారి వ్యాయామం తీరుతెన్నులను కూడా కలిపడం ద్వారా గేమ్ మరింత ఆసక్తికరంగా మారిందని కార్ వివరించారు. వారం రోజులు ఒక యూనిట్‌గా చేసి నడకకు సంబంధించిన సవాళ్లు విసిరి ఫలితాలను విశ్లేషించడం ద్వారా తాము ఈగేమ్ సత్ఫలితాలిస్తున్నట్లు నిర్ధారించినట్లు చెప్పారు. -
‘బెడ్రూం ముచ్చట్లు’ బయటపెడుతున్న అలెక్సా!
అమెజాన్ అలెక్సా.. ఓ మంచి వర్చువల్ అసిస్టెంట్. అడగ్గానే చాలా పనులు చేసిపెడుతుంది. అలెక్సా.. అని పిలవగానే స్పందిస్తుంది. మనకు కావాల్సిన సమాచారమేదైనా సరే.. వికీపీడియా సహా అనేక వెబ్సైట్లను వడపోసి మరీ సేకరించి పెడతుంది. ఇంట్లోని స్మార్ట్ పరికరాలనూ మనం చెప్పినట్టుగా నియంత్రిస్తుంది. ఇదేదో భలే బాగుందే.. మనమూ అలెక్సాను తెచ్చేసుకుందాం అనుకుంటే మాత్రం.. కొంచెం జాగ్రత్త సుమా అనే హెచ్చరిక వినవస్తోంది. ఏమిటంటారా..? ఈ మధ్య అలెక్సా చేసిన ఓ నిర్వాకం అలాంటిది మరి! అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో పోర్ట్‌ల్యాండ్ అనే పట్టణం ఉంది. ఆ పట్టణానికి చెందిన డేనియల్ అనే మహిళ ఈ మధ్యే అమెజాన్ ఎకో గాడ్జెట్‌ను కొనుగోలు చేసింది. అందులో వర్చువల్ అసిస్టెంట్ అలెక్సాతో ముచ్చట్లు మొదలుపెట్టింది. అప్పుడప్పుడు వంటల ‘రెసిపీ’లు అడిగితే.. అలెక్సా ఇంటర్నెట్ అంతా గాలించి అప్పజెప్పింది. ఆ తర్వాత అడిగిన ఎన్నో పనులు చేసిపెట్టింది. ‘మన ముచ్చట్లు’ బయటికెళితే ఎలా? అపాయింట్మెంట్లు ఫిక్స్ చేయడం మొదలుకొని రైలు, విమానాల టికెట్లు బుక్ చేయడం వరకూ అలెక్సా అన్ని పనులు చేసి పెడుతోందని డేనియల్ తెగ ముచ్చటపడిపోయింది. కానీ ఓ రోజు వారికి ఓ బాంబు లాంటి వార్త తెలిసింది. ఆమె, ఆమె భర్త ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకున్న కొన్ని ముచ్చట్లను అలెక్సా రికార్డు చేసింది. వాటిని డేనియల్ కాంటాక్ట్స్ లిస్టులో ఉన్న భర్త స్నేహితుడొకరి ఫోన్‌కు పంపేసింది! డేనియల్ ఈ విషయాన్ని ఓ స్థానిక చానల్‌కు చెప్పడంతో విష యం వైరల్ అయిపోయింది. ‘‘ఎవరూ లేనప్పుడు బోలెడన్ని మాట్లాడుకుంటాం. వాటిని ఎవరైనా వింటే కొంపలంటుకు పోవూ..! ఇప్పటికే కృత్రిమ మేధ మనుషులపై పెత్తనం చలాయిస్తుందన్న ఆందోళన పెచ్చుమీరుతున్న సమయంలో.. అలెక్సా నిర్వాకం మరింత భయపెడుతోంది..’’ అని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తననే పిలిచిందనుకుందట! అయితే అలెక్సాను రూపొందించిన అమెజాన్ మాత్రం.. ‘‘అబ్బే.. అంత సీనేమీ లేదు. డేనియల్, ఆమె భర్త మాట్లాడుకుంటున్నప్పుడు ‘అలెక్సా’ అన్నట్టుగా అనిపిస్తే... ఆ గాడ్జెట్ తననే పిలు స్తున్నారనుకుని వెంటనే స్పందించింది. పైగా వాళ్ల మాటల్లో రికార్డింగ్ లాంటి పదాలు వినిపించ డంతో మాటల్ని రికార్డు చేయాలేమో అనుకుని చేసేసింది. డేనియల్ భర్త సహోద్యోగి పేరు కూడా వినిపించే ఉంటుంది కాబట్టి.. మాటల రికార్డిం గ్ను అతడికి పంపేసింది..’’ అని సర్దిచెబుతోంది. ఏదేమైనా ఎటుపోయి ఏటో వస్తోంది వ్యవహారం! -
కొవ్వును గుర్తించే కొత్త సాధనం!
ప్రస్తుత కాలంలో ఫిట్నెస్ పై ధ్యాస పెరుగుతోంది. మరోవైపు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో శరీరంలో కొవ్వును తగ్గించుకొని, ఆరోగ్యంగా మార్చుకొనేందుకు ఉపయోగపడే అనేక రకాల యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. నాజూకైన శరీరాకృతికి తోడు.. ఆరోగ్యాన్ని సమకూర్చుకునేందుకు అన్నిరకాలుగానూ సహకరిస్తామంటూ అనేక రకాల పరికరాలు హామీలు కూడ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొలెస్టరాల్ తో బాధడుతున్న వారికోసం కొత్తగా స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఇది శరీరంలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది. ఎంతటి వ్యాయామం చేసినా శరీరంలో కొవ్వు తగ్గడం లేదని బాధపడేవారికి మార్కెట్లో ఓ కొత్త గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు ఇంతకు ముందే మార్కెట్లో ఉన్న ఎన్నో గాడ్జెట్లకు భిన్నంగా కొత్తగా అభివృద్ధి పరచిన ఈ గాడ్జెట్ పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. మన శరీరంలో ఉన్న కొవ్వును ఇట్టే పసిగట్టే ఈ సాధనం వెంటనే మొబైల్ కు మెసేజ్ పంపిస్తుంది. చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ సహాయంతో శరీరంలోని కొవ్వును అంచనా వేసి, కండరాల సామర్థ్యాన్ని కూడ తెలుపుతుంది. ఈ గాడ్జెట్ ఉపయోగించి, దీని ఫలితాలకు అనుగుణంగా ప్రతిరోజూ నిర్వహించే వ్యాయామంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాధారణ మొబైల్ ఫోన్లు, గాడ్జెట్ల వలె కాక ఒక్కసారి రీ ఛార్జ్ చేస్తే చాలు స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ రెండు వారాల వరకూ పనిచేస్తుంది. అంతేకాక ప్రతిరోజూ వ్యాయామం కోసం జిమ్ లకు, ఫిట్నెస్ ట్రైనర్లకు చెల్లించే ఫీజుతో పోలిస్తే దీని ఖరీదు కూడ చాలా తక్కువగానే ఉంటుంది. సుమారు 89 యూరోల వరకూ ఖరీదు ఉండే ఈ ఎలక్ట్రిక్ పరికరం, ఒరిజినల్ ఐపాడ్ సైజులో ఉంటుంది.