ఇది చూడటానికి కాస్త ఆకర్షణీయమైన డస్ట్‌బిన్‌లా కనిపిస్తుంది గాని, నిజానికిది అధునాతనమైన ఎరువు తయారీ పరికరం. వంటింట్లో మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను ఇందులో వేసి, స్విచాన్ చేసుకుంటే చాలు, కొద్దిసేపట్లోనే ఆ వ్యర్థాలన్నీ ఎరువుగా మారిపోతాయి.
‘మిల్’ అనే అమెరికన్ కంపెనీ ఈ హైటెక్ ఫుడ్ స్క్రాప్ కంపోస్టర్ బిన్‌ను ఇటీవల మార్కెట్‌లోకి తెచ్చింది. వృథా అయిన ఆహారాన్ని చెత్తకుప్పల్లో పడవేయకుండా, ఇలా ఈ ఫుడ్ కంపోస్టర్‌లో పడేస్తే, ఇంచక్కా ఎరువుగా మారిపోతుంది.
ఈ ఎరువును పెరటి తోటలకు, ఇళ్లల్లో ఏర్పాటు చేసుకునే పూలమొక్కల కుండీల్లోకి భేషుగ్గా వాడుకోవచ్చు. ఇంట్లో ఆహార వ్యర్థాల వల్ల తయారయ్యే ఎరువు పరిమాణం ఎక్కువగా ఉంటే, ఇతరులకు ఆ ఎరువును అమ్ముకోవచ్చు కూడా! ‘మిల్’ ఫుడ్ స్క్రాప్ కంపోస్టర్ ధర 396 డాలర్లు (రూ.32,415) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment