dustbin
-
ఆహార వ్యర్థాల్ని ఎరువుగా మార్చే హైటెక్ డస్ట్ బిన్!
ఇది చూడటానికి కాస్త ఆకర్షణీయమైన డస్ట్‌బిన్‌లా కనిపిస్తుంది గాని, నిజానికిది అధునాతనమైన ఎరువు తయారీ పరికరం. వంటింట్లో మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను ఇందులో వేసి, స్విచాన్ చేసుకుంటే చాలు, కొద్దిసేపట్లోనే ఆ వ్యర్థాలన్నీ ఎరువుగా మారిపోతాయి. ‘మిల్’ అనే అమెరికన్ కంపెనీ ఈ హైటెక్ ఫుడ్ స్క్రాప్ కంపోస్టర్ బిన్ను ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. వృథా అయిన ఆహారాన్ని చెత్తకుప్పల్లో పడవేయకుండా, ఇలా ఈ ఫుడ్ కంపోస్టర్లో పడేస్తే, ఇంచక్కా ఎరువుగా మారిపోతుంది. ఈ ఎరువును పెరటి తోటలకు, ఇళ్లల్లో ఏర్పాటు చేసుకునే పూలమొక్కల కుండీల్లోకి భేషుగ్గా వాడుకోవచ్చు. ఇంట్లో ఆహార వ్యర్థాల వల్ల తయారయ్యే ఎరువు పరిమాణం ఎక్కువగా ఉంటే, ఇతరులకు ఆ ఎరువును అమ్ముకోవచ్చు కూడా! ‘మిల్’ ఫుడ్ స్క్రాప్ కంపోస్టర్ ధర 396 డాలర్లు (రూ.32,415) మాత్రమే! -
వంటింటి చెత్తను ఎరువుగా మార్చే డస్ట్ బిన్! ధర ఎంతంటే!
చూడటానికి ఇదేదో కొత్తరకం పీపాలా ఉంది కదూ! అటూ ఇటుగా పీపా ఆకారంలోనే ఉన్న చెత్తబుట్ట ఇది. అలాగని సాదాసీదా చెత్తబుట్ట కాదు, హైటెక్ చెత్తబుట్ట. వంటింటి వ్యర్థాలను ఇది గంటల వ్యవధిలోనే ఎరువుగా మార్చేస్తుంది. ఇందులో రెండులీటర్ల పరిమాణం వరకు వంటింటి ఆహార వ్యర్థాలను వేసుకోవచ్చు. దీని వేగాన్ని ఎంపిక చేసుకునేందుకు నాలుగు బటన్లు, లోపల ఎంతమేరకు ఖాళీ ఉందో తెలుసుకోవడానికి వీలుగా ఎల్సీడీ డిస్ప్లే, ట్రాన్స్పరెంట్ మూత ఉంటాయి. స్టాండర్డ్ మోడ్ ఎంచుకుంటే, నాలుగు గంటల్లోనే ఇందులో వేసిన చెత్తంతా ఎరువుగా తయారవుతుంది. హైస్పీడ్ మోడ్ ఎంచుకుంటే, రెండు గంటల్లోనే పని పూర్తవుతుంది. ఫెర్మెంట్ మోడ్ ఎంచుకుంటే, ఎరువు తయారీకి దాదాపు ఆరుగంటల సమయం పడుతుంది. అయితే, ఈ మోడ్ ఎంపిక చేసుకుంటే, విద్యుత్తు తక్కువ ఖర్చవుతుంది. ఇందులో తయారైన ఎరువును పెరటి మొక్కల కోసం వాడుకోవచ్చు. తక్కువ ధరకు బయట ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఈ హైటెక్ చెత్తబుట్ట ఖరీదు 269 డాలర్లు (రూ.21,336). -
కసాయి తల్లి...మరో పెళ్లి కోసం నెలల పసికందుని....
సాక్షి ముంబై: వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారని తమ కన్న పిల్లల్నే హతమారుస్తున్న కసాయి తల్లిదండ్రులను చూస్తున్నాం. మరికొంతమంది తమ అక్రమసంబంధాలు గురించి పిల్లలకు తెలిసిపోయిందనో లేక వాళ్లు చూశారనో చంపేస్తున్నారు. కొంతమంది జంటలు విడాకులు తీసుకుని మరోకరితో కొత్తజీవితాన్ని పంచుకునేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని వాళ్లను రోడ్ల మీద, బస్టాండ్‌ల్లోనూ, లేదా చెత్తబుట్టలోనూ వదిలేసి వెళ్లిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడో మహిళ అలాంటి దారుణానికే పాల్పడింది. వివరాల్లోకెళ్తే...ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లోని డస్ట్‌బిన్ దగ్గర 15 రోజుల పసికందును విడిచిపెట్టి వెళ్లిపోయిన 22 ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బీహార్‌లోని తన గ్రామంలో వయస్సులో తన కంటే రెట్టింపు వయసు ఉన్న వ్యక్తికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆ మహిళ తెలిపింది. పెళ్లైయిన కొన్ని నెలలు తర్వాత ఆమె తన భర్త ఇంటి నుంచి పారిపోయి తన సోదరుడి సహాయంతో మహారాష్ట్రకు వచ్చి ఖడావ్లీలో నివసిస్తుంది. కొన్ని రోజుల తర్వాత తాను గర్భవతినని తెలుసుకుంది. ఐతే ఆమె మరొ పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె ఉల్హాసనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ మహిళ తన సోదరుడి సాయంతో ఆ బిడ్డను మెరైన్ డ్రైవ్‌కు సమీపంలోని డస్ట్‌బిన్ దగ్గర శిశువును వదిలి వెళ్లిపోయారు. పైగా ఆ బిడ్డను డబ్బున్న కుటుంబం దత్తత తీసుకుంటుందని భావించాం అని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు మెరైన్ డ్రైవ్ పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా సదరు మహిళను గుర్తించినట్లు వెల్లడించారు. (చదవండి: రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి..) -
హృదయ విదారకం: చెత్తకుప్పలో చిన్నారి మృతదేహం
తల్లి గర్భం నుంచి బయట పడి ప్రపంచాన్ని చూసిందో లేదో.. చెత్తకుప్పకు చేరి విగత జీవిగా మారిందో పసికందు. అప్పుడే పుట్టిన పాపాయికి.. అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయి. మరి ఏ పాపం తెలియని ఆ పసికూనకు అంత పెద్ద శిక్ష ఎవరు విధించారో.. ఈ లోకాన్ని చూడక ముందే కన్నుమూసింది. సాక్షి, హైదరాబాద్: రాజేంద్ర నగర్‌లోని రాంబాగ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అప్పడే పట్టిన ఓ పసికందు మృతదేహం చెత్త కుప్పలో దర్శనమిచ్చింది. మంగళవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తొలగించేందుకు రాగా చెత్తకుప్పల పక్కనే ఉన్న మూటలో చిన్నారి మృతదేహం ఉండడాన్ని గమనించారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిన్నారిని మృతదేహాన్ని ఎవరు పడేశారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. శిశువుని చంపి మూటలో కట్టి చెత్త కుప్పలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: Extra Marital Affair: వాటర్‌మెన్‌తో పరిచయం, భర్తతో కలిసి ఉండలేక.. -
సఫాయి అన్న.. నీకు సలాం అన్న
సాక్షి, సనత్‌నగర్(హైదరాబాద్): సఫాయి అన్న.. నీకు సలాం అన్న.. అంటూ వారి సేవలను గుర్తించి మూడుసార్లు వేతనాలు పెంచిన మొదటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాత్రమేనని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. డ్రైవర్స్ కమ్ ఓనర్ స్కీం కింద సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ సెంటర్ కేంద్రంగా నగర వ్యాప్తంగా 1,350 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సోమవారం మంత్రులు ప్రారంభించారు. వీరిలో మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌లతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం 250 మంది లబ్ధిదారులకు స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బెస్ట్ సిటీగా హైదరాబాద్.. ► గతంలో 2015లో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా 2,500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను ఏకకాలంలో తీసుకువచ్చామని గుర్తుచేశారు. దేశంలో స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ బెస్ట్ సిటీగా నిలిచిందన్నారు. ► ఎప్పటికప్పుడు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తెల్లవారుజామున 3– 4 గంటల నుంచే పరిశ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు, ఇతర వాహనాల సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టకముందు నగరం నుంచి ప్రతిరోజూ 3,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేదన్నారు. వీటిని ప్రవేశపెట్టిన తర్వాత 6,500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతోందన్నారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్లాంట్.. ► వాహనాల ద్వారా సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తను వేరు చేసి విద్యుత్పాదనకు జవహర్‌నగర్‌లో 20 మెగావాట్ల ప్లాంట్‌ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మరో 28 మెగావాట్ల ప్లాంట్‌కు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయన్నారు. దాని పనులు కూడా ప్రారంభమై పూర్తి చేసుకుంటే మొత్తం 48 మెగావాట్లతో దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా నగరం నిలవనున్నదన్నారు. కార్పొరేటర్లు, అధికారులు తమ పరిధిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి మెరుగైన పారిశుద్ధ్యం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సంతోష్, ప్రియాంక అలా, జోనల్ కమిషనర్ రవికిరణ్, జాయింట్ కమిషనర్ సంధ్య, కార్పొరేటర్లు కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, మహేశ్వరి శ్రీహరి, డీఎంసీ వంశీకృష్ణ, ఏఎంహెచ్ఓ భార్గవ నారాయణ్, మహీంద్రా కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పసికందు ఏం నేరం చేసిందని..?
నరసన్నపేట: ఆ లేలేత కళ్లతో తల్లిని చూసిందో లేదో..? ఆ చిట్టి చేతులతో తండ్రిని తాకిందో లేదో..? పుట్టాక చనుబాలైనా తాగిందో లేదో..? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి తుప్పల్లోకి చేరిందో పసిపాప. అప్పుడే పుట్టింది కదా.. అమ్మను విసిగించి ఉండదు. తొమ్మిది నెలలు గర్భంలోనే ఉంది కదా.. నాన్న మనసు కష్టపెట్టే ప్రసక్తే లేదు. అసలు తాను ఆడపిల్లనని కూడా తనకు తెలిసి ఉండదు. మరేం నేరం చేసిందని.. పాపకు ఇంత శిక్ష విధించారు ఆ తల్లిదండ్రులు...? నరసన్నపేట–జలుమూరు మండలాల బోర్డర్ కంబకాయ సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు పక్కన బుధవారం ఓ పసిపాప తుప్పల్లో స్థానికులకు దొరికింది. వివరాల్లోకి వెళితే.. కంబకాయ రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం స్థానికులు సూర్యనారాయణ, బసివాడకు చెందిన యూత్ స్టార్ సభ్యులు సాయిమణికంఠ, తేజ, కృష్ణలు రన్నింగ్ చేస్తుండగా రోడ్డు పక్క నుంచి ఓ పసి బిడ్డ ఏడుపు వినిపించింది. దగ్గరకు వెళ్లి పరిశీలిస్తే అప్పుడే పుట్టిన ఆడ శిశువు రక్త కారుతూ కనిపించింది. వెంటనే వారు బిడ్డను బయటకు తీసి అదే రోడ్డుపై వెళ్తున్న మహిళల సాయంతో సపర్యలు చేశారు. వేకువజామున ఎవరో వదిలి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. శిశువుకు సపర్యలు చేశాక వెంటనే ఆటోలో నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు. సకాలంలో స్పందించిన ఆస్పత్రి సిబ్బంది ఆ శిశువుకు సపర్యలు చేశారు. సమాచారం అందుకున్న నరసన్నపేట ఎస్ఐ వి.సత్యనారాయణ, చైల్డ్‌లైన్ ప్రతినిధులు వచ్చి బిడ్డను పరిశీలించారు. ఊపిరి పీల్చుకోవడంలో కొంత ఇబ్బంది పడుతుండటంతో మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు 108 సిబ్బంది బాలరాజు తెలిపారు. -
కాకి స్వచ్ఛ్ భారత్ : నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: ఓ కుండలో అడుగున ఉన్న నీటిని గులకరాళ్ల సాయంతో పైకి తీసుకొచ్చిన కాకి ఎంత తెలివైన జీవో మనం చాలా చిన్నపుడే తెలుసుకున్నాం. ఎంత విసుక్కున్నా..విసిరి కొట్టినా. ఒడుపుగా ఆహారాన్ని అందిపుచ్చుని కవ్విస్తూనే ఉంటుంది. అంతేకాదు తెలివైనదాన్నే కాదు.. నేను చాలా స్మార్ట్ అని నిరూపించు కున్న సందర్భాలు కూడా కోకొల్లలు. తాజాగా సామాజిక బాధ్యతను మరిచి ప్రవర్తించే మానవ జాతి సిగ్గు పడేలా చేసిందో కాకి. తాను సామాజిక జీవినని మరోసారి నిరూపించుకుని అందర్నీ ఫిదా చేస్తోంది. డస్ట్‌బిన్ పక్కనే ఉన్నా.. దాన్ని వినియోగించుకోకుండా పక్కన పారేసిన చెత్తను ఒక్కొక్కటిగా తన ముక్కుతో తీసుకొని డస్ట్‌బిన్‌లో వేసిన వైనం ఔరా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు చెందిన సుశాంత నందా 38 సెకన్ల క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఖాళీ డబ్బాలు, చెత్త పేపర్ ఇలా ఒక్కొక్కదాన్ని చాలా స్మార్ట్‌గా ఏరి డస్ట్‌బిన్‌లో వేసి మరీ ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తీరు నెటిజనులను ఆకట్టుకుంటోంది. మనుషులు సిగ్గు అనే విషయాన్ని మర్చిపోయారని కాకికి తెలుసు అనే క్యాప్షన్‌తో సుశాంత పోస్ట్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేయడమే కాదు.. వేగంగా వైరల్ అవుతోంది. సుమారు 2 వేలకు పైగా లైక్‌లను 14వేల వ్యూస్‌తో దూసుకుపోతోంది. కాకి తెలివికి కొంతమంది అబ్బుర పడుతున్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను ఈ చిన్న జీవి సైతం అర్థం చేసుకుంది. ఇకనైనా సిగ్గు తెచ్చుకుని.. బాధ్యతగా పవర్తిద్దాం అనే సందేశాల వెల్లువ కురుస్తోంది. This crow knows that humans have lost the sense of shame pic.twitter.com/9ULY7qH4T2 — Susanta Nanda IFS (@susantananda3) April 1, 2021 -
వైరల్ : ఈ డస్ట్ బిన్‌కు ఏమైందబ్బా!
కొన్ని కొన్ని వీడియోలు చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగడంతో పాటు వాటికి మన జీవితంతో సంబంధం ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. వాటిని చూసిన వెంటనే మనకి కామెంట్ చేయాలనో, లైక్ కొట్టాలనో అనిపిస్తుంది. అలాంటి ఒక వీడియోని ఇప్పుడు చూడండి. వర్షంలో ఒక బ్లూ కలర్లో ఉన్న డస్ట్‌బిన్ చాలా దూరం తేలుతూ వెళ్లింది. 28 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ‘ఐయామ్మేరికిర్క్’ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మరో వడగళ్లు? ఈ బ్లూ బిన్ను చూస్తుంటే నాకు ఏం వద్దు, బై, అని వెళుతున్నట్లు ఉంది. మిగిలిన ఏడాదికి గుడ్‌లక్’ అనే శీర్షికను జోడించింది. చదవండి: అనుకోని అతిధి రాకతో అద్భుతం.. ఈ వీడియోను ఇప్పటి వరకు 3.2 లక్షల మంది వీక్షించగా, 9,300 లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ డస్ట్ బిన్ నాదే అంటూ చాలా మంది కామెంట్ చేశారు. డస్ట్ బిన్ నీటిలో వెళుతున్న మరో వీడియోను షేర్ చేసిన ఒక నెటిజన్ ‘ఇది ట్రెండ్’ అంటూ కామెంట్ చేశారు. కొంత మంది ఈ వీడియోను సినిమాలోని పాత్రలతో పోలుస్తూ వాటిని షేర్ చేస్తున్నారు. చదవండి: క్వారంటైన్ సెంటర్లో డ్యాన్సులేస్తూ చిందులు -
నీటిలో తేలియాడుతున్న డస్ట్ బిన్
-
చెత్తకుప్పలో 10 సంచుల ఉత్తరాలు
సాక్షి, హైదరాబాద్ : నమ్మకంగా ఉత్తరాలను బట్వాడా చేయాల్సిన పోస్టల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆప్తులకు, అభ్యుర్థులకు చేరాల్సిన ఉత్తరాలను చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు. కీసరలోని బండ్లగూడ సమీపంలో ఉన్న ప్రజాసాయి గార్డెన్స్ గేట్ పక్కన వేలకొద్దీ ఉత్తరాలు చెత్తకుండీలో లభ్యమయ్యాయి. 10 సంచుల్లో ఉన్న లెటర్స్‌ను రాజిరెడ్డి అనే వ్యక్తి ముందుగా గుర్తించాడు. ఆయన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అధికారులు కోరినట్లు తెలుస్తోంది. ఉత్తరాల్లో ఎక్కువ భాగం కూకట్పల్లి, షాద్‌నగర్, బాలానగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల అడ్రస్‌లతో ఉండటం గమనార్హం. ఎవరైనా కావాలని చేశారా, డ్యూటీ చేయలేక పోస్టల్ సిబ్బందే నిర్లక్ష్యంతో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. లెటర్స్‌ను బట్వాడా చేయకపోవంతో కొందరు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని సీఐ నరేందర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. -
కైపులో.. రాత్రంతా చెత్తకుండీలో
మైసూరు: మద్యం మత్తులో చెత్తకుండీలో పడిపోయి రాత్రంతా అందులోని పడుకున్న వ్యక్తిని బుధవారం పారిశుధ్య కార్మికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. డీడి మొహల్లాలోని ఓ చెత్తకుండీని లారీలో ఎక్కించడానికి కార్మికులు ప్రయత్నిస్తున్న సమయంలో చెత్తకుండీలో నుంచి వ్యక్తి కాలు బయటకు రావడాన్ని చూసి భయపడ్డారు. నిదానంగా చెత్తను మొత్తం తొలగించి చూడగా అందులో వ్యక్తి అచేతనంగా పడి ఉన్నాడు. ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. మద్యం కైపులో అతడు చెత్తకుండీ లోపలికి పడిపోయాడు. జనం అలాగే చెత్త వేశారు. ఎలాగో ఊపిరి ఆడడంతో ప్రాణాలు మిగిలే ఉన్నాయి. -
'మస్ట్'బిన్ లేకుంటే జరిమానాల దరువు
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో పారిశుధ్య కార్యక్రమాల అమలుకు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, కోట్ల రూపాయలతో రెండు రంగుల చెత్తడబ్బాలు పంపిణీ చేసినా తగిన ఫలితం కనిపించలేదు. దీంతో జీహెచ్ంఎసీ స్వచ్ఛ నిబంధనలు ఉల్లంఘించేవారిపై జరిమానాల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగా 50 మైక్రాన్ల కన్నా తక్కువ ప్లాస్టిక్స్ బ్యాగులు వాడుతున్న వ్యాపారులపైనా, రోడ్లు, నాలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తున్నవారిపైనా, రోడ్లపై చెత్త వేస్తున్నవారితో పాటు శుభ్రం చేసిన ప్రాంతాల్లో ఉమ్మి వేయడం వంటి పనులకుపాల్పడుతున్నవారిపై సైతం జరిమానాలు విధిస్తోంది. అలాగైనా ప్రజల్లో మార్పు వస్తుందని జీహెచ్ఎంసీ భావిస్తోంది. గత మూడు, నాలుగేళ్లుగా పారిశుధ్యంపై ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా చెప్పుకోదగ్గ ఫలితం కనిపించక పోవడంతో ఇక జరిమానాలతోనైనా మారగలరని భావించి ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఉన్నతాధికారులు సర్కిళ్ల వారీగా టార్గెట్లు విధించి మరీ జరిమానాలు వేస్తున్నారు. తాజాగా బుధవారం ఒక్కరోజే వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 120 మంది నుంచి రూ.96,100 జరిమానాగా వసూలు చేశారు. గత మూడు వారాల్లో 3,878 మందిపై జరిమానాలు విధించి వారి నుంచి రూ.55.57 లక్షలు వసూలు చేశారు. జరిమానాల విధింపు వల్ల ప్రజల వైఖరి మారుతుందనే తప్ప, జీహెచ్ఎంసీ ఆదాయం కోసం మాత్రం కాదని కమిషనర్ దానకిశోర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా రోడ్లపై చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేస్తున్నవారితో పాటు 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ వినియోగిస్తున్న దుకాణదారులపై ఎక్కువ దృష్టి సారించారు. అవగాహనకు స్పెషల్ డ్రైవ్ జరిమానాల విధింపుతో పాటు చిరువ్యాపారులు 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లు వాడకుండా, తప్పనిసరిగా డస్ట్బిన్లు వాడాల్సిందిగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రధాన రహదారుల్లో దాదాపు 30 వేల మంది చిరువ్యాపారాలు చేసుకుంటున్నట్లు గుర్తించారు. వీరికి అవగాహన కల్పిస్తున్నారు. తమ హెచ్చరికలు, జరిమానాలతో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోందని అధికారులు పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలైన చార్మినార్, గోల్కొండ కోటల్లో సైతం వ్యర్థాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. -
రోడ్లపై చెత్త పడేస్తే శిక్షార్హులు
గార్డెన్ సిటీ గార్బేజ్ సిటీగా మారుతుండడంతో హైకోర్టు కొరడా ఝలిపించింది. చెత్త సమస్యను మీరు పరిష్కరిస్తారా?, మేం రంగంలోకి దిగాలా? అని అక్షింతలు వేయడంతో నగర పాలికెలో చలనమొచ్చింది. నగరంలో ఎక్కడంటే అక్కడ చెత్త పడేసేవారిపై నిఘా వేసి జరిమానాలు విధిస్తోంది. నెలరోజుల్లోనే భారీగా పట్టుబడడంతో సత్ఫలితాలను ఇస్తున్నట్లే ఉంది. కర్ణాటక , బనశంకరి: ఉద్యాననగరిలో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేస్తే చుట్టుపక్కల ప్రజలు ఏమీ అనలేకపోవచ్చు. కానీ బీబీఎంపీ నియమించిన మార్షల్స్ మాత్రం చూస్తూ ఉరుకోరు. అలా చెత్త పడేసేవారిపై ఒక నెల వ్యవధిలో 2,965 కేసులు నమోదు చేశారు. చెత్త నిర్వహణ లోపాలపై హైకోర్టు బీబీఎంపీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో పాలికె మేలుకుంది. సుమారు 40 మంది మార్షల్స్ ను నియమించడంతో రాత్రి సమయాల్లో గస్తీ తిరుగుతున్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త పడేసే వారిని గుర్తించి 2,965 కేసులు నమోదు చేసి అక్కడే వారిపై జరిమానా విధించారు. చెత్త వాహనాల్లో వేయరెందుకు రోజూ ఉదయం వేళ ఇళ్ల వద్దకు వచ్చే పాలికె చెత్త వాహనాల్లో చెత్త వేయడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదు. అంతేగాక చెత్త వాహనం కోసం వేచిచూడటం కంటే రాత్రి సమయంలో రోడ్లపై, డ్రైనేజీల్లో చెత్త బ్యాగ్‌లు పడేయడం సులభమని ఎక్కువమంది భావిస్తున్నారు. కానీ బీబీఎంపీ నియమించిన మార్షల్ అలాంటివారు కనిపిస్తే జరిమానా విధిస్తారు. మార్షల్స్‌కు పట్టుబడిన వారు ఇకపై రోడ్లపై చెత్త వేయబోమని అంటున్నారు. ఒక నెల అవధిలో ఇంత మొత్తంలో కేసులు నమోదు కావడం విశేషం. ఎవరెవరు దొరికారు బీబీఎంపీ మార్షల్స్ ఆచూకీ కనిపెట్టిన 2,965 కేసుల్లో 1,023 మంది బైక్‌లు, స్కూటర్లలో చెత్త తీసుకువచ్చి పడేసి వెళ్లేవారు. 128 మంది ఆటోరిక్షాల్లో , 71 మంది వివిధ మోటారు వాహనాల్లో , 22 మంది ట్రక్కుల్లో, 33 మంది ట్రాక్టర్లులో, 1,688 మంది నడచి వెళ్లి చెత్తపడేసినిట్లు తేలింది. చిన్నపాటి బ్యాగుల్లో మాత్రమే కాకుండా ట్రాక్టర్లు, ట్రక్కుల్లో తెచ్చి అక్రమంగా చెత్త పడేస్తుండటంతో నగరంలో ఎటుచూసినా చెత్త రాశులు కనిపిస్తున్నాయి. మార్షల్స్ సంఖ్య పెంచాలి బెంగళూరులో కేవలం 40 మంది మార్షల్స్‌తో చెత్త వేసే వారిని అడ్డుకట్టవేయడం కుదరదని, ఇంకా 240 మంది మార్షల్స్ నియమించుకోవడానికి నిధులు అందించాలని బీబీఎంపీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. ప్రతి మార్షల్‌కు నెలకు రూ.18,525, మరో 8 మంది జూనియర్ అధికారులకు రూ.40 వేల చొప్పున వేతనం అందిస్తున్నారు. వీటిన్నింటిని కలిపితే ఏడాదికి రూ.8.48 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. చెత్త పడేసివెళ్లే వారిపై జరిమానా రూపంలో వసూలు చేసిన దానిలో మార్షల్స్ కు 5 శాతం ప్రోత్సాహక ధనం అందించాలని తీర్మానించారు. జరిమానాలు పెంపు? ♦ ప్రస్తుతం చెత్త పడేస్తున్న వారిపై కనీసం రూ.500 జరిమానా విధిస్తున్నారు. జరిమానా పెంచితే సమస్య తగ్గుముఖం పడుతుందని బీబీఎంపీ అభిప్రాయపడింది. ♦ చెత్త పడేసే వారిపై రూ.1,000 నుంచి రూ.25 వేలు వరకు జరిమానా విధించాలని బీబీఎంపీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ♦ ఇక బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేస్తే రూ.500, తడి–పొడి చెత్త విభజన చేయనివారిపై రూ.1,000, కట్టడ శిథిలాలు పడేసేవారిపై రూ.25 వేలు చొప్పున జరిమానా విధించడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి బీబీఎంపీ కోరింది. -
చెత్తను పడేద్దామనుకుంటే.. భారీ జరిమానా వేశారు..!
లండన్: ఓ వైపు అంతెత్తున పేరుకుపోతున్న చెత్తను పునర్వినియోగంలోకి తెచ్చి దేశాన్ని స్వచ్ఛంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ కంటున్న కలలు ఏమేరకు సఫలమవుతాయోగానీ.. విదేశాల్లో మాత్రం స్వచ్ఛత విషయంలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకే భారీ జరిమానాలు విధించడంతో అక్కడి జనం బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఈశాన్య లండన్‌లోని చింగ్ఫోర్డ్లో అనుమతి లేకుండా చెత్తను తీసుకెళ్తున్నాడని ఓ వ్యక్తికి అటవీ శాఖ అధికారులు భారీ జరిమానా విధించారు. వివరాలు.. స్టివార్ట్ గాస్లింగ్ (43) గురువారం తన కారులో వెళ్తున్నాడు. ప్రయాణ సమయంలో అప్పటికే తాను వినియోగించిన స్నాక్స్, శాండ్విచ్ వ్యర్థాలు, వాటర్ బాటిల్స్‌ను డస్ట్‌బిన్‌లో వేద్దామని ఒక ప్లాస్టిక్ బ్యాగులో వేసి కారు వెనకాల పెట్టాడు. స్వస్థలానికి వెళ్లాక పడేద్దామనుకున్నాడు. అదే అతని జేబుకు చిల్లు పడేలా చేసింది. వాల్థాం ఫారెస్ట్ కౌన్సిల్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అతను దొరికిపోయాడు. అనుమతి లేకుండా చెత్తను తీసుకెళ్లడం నేరమంటూ గాస్లింగ్కు 27 వేల రూపాయల జరిమానా విధించారు. అందుబాటులో ఉన్న డస్ట్బిన్లను గమనించకుండా ఫైన్ కట్టిన గాస్లింగ్ ఊహించని షాక్‌తో బిత్తరపోయాడు. -
చెత్త కుప్పలో చిన్నారి
-
ఆ..డ పిల్ల
గర్భాన తొమ్మిది నెలలు మోసిన ఆ తల్లికి వచ్చిన కష్టమేమో కానీ.. ఓ పురిటి బిడ్డ చెత్తకుప్ప పాలయైంది. ఇదంతా కన్నపేగుకు తెలిసి జరిగిందా? లేక ఆమె అనుమతితోనే కుటుంబసభ్యులు ఇంతటి నిర్ధయకు ఒడిగట్టారా అనేది ప్రశ్నార్థకమైంది. వివరాల్లోకి వెళితే.. ఉరవకొండలోని ఇందిరానగర్ ఆరవ లైన్.. గురువారం తెల్లవారుజామున... స్థానికంగా ఉంటున్న కళావతి తన ఇంటిలోని చెత్తను తీసుకెళ్లి సమీపంలోని చెత్త కుప్పలో పడేసి వెనుదిరిగింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి అదె చెత్త కుప్పలో ఓ పసికందును పడేసి వెళ్లాడు. ఇది గమనించిన కళావతి పిలిచే లోపు అతను వెళ్లిపోయాడు. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడ గుమికూడి చూస్తే.. పురుటి నెత్తుటిని సైతం తుడవని ఓ ఆడశిశువు చెత్త కుప్పలో కనిపించింది. కాలనీ వాసులు ఆ పసికందును చేరదీసి సమాచారం అందించడంతో ఎస్ఐ సురేష్‌బాబు అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేశారు. పసిగుడ్డను స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. పసికందును అనంతపురంలోని బాలభవన్‌కు తరలించనున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ రాబియా తెలిపారు. - ఉరవకొండ -
కలంకం!
కడుపు పండితే.. ఆ ఇంట్లో ఆనందాల పంట నెలలు నిండుతుంటే.. కలల లోకంలో విహారం వెన్ను విరిగే బరువు.. ఆమెకు గాలి పిందె కడుపున బిడ్డ కదిలితే.. ఆ కళ్లలో ముసిముసి నవ్వు తొలుచూరు కాన్పయితే.. ఇక పండగే పుట్టినిల్లు.. మెట్టినిల్లు ఒక్కటయ్యే వేడుక ఆ సంబరం.. విషాదమైతే! బిడ్డ కడుపులోనే కన్నుమూస్తే.. వదిలించుకుంటారా ఆ పసిగుడ్డు భారమవుతుందా? పుట్టుక సంబరమైతే.. ‘చావు’ను సాగనంపలేరా.. తొమ్మిది నెలల కల.. మానవత్వం చూపించదేలా.. ఒక్క క్షణం.. ఆలోచించండి. ఆ ప్రేమ అజరామరం.. ఎందుకీ శాపం! అనంతపురం సెంట్రల్: మృత శిశువు ఆ తల్లిదండ్రులకు భారమైంది. పేగు బంధం మరిచి చెత్తకుప్పలో పడేశారు. చిన్నపాటి కవర్లో చుట్టి వదిలించుకున్నారు. వీధి కుక్కలు సగభాగం తినేయగా.. మానవత్వం మౌనంగా రోదించింది. ఈ ఘటన శుక్రవారం నగరంలోని మారుతీనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని మున్సిపల్ చెత్తకుప్ప వద్ద శుక్రవారం ఉదయం కొన్ని కుక్కలు ఓ కవర్లోని మాంసం ముద్ద చుట్టూ గుమికూడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అప్పుడే పుట్టిన.. రక్తపు మరకలు కూడా ఆరని మృత శిశువును చూసి నివ్వెరపోయారు. వెంటనే కుక్కలను పక్కకు తోలి.. పోలీసు, మున్సిపల్ అధికారులకు సమాచారం చేరవేశారు. ఈ కాలనీలో ఆసుపత్రులు లేకపోవడంతో.. మృత శిశువును తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే.. కడుపులోనే చనిపోయినా, మృత శిశువు జన్మించినా.. ఖననం చేయడం కనీస ధర్మం. అలాంటిది.. కర్కశంగా చెత్తకుప్పలో పడేసి వెళ్లిన తీరుతో సభ్య సమాజం మౌనంగా రోదించింది. చివరకు మున్సిపల్ అధికారులు ఆ మృత శిశువును స్వాధీనం చేసుకుని ‘చివరి’ మజిలీ పూర్తి చేశారు. ఇదిలాఉంటే.. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా వైద్య, ఆరోగ్య శాఖ.. పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం ప్రయివేట్ ఆసుపత్రులైనా సామాజిక బాధ్యతగా మృత శిశువుల ఖననానికి ముందుకు రాకపోవడం పట్ల సభ్య సమాజం తలదించుకుంటోంది. -
చెత్త కుప్ప నుంచి శిశు గృహానికి...
ఖమ్మం: మే 18వ తేదీ. ఉదయ పది గంటలు. నగరంలోని ఎన్ఎస్టీ రోడ్డులోగల ఆర్ఎస్ మెడికల్ షాపు వద్ద చెత్త కుప్ప. అందులో ఓ పసికందు (మగ). పుట్టిన వెంటనే తీసుకొచ్చి పడేసినట్టుగా ఒంటిపై రక్తపు చారికలు. ఆ పసికందు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఒంటి నిండా చీమలు. అటుగా వెళుతున్న అనేకమంది చూస్తున్నారు. కొద్దిసేపటి తరువాత ఒకరు ముందుకొచ్చారు. చేతుల్లోకి తీసుకుని, చీమలన్నిటిని దులిపేసి, జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. డ్యూటీ డాక్టర్లు వెంకటేశ్వర్లు, శారద వెంటనే స్పందించారు. అత్యవసర వైద్యం అందించారు. అప్పుడు ఆ శిశువు బరువు ఒక కేజీ 400 గ్రాములు. జూలై 6వ తేదీ. థ్యాంక్ గాడ్! ఆ పసికందు క్షేమంగా ఉన్నాడు. చెత్తకుప్పల దుర్వాసనను, చీమల దాడిని తట్టుకుని బతికాడు..! కాదు.. కాదు.. వైద్య నారాయణులు కంటికి రెప్పలా చూసుకుంటూ బతికించారు. ఆ శిశువు ఇప్పుడు రెండున్నర కేజీలకు పెరిగాడు. ఐసీడీఎస్ పీడీ వరలక్ష్మి, ఆ శిశువును ఆస్పత్రి నుంచి శిశుగృహకు అప్పగించారు. ‘బిడ్డా.. నువ్వు చల్లగా బతకాలి!’ అంటూ, ఆ ఆస్పత్రి వైద్యులు తమ మనసులోనే మౌనంగా దీవించి పంపించారు..!! -
ముళ్లకంపలో ఆడ శివువు మృతదేహం
హిందూపురం అర్బన్ : హిందూపురం ఆర్టీసీ డిపో సమీపంలోని ముళ్లకంపల్లో ఓ ఆడ శిశువు మృతదేహౠన్ని పోలీసులు శనివారం కనుగొన్నారు. వారి కథనం మేరకు... స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఈ నెల ఒకటిన జన్మించినట్లు శిశువు చేతికి ఆస్పత్రి వైద్యులు వేసిన ట్యాగ్ అలాగే ఉంది. ఆడపిల్లను భారమనుకున్నారో, ఏమో గానీ ఆస్పత్రి నుంచి డిచార్జి కాగానే అదే బ్యాగులో ఉంచి శిశువు మృతదేహాన్ని పడేశారో తెలియరాలేదు. ఉదయం ఆటుగా వెళ్లిన ఆటో డ్రైవర్ కంట బ్యాగును కుక్కలు లాగుతుండడం గమనించారు. వెంటనే ముస్లిం నగర ప్రతినిధఙ ఉమర్ఫరూక్కు తెలిపారు. ఆయన వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత అక్కడికి వెళ్లి బ్యాగును చూస్తే ఆడ శిశువు మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారి చేతికి కట్టి ఉన్న ఆస్పత్రి ట్యాగ్ ద్వారా ఆస్పత్రిలో విచారణ చేసి తల్లిదండ్రుల అడ్రసు కనుగొన్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. సాయంత్రానికి సోమందేపల్లి మండలం నల్లగొండపల్లికి చెందిన జయమ్మ, జయరాం గా గుర్తించి పిలిపించారు. జయరాం మొదటి భార్య చనిపోగా, అప్పటికే ఆమెకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. దీంతో జయరాం రెండోపెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మూడుసార్లు ఆబ్రార్షన్లు అయ్యాయి. నాల్గవసారి పుట్టిన ఆడపిల్ల శుక్రవారం రాత్రి చనిపోవడంతో, తన బావమ్మర్ది ఈశ్వర్‌కు శిశువును అప్పగించడంతో అతను పూడ్చకుండా పడేశాడని వారు తెలిపారు. ప్రజాసంఘాల నాయకులు ఉదయ్‌కుమార్, ఉమర్‌ఫరూక్ మరికొందరు కలసి సంప్రదాయంగా ఖననం చేశారు. -
మానవత్వం మరచి..
– అట్టపెట్టలో మృతశిశువును వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు – పోలీసుల సహకారంతో అంత్యక్రియలు అనంతపురం సెంట్రల్ : మానవత్వం మరచి నాలుగు రోజుల కిందట జన్మించిన ఆడశిశువు అనారోగ్యంతో మృతి చెందితే కనీసం ఖననం కూడా చేయకుండానే ఓ అట్టపెట్టెలో మృతదేహాన్ని పెట్టి మురుగునీటి కాలువ పక్కన వదిలేసి వెళ్లిన ఉదంతమిది. అనంతపురం రామ్‌నగర్ రైల్వే వంతెన సమీపంలో గురువారం ఉదయం జరిగిన ఘటనకు సంబంధించి నాల్గో పట్టణ ఎస్ఐ శ్రీరామ్ కథనం మేరకు.. ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ దంపతులు నాలుగు రోజుల కిందట అనంతపురం పెద్దాస్పత్రిలో చేరారు. కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స తీసుకున్నారు. అయితే పరిస్థితి విషమించి పసికందు మృతి చెందింది. పేదరికంతో ఆ తల్లిదండ్రులు మృతశిశువును ఖననం చేయకుండానే అట్టపెట్టెలో పెట్టి వదిలేసి వెళ్లిపోయారు. మృతశిశువును స్వాదీనం చేసుకుని సంజీవని రక్తదాతల సంస్థ నిర్వాహకుడు రమణారెడ్డి సహకారంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఘటనకు కారణమైన దంపతులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్ఐ వారిని తీవ్రంగా మందలించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
చెత్తకుండీలో పాత కరెన్సీ నోట్లు
మంత్రాలయం: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 1000, రూ. 500 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే గడువు ముగిసిన నేపథ్యంలో వాటిని దాచుకున్న కొందరు చెత్తకుండీల పాల్జేస్తున్నారు. గురువారం మంత్రాలయం ఆర్అండ్బీ ప్రహరీ సమీపంలోని ఓ చెత్త కుండీలో 8 వెయ్యి నోట్లు, మరో 8 రూ.500 నోట్లు దర్శనమిచ్చాయి. వీధులను శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది వాటిని గమనించి సమాచారం ఇవ్వగా ఎస్ఐ శ్రీనివాసనాయక్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. -
చెత్తకుప్పలో పసికందు మృతదేహం
కర్నూలు: జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుండీలో పడేసి వెళ్లారు. దీంతో చిన్నారి(ఆడపిల్ల) మృతి చెందింది. జూపాడుబంగ్లా మండలం తర్తురు గ్రామ శివారులోని చెత్తకుప్పలో పసికందు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పసిబిడ్డను చెత్తకుప్పలో వదిలేసిన తల్లి
-
అయ్యో‘పాప’ం
- పసిబిడ్డను చెత్తకుప్పలో వదిలేసిన తల్లి - చేరదీసిన ఆటో డ్రైవర్ - నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స నంద్యాల: నెలలు నిండకముందే పుట్టిన బిడ్డను ఓ తల్లి చెత్తకుప్పపాలు చేసింది. గమనించిన ఆటోడ్రైవర్..ఆ పసిపాపను కాపాడి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మెడికేర్ ఆసుపత్రి వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..పాణ్యం మండలం కొణిదేడు గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, ఆమె భర్త వెంకట్వేర్లు మెడికేర్ ఆసుపత్రికి వచ్చారు. కడుపునొప్పి అధికంగా ఉందని లక్ష్మిదేవికి చెప్పడంతో వైద్య సిబ్బంది స్కానింగ్ చేసి గర్భిణిగా నిర్ధారించారు. కాని ఆమెకు ప్రసవ వేదన ప్రారంభం కావడంతో ఆసుపత్రి చివరలో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఏడు నెలలలోనే ఆడపిల్ల పుట్టడంతో ఆ తల్లి ప్రహరీ పక్కనే ఉన్న చెత్తకుప్పలో వేసి వెళ్లింది. అక్కడే ఉన్న నందమూరినగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ శ్రీనివాసులు గమనించి.. బిడ్డను పందుల బారిన పడకుండా కాపాడాడు. మెడికేర్ ఆసుపత్రిలో పసిబిడ్డను అప్పగించగా వారు ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ ఏంజిల్‌కు సమాచారాన్ని అందించారు. ఐసీడీఎస్ అర్బన్ సీడీపీవో ఏంజల్ పసికందును ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స చేసిన అనంతరం చిన్నారి కోలుకుంది. బరువు ఒకటిన్నర కేజీ ఉన్నందున కోలుకుందని, మెడికేర్ ఆసుపత్రిలో సీసీ కెమెరాల పుటేజ్ ద్వారా తల్లిదండ్రులను గుర్తించి కేసు నమోదు చేయిస్తామని సీడీపీవో తెలిపారు. -
చెత్తకుప్పలో శిశువు మృతదేహం
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేశారు. ఈ సంఘటన వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం జరిగింది. పందులు, కుక్కలు పసికందు శవాన్ని పీక్కు తింటుంటే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెత్త నిండగానే జీహెచ్ఎంసీకి సమాచారం
బాలానగర్: బాలానగర్‌లోని కేంద్రీయ పరికరాల రూపకల్పన సంస్థ (సీఐటీడీ– సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్) ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డైరెక్టర్ సుజాయత్ ఖాన్, లెఫ్టినెంట్ కర్నల్ రవి చౌధురి, డైరెక్టర్ పవిత్ర కుమార్ ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ జి. సనత్‌కుమార్ మార్గదర్శకత్వంలో ఓ నలుగురు శాస్త్రవేత్తలు ‘ఇంటెలిజెంట్ డస్ట్‌బిన్’ను రూపొందించారు. ప్రస్తుతం ఈ డస్ట్‌బిన్‌ను ట్రైల్ రన్లో ఉంచారు. ప్రస్తుతం పేపర్ వేస్టేజ్ ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో, కార్పొరేట్ ఆఫీసుల్లో పెట్టి పరిశీలిస్తున్నారు. ఆ డస్ట్‌బిన్‌లో వాటర్ బాటిల్స్, టీ కప్స్, వేస్ట్ పేపర్ అటువంటివి అయితే డస్ట్‌బిన్ నిండడానికి ఎక్కువ రోజులు పడుతుంది. అదే మన ఇంట్లో అయితే నలుగురు సభ్యులు ఉన్న వారికి మూడు రోజుల నుంచి అయిదు రోజుల్లో నిండిపోతుంది. నలుగురు డిజైన్ ఇంజినీర్లు పి.కె. విష్ణు, అనుపమ జాజు, సుందరగిరి శ్రీనివాస్, మదన్మోహన్ కులకర్ణి నెలరోజులు శ్రమించి ఈ ఇంటెలిజెంట్ డస్ట్‌బిన్‌ను తయారు చేశారు. -
సమస్యల అశోక్‌నగర్
రోడ్లపై వెళ్తే నడుంనొప్పి ఫ్రీ నిండిపోతున్న చెత్త కుండీలు చోద్యంచూస్తున్న అధికారులు కరీంనగర్ కార్పొరేషన్ : అధ్వానంగా రోడ్లు.. నిండిపోయిన చెత్తకుండీలు..కంపుకొడుతున్న ఖాళీస్థలాలతో అశోక్‌నగర్ సమస్యలకు నిలయంగా మారింది. రోడ్లపై గుంతలుపడి నడిచేందుకు వీలులేకుండా తయారయ్యాయి. ట్రాన్స్‌పోర్టు కంపెనీల అడ్డాలు సైతం ఇక్కడే ఉండడంతో రహదారులు మరింత అధ్వానంగా మారుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకునే వారు కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9వ డివిజన్ అశోక్‌నగర్‌లో సమస్యలు తిష్టవేశాయి. రోడ్లు, డ్రెయినేజీలు, చెత్తకుండీల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో నాలుగు డివిజన్ల కూడలి బొమ్మవెంకన్న చౌరస్తాలో రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్లుపై గుంతలు పడి నడిచేందుకు ఇబ్బందిగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్డు మరింత ఛిద్రమైంది. దీనికి తోడు వివిధ ట్రాన్స్‌పోర్టుల అడాలు కూడా ఇక్కడే ఉండడంతో ప్రతీరోజు భారీ వాహనాలు రోడ్లను మరింత అధ్వానంగా చేస్తున్నాయి. ఇదే ఏరియాలో రెండు పాఠశాలలు, రైతు బజారు ఉండడంతో రోడ్డు రద్దీగా ఉంటుంది. మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అధ్వాన రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారు. అశోక్‌నగర్‌లో అంతర్గతరోడ్లన్నీ అధ్వానంగానే ఉన్నాయి. ప్యాచ్‌వర్క్ కరువాయే గతేడాది అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ) పైపులైన్ వేసేందుకు రోడ్లు తవ్వారు. పైపులైన్ వేశాక ప్యాచ్ వర్క్ చేయాల్సిన కాంట్రాక్టర్ అలాగే వదిలేశారు. దీంతో మట్టి రోడ్లు కాస్తా బురదమయమయ్యాయి. రోడ్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదు. శనివారం అంగడిరోడ్డును పట్టించుకునే వారు కరువయ్యారు. రైతుబజార్ అక్కడే ఉన్నందున వ్యవసాయశాఖ అధికారులు కూడా పట్టీపట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. గుంతలతో నిండిన ఈ రోడ్లపై ఎగుడుదిగుడూ ప్రయాణం చేస్తూ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గుంతలరోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. చెత్తపై నిర్లక్ష్యమే నగరంలో చెత్త నిర్వహణ అధ్వానంగా మారింది. 9వ డివిజన్లోని ఎన్ఎన్గార్డెన్ సమీపంలో ఉన్న చెత్త కలెక్షన్ పాయింట్ వద్ద ఆరు రోజులుగా చెత్త వేయడం తప్ప, డంప్‌యార్డుకు తరలించిన దాఖలాలు లేవు. దీంతో పందులకు అడ్డాగా మారింది. రోగాలు ప్రబలకముందే చెత్తను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. -
జాతీయ చెత్తబుట్ట
జీవన కాలమ్ ఫెయిలవడం, ఎందుకూ పనికిరాకుండా పోవడం ఈ దేశంలో ఘనత, అవకాశం. రాజకీయాలకు దగ్గర తోవ. మనదేశంలో ఆయా రంగాలలో కాలదోషం పట్టినా కలిసి వచ్చే వ్యాపార రంగం-రాజకీయం. సినీమా రంగంలో ఒక జోక్ ఉంది. వెనకటికి ఒక నిరు ద్యోగి ఉద్యోగం కోసం ఒక నిర్మాతగారి దగ్గరికి వచ్చా డట. ‘‘నువ్వు ఏం చేస్తా వయ్యా? రచనలేమైనా చేస్తావా?’’ అన్నాడట నిర్మాత. ‘‘అయ్యో, నాకు రాదండీ!’’ అన్నాడట ఈ నిరుద్యోగి. ‘‘పోనీ, నటనలో అనుభవం ఉందా?’’ అనడిగాడట. లేదన్నాడు ఇతను. ‘‘పోనీ సంగీతంలో ప్రావీణ్యం ఉందా?’’ నిస్సహాయంగా తల అడ్డంగా తిప్పాడు. ‘‘మేకప్‌లో?’’ లేదు. ‘‘కెమేరా పనిలో?’’ లేదు. నిర్మాత ఆగి, ‘‘ఎందులోనూ ప్రవేశం లేదం టున్నావు కనుక- ఇక ఒకే ఉద్యోగం ఖాళీగా ఉందయ్యా. ఈ చిత్రానికి డెరైక్టర్‌గా ఉండు’’ అన్నాడట. ఇది కేవలం జోక్. డెరైక్టర్ మీద కడుపు రగిలిన వారెవరో కల్పించినది. ఏమీ కల్పన లేని నిజం ఈ దేశంలో మరొకటి ఉంది. ఆయా రంగాలలో ఇక రాణించే అవకాశం లేదని నిర్ధారణ అయ్యాక, ఎందుకూ పనికిరాని దశకి వచ్చిన వ్యక్తికి ఒకే ఒక్క చోటు-రాజకీయ రంగం. పాపులారిటీ - అదెంత నీచమయినదయినా, ఎంత నికృష్టమయినా ప్రజాస్వామ్యంలో కొంగుబంగారం. మొన్ననే 33 ఏళ్ల బౌలర్ శ్రీశాంత్ క్రికెట్ అవినీతికి 2013లో అరెస్టయి, ఆట నుంచి బర్తరఫ్ అయ్యాక ప్రస్తుతం ఒకానొక రాజకీయ పార్టీ తీర్థం పుచ్చు కున్నారు. రేపు వారు కేరళ అసెంబ్లీలో మనకి దర్శనం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. లోగడ అలాంటి నేరానికే శాశ్వతంగా క్రికెట్ నుంచి తొలగిన మన దేశపు కెప్టెన్ అజారుద్దీన్గారు గత పార్లమెంట్లో మన నాయ కులు. సినీరంగంలో కాలం చెల్లిన హేమమాలిని, శత్రుఘ్నసిన్హా గారలు ప్రస్తుతం పార్లమెంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకైతే హేమమాలిని పార్లమెంట్ సభ్యురాలు కావడం వల్ల సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ - ఈ దేశానికి ఏం ఉప యోగం జరిగిందో బోధపడదు. సంవత్సరాల కిందట-బందిపోటుగా మనుషుల్ని ఊచకోత కోసిన ఫూలన్‌దేవి ప్రజాప్రతినిధిగా పార్లమెంటులో మనకి దర్శనమిచ్చారు. అర్ధాంతరంగా చచ్చిపోయాడుగాని ఈ లెక్కన వీరప్పన్ ఏ రాష్ట్రానికో ముఖ్యమంత్రి అయ్యే ఆర్హతలున్నవాడు. అజారుద్దీన్ మీద ఎవరో సినీమా తీస్తున్నారని విన్నాం. ఆయన అవినీతితో అన్యాయం అయ్యాక ఈ దేశం, ఆ మాటకి వస్తే ప్రపంచం నెత్తిన పెట్టుకున్న ఈ పెద్దమనిషి ‘‘నేను మైనారిటీ వర్గం వాడిని కనుక నన్ను ఇలాచేశారు’’ అని వాగాడు. సినీమాలో ఈ ఉవాచ ఉంటుందని ఆశిద్దాం. అయితే ఒట్టిపోయిన సినీ తారల గురించి చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పకపోతే అన్యా యమవుతుంది. 1998లో మేం గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ మొదటి సభకి ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి సునీల్దత్గారి దగ్గరికి బొంబాయి వెళ్లాను. ఆయన ఆఫీసు చుట్టూ బారులు తీర్చి అతి సాదాసీదా మనుషులున్నారు. సాహెబ్ ద్వారా మాకు మేలు జరుగుతుంది అని వారు తృప్తిగా చెప్పడం నాకు గుర్తుంది. తీరా ఆగస్టు 12కి రెండు రోజుల ముందు ఆయన అమెరికాలో ఉండి పోయారు. సభని రెండు రోజులు వాయిదా వేయ వచ్చా అని సునీల్‌దత్ సెక్రటరీ నాకు ఫోన్ చేశారు. నేను చెప్పాను. అది మా అబ్బాయి కన్నుమూసిన రోజు. రెండు రోజులు దేవుడు వాయిదా వెయ్యగ లిగితే నేను అదృష్టవంతుడినయ్యేవాడిని అన్నాను. 12న సభకి వచ్చారు. అయిదు నక్షత్రాల హోటల్లో సూట్ ఏర్పాటు చేశాను. రాత్రి ఒక గ్లాసు వైన్ పుచ్చుకుని ఆ వైన్‌కి తాను బిల్లు చెల్లించారు. రాజకీయ రంగం ఈ దేశానికి అక్కర్లేని చెత్తబుట్ట. కుల, వర్గ, విద్య, ప్రమేయం లేకుండా ఎవరైనా ప్రజాసేవ చేయవచ్చునన్న వెసులుబాటుని నూటికి నూరు పాళ్లూ దుర్వినియోగం చేసిన వ్యవస్థ రాజకీయం రంగం. రామ్ మనోహర్ లోహియా, కృపలానీ, పుచ్చలపల్లి సుందరయ్యవంటి మహామహులు ఆ వ్యవస్థని సుసంపన్నం చేయగా శ్రీశాంత్లకూ, అజారుద్దీన్, హేమమాలిని వంటివారికీ ఆటవిడు పుగా ప్రస్తుతం వినియోగపడుతోంది. ఫెయిలవడం, ఎందుకూ పనికిరాకుండా పోవడం ఈ దేశంలో ఘనత, అవకాశం. రాజకీయాలకు దగ్గర తోవ. మనదేశంలో ఆయా రంగాలలో కాలదోషం పట్టినా కలిసి వచ్చే వ్యాపార రంగం- రాజకీయం. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
చెత్తకుప్పలో పసికందు మృతదేహం
వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చంపి, చెత్తకుప్పలో పడేసిన ఘటన హన్మకొండలోని రామకృష్ణ కాలనీలో గురువారం జరిగింది. కాలనీకి చెందిన కొందరు చెత్తను పడేసేందుకు హాస్టల్ పక్కన ఉన్న చెత్తకుప్ప వద్దకు రాగా, అక్కడ ప్లాస్టిక్ కవర్లో చుట్టిన శిశువు మృతదేహం కనిపించింది. అప్పటికే పందులు, కుక్కలు మృతదేహం తల భాగాన్ని వేరుచేసి ఉన్నాయి. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆడశిశువు పుట్టిందనే చంపేసి చెత్తలో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కదులుతున్న బ్యాగు.. లోపల ఓ శిశువు
గోపాలపట్నం (విశాఖపట్నం) : సంతాన భాగ్యం లేక ఎంతో మంది వేదన పడుతుంటే... అప్పుడే పుట్టిన మగ శిశువును బ్యాగులో పెట్టి చెత్తకుప్పల్లో వదిలేసి వెళ్లిపోయారు మనసులేని మనుషులు. విశాఖ నగరంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సింహనగర్లో చెత్తకుప్పల్లో కదులుతున్న బ్యాగు ఆదివారం ఉదయం స్థానికుల కంటపడింది. దాన్ని తెరచి చూడగా అప్పుడే పుట్టిన మగశిశువు కనిపించాడు. దీంతో ఆ చిన్నారిని స్థానికులు అక్కున చేర్చుకున్నారు. మాకు కావాలంటే మాకు కావాలంటూ పలువురు పోటీ పడడం కనిపించింది. కాగా ఈ సమాచారాన్ని కొందరు గోపాలపట్నం పోలీసులకు అందించారు. -
ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో చెత్త సేకరణ కోసం ఆటో ట్రాలీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. సోమవారం ఆయన 1005 స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్త సేకరణకు ఇకపై ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు పంపిణీ చేస్తామన్నారు. ఆకుపచ్చ బుట్టలో తడి, బ్లూ కలర్ బుట్టలో పొడి చెత్త వేయాలని, ప్రతి గృహిణి గుర్తు పెట్టుకుని సహకరించాలని కేసీఆర్ కోరారు. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను మేటి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నగరంలో అనేక నాలాలు కబ్జాకు గురయ్యాయని, చిన్న వర్షానికే హైదరాబాద్ జలమయం అవుతుందని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో నగరంలోని రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతామన్నారు. ఇక సమ్మె కాలంలో తొలగించిన జీహెచ్ఎంసీ ఉద్యోగులందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఇక ఇళ్లు, ప్లాట కోసం పేదలు తమ దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ మంత్రికి గానీ దరఖాస్తులు ఇవ్వాలని ఆయన సూచించారు. -
ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు
-
చెత్తకుప్పలో ఆడశిశువు మృతదేహం
కోస్గి : కర్నూలు జిల్లా కోస్గి మండలంలోని సజ్జెలగూడెం గ్రామ శివార్లలోని చెత్తకుప్పల్లో ఆడ శిశువు మృతదేహం వెలుగు చూసింది. శుక్రవారం మధ్యాహ్నం కొందరు మహిళలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శిశువు వయసు ఒక రోజు ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చెత్త కుప్పలో తుపాకీ
ఉలిక్కిపడిన విజయవాడ వాసులు * చెత్త కుప్పలో దొరికిన రివాల్వర్ * బొమ్మ తుపాకి అంటున్న పోలీసులు * పోలీసుల వైఖరిపై అనుమానాలు విజయవాడ సిటీ : నగరంలో మళ్లీ రివాల్వర్ కలకలం రేగింది. ఖరీదైన వ్యక్తులు తిరిగే ప్రాం తంలో రివాల్వర్ దొరకడం పోలీసు వర్గాలను ఉరుకులు పరుగులు పెట్టించగా.. స్థానికులను ఆందోళనకు గురి చేసింది. రివాల్వర్ స్వాధీనం చేసుకున్న నగర పోలీసు యంత్రాంగం పరిశీలన తర్వాత సిగరెట్ వెలిగించుకునేందుకు ఉపయోగించే బొమ్మ తుపాకీగా నిర్ధారించారు. అయితే దీనిని గోప్యంగా ఉంచడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనరేట్ ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడమే దీనిని బహిర్గతం చేయకపోవడానికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం లబ్బీపేట రెవెన్యూ కాలనీలోని కామినేని వెంకటేశ్వరరావు వీధిలో ఓ వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో చెత్త తరలిస్తుండగా రివాల్వర్ బయటపడింది. దీంతో చెత్త తరలింపుదారులు ఆందోళనకు గురై విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. టాస్క్‌ఫోర్స్, మాచవరం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. నగరవాసుల్లో ఆందోళన లబ్బీపేటలో రివాల్వర్ లభ్యమైందనే సమాచారం నగరవాసుల్లో ఆందోళన రేకెత్తించింది. గతంలో చోటు చేసుకున్న ఘటనలే నగరవాసులు ఉలిక్కిపడేందుకు కారణం. ఉంగుటూరు మండలం పెద అవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ట్రిపుల్ మర్డర్, నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొగ్గవరపు శ్రీశైలవాసు హత్యల్లో అత్యాధునిక తుపాకులను నిందితులు ఉపయోగించారు. గత కొంతకాలంగా జిల్లాలో పెరిగిపోయిన గన్ కల్చర్ నగరవాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే లబ్బీపేటలో రివాల్వర్ దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది. రివాల్వర్ దొరికినట్టుగా చెపుతున్న ప్రాంతానికి చేరువలో ఖరీదైన వ్యక్తులు బస చేసే స్టార్ హోటళ్లు ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు కూడా తరుచూ ఇక్కడ బస చేస్తున్నారు. రాజధాని ప్రకటన తర్వాత రాయలసీమ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ బస చేస్తున్నారు. నగరం చుట్టు పక్కల భూములు కొనుగోలు చేసేవారి రాకతో ఇక్కడి ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. హోటల్ గదులు కూడా వీరి రాకతో ఖాళీ ఉండటం లేదు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతంలో రివాల్వర్ దొరికడం పలు అనుమానాలకు ఆస్కారం కలిగించింది. విషయం దావానంలా వ్యాపించడంతో పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ఆందోళన చెందారు. దొరికిన రివాల్వర్‌ను బొమ్మ తుపాకీగా పోలీసులు చెపుతున్నప్పటికీ ఇక్కడి వారిలో నెలకొన్న సందేహాలు వీడలేదు. గోప్యంగా ఉంచారు.. రివాల్వర్ దొరికిందనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. లబ్బీపేటలో వీరు రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్టు తెలి యగా.. మీడియా ప్రతినిథులు పోలీసులను ఆరా తీశారు. తొలుత.. ‘రివాల్వరా? దొరికిందా?’ అంటూ ఆశ్చర్యం నటించారు. చివరకు మీడియా ప్రతినిథులు గట్టిగా మాచవరం పోలీసులను నిలదీయడంతో.. కొంతసేపు టాస్క్‌ఫోర్స్‌లోనూ, మరికొంత సేసు సీసీఎస్లోను ఉందంటూ చెప్పా రు. మరికొంత సమయం తర్వాత దొరికింది సిగరెట్ లైటర్‌గా ఉపయోగించే బొమ్మ తుపాకీ అంటూ సెలవిచ్చారు. అది కూడా పై అధికారుల పరిశీలనలో ఉందని చెప్పి దాటవేశారు. ఈ హైడ్రామా మూడు నుంచి నాలుగు గంటల పాటు జరిగింది. నిజంగా బొమ్మ తుపాకీ కోసం ఇంతటి గోప్యత పాటించాల్సిన అవసరం లేదు. అది వెంటనే తెలిసి పోతుంది. నిజంగా బొమ్మ తుపాకీ కాబట్టి మీడియా సమక్షంలో ప్రదర్శిస్తే సరిపోయేది. అంతే తప్ప చివరి వరకు కూడా బొమ్మ తుపాకీగా చెపుతూ గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు ఆస్కారం కలిగిస్తోంది. -
చెత్తకుండీలో గన్!
-
చెత్త మూటలు కట్టిపెట్టోయ్..
1995.. ప్రసాద్ ల్యాబ్‌లో డబ్బింగ్ థియేటర్. నాలుగేళ్ల ఓ చైల్డ్ ఆర్టిస్ట్ చాక్లెట్ ఇస్తే తినేసి ర్యాపర్ పట్టుకుని ల్యాబ్ అంతా తిరిగింది. అది పడేసే చోటు కోసం.. అంటే చెత్తబుట్ట కోసం ! ఓ పక్కన పడవేయమని ఎంతమందన్నా.. పట్టుబట్టి తనే స్వయంగా చెత్తబుట్టలో వేసింది. ఆ చిన్నారి బేబీ కావ్య. లిటిల్ సోల్జర్స్ చిత్రంతో ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకున్న కావ్యకు ఉత్తమ సిటిజన్ సత్కారం ఇవ్వాలి. 2014 జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్. ఓ స్కూల్ బస్సు ఆగింది. లోపల పిల్లలకు చాక్లెట్లు పంచినట్టున్నారు. 3 నిమిషాల వ్యవధిలో కిటికీ నుంచి 4 చాక్లెట్ ర్యాపర్లు బయటకు వచ్చిపడ్డాయి. నేను ఓ వైపే చూశాను. మరోవైపు ఎన్ని పడ్డాయో తెలియదు. వాళ్లంతా కార్పొరేట్ విద్యార్థులు. వాళ్లకి రోడ్డే ఓ చెత్తబుట్ట. ఇది దేనికి సంకేతం..? ఒకప్పుడు పబ్లిక్ ప్రదేశాల్లో చెత్తకుండీలు అరుదుగా కనిపించేవి. కానీ, వ్యవస్థలో మార్పు కోసం మున్సిపాలిటీలు ఆకర్షణీయమైన చెత్తకుండీలు ఏర్పాటు చేశాయి. మార్పు రానిదల్లా మనలోనే. మనకు రోడ్లే చెత్తకుండీలు. ఇందుగలదు.. అందులేదన్న.. సందేహం వలదు.. అన్న చందాన చెత్త కనిపించనిదెక్కడ? ముందు మనం ‘చెత్త’డిసిప్లిన్ అలవాటు చేసుకుందాం. టైప్స్ ఆఫ్ వేస్ట్ చెత్త గురించి చెప్పాలంటే వంటింట్లో తయారయ్యే చెత్త.. కూరగాయ తొక్కలు, వండిన ఆహారం, పండ్లు, మాంసం.. ఇవి డీ కంపోజ్ అయ్యే చెత్త. ఇది కుళ్లి భూమిలో కలసిపోతుంది. ఇక డ్రై వేస్ట్.. పేపర్లు, గాజు, చెక్క వీటిలో చాలా వరకు రీసైకిల్ చేసేందుకు అనువుగా ఉంటాయి. పాలిథిన్ మహమ్మారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. మన ఇంట్లో ఉత్పత్తయ్యే మరో రకం చెత్త ‘ఈ-వేస్ట్’. ఎలక్ట్రానిక్ విడిభాగాలు, బ్యాటరీలు, బల్బులు, కంప్యూటర్ సంబంధిత వేస్టేజ్. వీటిని ఎలా మేనేజ్ చేయాలో చాలామందికి తెలియదు. అందుకే ఈ-వేస్ట్‌ను కూడా సాధారణ చెత్తకుండీల్లో వేస్తున్నాం. ఇక ఇళ్లల్లో తక్కువగా, హాస్పిటల్స్‌లో ఎక్కువగా ఉత్పత్తయ్యే చెత్త మెడికల్ వేస్ట్. ఆస్పత్రుల్లో ఈ రకం చెత్తను రంగుల్లో విభజించి తరలిస్తారు. కానీ మన ఇళ్లలో సిరంజీలు, మాత్రలు వంటివి సాధారణ చెత్తలో కలసిపోతాయి. వీటిని వేరు చేసి రీసైక్లింగ్‌కు పంపడం ఎంత తలనొప్పి వ్యవహారమో ఒక్కసారి ఆలోచించండి. కలివిడిగా నడుద్దాం.. గోవాలో పాంజిమ్, మహారాష్ట్రలోని పుణే నగరాల్లో మున్సిపాలిటీలు తడి, పొడి చెత్తను విడివిడి రోజుల్లో కలెక్ట్ చేస్తున్నాయి. ప్రజలు కూడా సహకరించడంతో అవి క్లీన్‌సిటీలుగా మెరిసిపోతున్నాయి. మన మున్సిపాలిటీలోనూ దాన్ని ప్రవేశపెట్టాలని అనుకున్నారు గానీ.. ఇప్పటికీ అమల్లోకి రాలేదు. దాని సంగతి అటుంచితే.. మన నుంచి కొందరైనా చెత్తను విభజించి పంపిద్దాం. మన డంపింగ్ సమస్యల మేనేజ్మెంట్ గురించి గళమెత్తుతున్న సుకుకి ఎక్స్‌నోరా అనే స్వచ్ఛంద సంస్థ రెండు చెత్తల విధానాన్ని ప్రోత్సహించమని ప్రభుత్వాన్ని, సమాజాన్ని కదిలిస్తోంది. మనం కూడా ఈ రెండు చెత్తబుట్టల ఉద్యమంలో కలుద్దాం. తడిపి మోపెడు చేయొద్దు.. ఇప్పటికే చాలామంది వంటింటి వేస్టేజ్‌కు సపరేట్ చెత్తబుట్ట వాడుతున్నారు. పొడిచెత్త కలపకుండా డీకంపోజ్ అయ్యే చెత్తను మాత్రమే అందులో వేయండి. ఇంకో చెత్తబుట్టలో డ్రై వేస్ట్ అంటే రీసైకిల్ చేయగలిగిన పేపర్, గాజు, ప్లాస్టిక్, చెక్క వంటి వస్తువులు వేయండి. ఇందులో తడి చెత్త వేయకండి. పొడి చెత్తబుట్టకు న్యూస్ పేపర్ గానీ, పేపర్‌తో తయారు చేసిన బ్యాగులో గానీ ఇవి వేయండి. పారిశుధ్య కార్మికులకు న్యూస్‌పేపర్ బ్యాగ్ కానీ, పొట్లం కానీ రీసైకిల్‌కు సంకేతమని అర్థం అవుతుంది. ఇక మెడికల్ వేస్ట్‌ను వీటిలో కలపకుండా వీలు చూసుకుని దగ్గర్లోని హాస్పిటల్స్ ట్రాష్‌లో వేయండి. ‘ఈ-వేస్ట్’ సాధారణ చెత్తలో వేయకుండా...పాతసామాన్లు కొనే వారికి ఇవ్వండి. కనీసం అప్పుడైనా అది చేరాల్సిన చోటికి చేరుతుందేమో ! కంపౌండ్‌లో కంపోస్ట్.. తడి చెత్తను ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి పారేస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమో చెప్పక్కర్లేదు. కుదిరితే నల్లని రీసైకిల్డ్ బ్యాగ్‌లను వాడండి. మా ఇంట్లో పేపర్ సంచులు మేమే తయారు చేసుకుంటున్నాం. వీటి తయారీ పిల్లలూ ఇష్టపడతారు. పైగా ‘చెత్త’పాఠాలు నేర్చుకుంటారు. మరో అడుగు ముందుకు వేయగల్గితే.. ఇళ్లలో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో తడి చెత్తను మనమే కంపోస్ట్‌గా మార్చుకోవచ్చు. కంపోస్ట్ గుంటను గానీ, రెడీమెడ్ మట్టి కంపోస్ట్ కుండీలో గానీ వాడితే చెత్తను ఎరువుగా తయారు చే యొచ్చు. అదీ పెద్ద శ్రమ, ఖర్చు లేకుండానే. మూడేళ్లుగా మా ఇంటి చెత్తను మేం కంపోస్ట్ చేస్తున్నాం. ఇక అమల అక్కినేని గారైతే స్వయంగా కంపోస్ట్ చేయడమే కాక, అది తనకు స్ట్రెస్ రిలీవింగ్ యాక్టివిటీ అని మరీ చెప్తారు. ఈ కంపోస్ట్ తయారీ గురించి మరిన్ని వివరాలు హైదరాబాద్ గోస్ గ్రీన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ముందు ఏ చెత్తను ఏ బుట్టలో వేయాలో అందులోనే వేద్దాం. అంతకంటే ముందు చెత్తను చెత్త బుట్టలో వేసే ‘చెత్త డిసిప్లిన్’ అలవాటు చేసుకుందాం. లెట్స్ గ్రో క్లీన్. -
చెత్తకుప్పలో ఖాళీ మార్కుల జాబితా
-
మెదక్ జిల్లా సిద్ధి పేటలో కసాయి తల్లి
-
అయ్యో ‘పాప’ం!
మారేడుపల్లి, న్యూస్‌లైన్: ఆ తల్లి ఏ తప్పు చేసిందో.. లేక ఏ కష్టమొచ్చిందో.. ఆడబిడ్డ అని తెలిసి పెంచే స్తోమత లేక వదిలించుకోవాలనుకుందో పాపం.. అప్పుడే పుట్టిన బొడ్డూడని ఆడబిడ్డను చెత్తకుండీ పాలు చేసింది. వీధి కుక్కులకు ఆహారం అవ్వాల్సిన ఆ శిశువు ఇద్దరు మావనతామూర్తుల సాయంతో బతికి బట్టకట్టింది. వివరాలిలా ఉన్నాయి. కార్ఖానా పోలీసుస్టేషన్ పరిధిలోని వాసవినగర్‌లోని కమ్యూనిటీహాల్ ఎదురుగా అక్కడే వున్న గాంధీ విగ్రహం సాక్షిగా చెత్త కుప్పలో గురువారం ఓ ఆడ పసికందును పడేసి వెళ్లింది ఓ తల్లి. అక్కడే కాస్త దూరంలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికురాలు అక్కడి చెత్త వేయడానికి వచ్చి చూడగా పసిబిడ్డ బట్టలో చుట్టి అగుపడింది. ఈ విషయాన్ని స్థానికులకు తెలిపింది. విషయం తెలుసుకున్న స్థానిక సామాజిక సేవా కార్యకర్త తేలుకుంట సతీష్‌కుమార్ గుప్తా సంఘటనా స్థలానికి వ చ్చారు. సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే సమీపంలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న వై. మహేశ్వరి సాయంతో పసికందును కట్టి ఉన్న ప్టాస్టిక్ కవరును తొలగించగా ఆ శిశువు కెవ్వున ఏడ్చింది. హమ్మయ్య.....పాప బతికే ఉందని అంతా అనందించారు. ఈ లోపు కార్ఖానా రక్షక్ వాహనం అక్కడికి చేరుకోగానే ఆ ఆడశిశువును సతీష్‌కుమార్ విక్రమ్‌పురిలో ఉన్న రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్సలు నిర్వహించి నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం ఆ చిన్నారి క్షేమంగా ఉంది.