కదులుతున్న బ్యాగు.. లోపల ఓ శిశువు | Newborn baby found in dustbin | Sakshi
Sakshi News home page

కదులుతున్న బ్యాగు.. లోపల ఓ శిశువు

Published Sun, Nov 22 2015 9:37 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

Newborn baby found in dustbin

గోపాలపట్నం (విశాఖపట్నం) : సంతాన భాగ్యం లేక ఎంతో మంది వేదన పడుతుంటే... అప్పుడే పుట్టిన మగ శిశువును బ్యాగులో పెట్టి చెత్తకుప్పల్లో వదిలేసి వెళ్లిపోయారు మనసులేని మనుషులు. విశాఖ నగరంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సింహనగర్‌లో చెత్తకుప్పల్లో కదులుతున్న బ్యాగు ఆదివారం ఉదయం స్థానికుల కంటపడింది. దాన్ని తెరచి చూడగా అప్పుడే పుట్టిన మగశిశువు కనిపించాడు. దీంతో ఆ చిన్నారిని స్థానికులు అక్కున చేర్చుకున్నారు. మాకు కావాలంటే మాకు కావాలంటూ పలువురు పోటీ పడడం కనిపించింది. కాగా ఈ సమాచారాన్ని కొందరు గోపాలపట్నం పోలీసులకు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement