Bihar: ఆస్పత్రి నుంచి శిశువు అపహరణ | Bihar Newborn baby Stolen From sncu of Hospital | Sakshi
Sakshi News home page

Bihar: ఆస్పత్రి నుంచి శిశువు అపహరణ

Published Mon, Sep 16 2024 9:16 AM | Last Updated on Mon, Sep 16 2024 9:16 AM

Bihar Newborn baby Stolen From sncu of Hospital

బెగుసరాయ్: బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఆందోళనకర ఉదంతం వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రిలో శిశువు అపహరణకు గురయ్యింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటపడింది. అందులో ఒక వృద్ధ మహిళ శిశును తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మహిళ ఒక నవజాత శిశువును  ఒక వస్త్రంలో చుట్టి తీసుకువెళ్లడం సీసీటీవీలో రికార్డయ్యింది.

వివరాల్లోకి వెళితే బెగుసరాయ్‌లోని లోహియా నగర్‌కు చెందిన నందనీ దేవి  డెలివరీ కోసం ఒక ఆస్పత్రిలో చేరింది. శనివారం ఆమె ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో  ఆ శిశువు అదృశ్యమయ్యింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ సింగ్‌  ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement