కూతురి ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ | Actress Milana Nagaraj And Darling Krishna Daughter First Photo Revealed, Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Milana Nagaraj Daughter First Photo: హీరోయిన్ ఇంట్లో మహాలక్ష‍్మీ.. వీడియో వైరల్

Published Sun, Sep 29 2024 4:16 PM | Last Updated on Sun, Sep 29 2024 5:56 PM

Actress Milana Nagaraj Daughter Face Revealed

కన్నడ హీరోయిన్ మిలానా నాగరాజ్.. రీసెంట్‪‌గా పుట్టిన కుమార్తె ఫేస్ రివీల్ చేసింది. పరి అనే పేరు పెట్టిన విషయాన్ని కూడా బయటపెట్టింది. ఈమె భర్త డార్లింగ్ కృష్ణ కన్నడలో ఓ హీరో. నటుడు, దర్శకుడు, నిర్మాతగా పలు సినిమాలు చేశాడు.

(ఇదీ చదవండి: OTT: ‘రఘు తాత’ మూవీ రివ్యూ)

పలువురు అగ్రహీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె.. 2013 నుంచి సినిమాలు చేస్తోంది. అప్పట్లో హీరోయిన్‌గా చేసింది. ఇ‍ప్పుడు మాత్రం ఓ వైపు నటిస్తూనే మరోవైపు భర్తతో కలిసి నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. 2021లో కృష్ణ-మిలానా పెళ్లి జరగ్గా.. ఈ ఏడాది మార్చిలో ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. రీసెంట్‌గా ఈమెకు పాప పుట్టింది.

ఈ క్రమంలోనే పాపని ఇంటికి తీసుకొచ్చిన వీడియోని తొలుత పోస్ట్ చేసింది. తాజాగా పాప-భర్తతో కలిసి తీసుకున్న క్యూట్ అంట్ స్వీట్ ఫొటోల్ని మిలానా షేర్ చేసింది. వీటిని చూసి తోటీ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మీరు కూడా వీడియో, ఫొటోలపై ఓ లుక్కేసేయండి.

(ఇదీ చదవండి: రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్స్‌.. బాలీవుడ్‌లో పెరిగిన క్రేజ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement