కైపులో.. రాత్రంతా చెత్తకుండీలో | Drunked Man Stay All Night in Dustbin in Karnataka | Sakshi
Sakshi News home page

కైపులో.. రాత్రంతా చెత్తకుండీలో

Published Thu, Dec 26 2019 11:36 AM | Last Updated on Thu, Dec 26 2019 11:36 AM

Drunked Man Stay All Night in Dustbin in Karnataka - Sakshi

చెత్త కుండీ నుంచి బయటకు వచ్చిన కాలు, ఆ వ్యక్తి దృశ్యాలు

మైసూరు: మద్యం మత్తులో చెత్తకుండీలో పడిపోయి రాత్రంతా అందులోని పడుకున్న వ్యక్తిని బుధవారం పారిశుధ్య కార్మికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. డీడి మొహల్లాలోని ఓ చెత్తకుండీని లారీలో ఎక్కించడానికి కార్మికులు ప్రయత్నిస్తున్న సమయంలో చెత్తకుండీలో నుంచి వ్యక్తి కాలు బయటకు రావడాన్ని చూసి భయపడ్డారు. నిదానంగా చెత్తను మొత్తం తొలగించి చూడగా అందులో వ్యక్తి అచేతనంగా పడి ఉన్నాడు. ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. మద్యం కైపులో అతడు చెత్తకుండీ లోపలికి పడిపోయాడు. జనం అలాగే చెత్త వేశారు. ఎలాగో ఊపిరి ఆడడంతో ప్రాణాలు మిగిలే ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement