చెత్తకుప్పలో పసికందు మృతదేహం
కర్నూలు: జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుండీలో పడేసి వెళ్లారు. దీంతో చిన్నారి(ఆడపిల్ల) మృతి చెందింది. జూపాడుబంగ్లా మండలం తర్తురు గ్రామ శివారులోని చెత్తకుప్పలో పసికందు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.