
గ్యాడ్జెట్ 360 డిగ్రీలో కొత్త పెట్టుబడులు
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం ఎన్‌డీటీవీకి చెందిన ఈకామర్స్ సంస్థ గ్యాడ్జెట్ 360 డిగ్రీ తాజాగా మరిన్ని పెట్టుబడులు సమీకరించింది. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్, ఇన్‌ఫ్లెక్షన్‌పాయింట్ మొదలైనవి ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 325 కోట్ల) వేల్యూయేషన్లతో సంస్థ ఈ నిధులు సమీకరించినట్లు ఎన్‌డీటీవీ ఒక ప్రకటనలో తెలిపింది. గ్యాడ్జెట్ 360 డిగ్రీకి భావనా అగర్వాల్‌ను కొత్త సీఈవోగా నియమించినట్లు వివరించింది. యాత్రాడాట్‌కామ్ వంటి స్టార్టప్ సంస్థల్లో ఆమె కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌డీటీవీ పేర్కొంది.