దోమల నివారణకు చాలా పరికరాలే అందుబాటులో ఉన్నాయి. అవి మహా అయితే గదిలోని దోమలను పారదోల గలవేమో! ఆరుబయట పిక్నిక్‌ల వంటి వాటికి అవి పెద్దగా ఉపయోగపడవు. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం ఉంటే, ఆరుబయటి దోమలు, ఇతర కీటకాలు కూడా క్షణాల్లో పరారైపోతాయి.
‘థర్మాసెల్’ అమెరికన్ కంపెనీ రూపొందించిన ఈ‘థర్మోసెల్ ఈఎల్55’ అనే పరికరం రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. గదిలోనే కాదు, ఆరుబయట కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దోమలను పారదోలడంతో పాటు ఇది లాంతరులా కూడా పనిచేస్తుంది.
ఇతర పరికరాల మాదిరిగా ఇందులో ఎలాంటి రసాయనాలను వాడనవసరం లేదు. కాబట్టి ఇబ్బందికరమైన వాసనలేవీ దీని నుంచి వెలువడవు. దీని ధర 49.99 డాలర్లు (రూ.4,126) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment