చూడటానికి డబ్బాలా కనిపించే ఈ పరికరం మొక్కలకు స్మార్ట్ నేస్తం. ఇది మొక్కలకు నిత్యం నీటిని సరఫరా చేస్తూ, వాటి పచ్చదనాన్ని కాపాడుతుంది. ఇందులో ఐదులీటర్ల వాటర్‌ట్యాంకు ఉంటుంది. దీనిని ఇంటి ఓవర్‌హెడ్ ట్యాంకు లేదా సంప్‌కి అనుసంధానం చేసుకోవచ్చు. దానివల్ల ట్యాంకులో నీటిమట్టం నిరంతరం ఒకేలా ఉంటుంది.
ఇందులోని నీరు దీని వెనుకనున్న సన్నని గొట్టాల ద్వారా మొక్కలకు చేరుతుంది. ఇది స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా పనిచేస్తుంది. ఇందులోని మ్యాగ్నెటిక్ సెన్సర్లు పరిసరాల్లోని ఉష్ణోగ్రతను, మొక్కల్లోని తేమను, మట్టిలోని తేమను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటాయి. మొక్కల అడుగున మట్టిలోను, మొక్కల్లోను తేమ ఏమాత్రం తగ్గినా, వాటికి తగిన నీటిని విడుదల చేస్తుంది.
‘ప్లాంట్‌మేట్’ పేరుతో స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ప్లాంటప్’ కంపెనీ ఇటీవల దీనిని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ఇంట్లో ఉన్నట్లయితే, ఇంట్లోని మొక్కల సంరక్షణ గురించి ఎలాంటి దిగులు ఉండదు. ఒకవేళ ఇల్లు విడిచి కొద్దిరోజులు ఊరికి వెళ్లాల్సి వచ్చినా మొక్కలకు నీరు అందకపోయే సమస్యే ఉండదు. దీని ధర 199 డాలర్లు (రూ.16,561) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment