
దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ 'హెచ్‌డీఎఫ్‌సీ'(HDFC)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ జరిమానా విధించింది. నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు రూ.75 లక్షల ఫెనాల్టీ విధించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
2016లో ఆర్‌బీఐ జారీ చేసిన కేవైసీ నిబంధనలను హెచ్‌డీఎఫ్‌సీ పాటించలేదని ఆర్‌బీఐ తెలిపింది. కాగా ఈ నియమాలను నవంబర్ 2024లో సవరించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు మాత్రమే కాకుండా.. పంజాబ్ & సింద్ బ్యాంక్‌లపై జరిమానాలు విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ బుధవారం తెలిపింది.
మార్చి 2023లో బ్యాంక్ నిర్వహించిన పరిశీలనలలో కొన్ని లోపాలు ఉన్నట్లు ఆర్‌బీఐ గుర్తించి, బ్యాంకుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపైన హెచ్‌డీఎఫ్‌సీ ఇచ్చిన వివరణకు రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందలేదు. దీంతో ఆదేశాలను పాటించలేదని జరిమానా విధించింది. ఇది కస్టమర్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment