ఒంట్లోని కొవ్వు చాలా నిశ్శబ్దంగా పెరుగుతూ పోతుంది. బరువు పెరిగి, దుస్తులు బిగుతైనప్పుడు గాని ఒంట్లోని కొవ్వు కథ అర్థం కాదు. ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల తలెత్తే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి ఒంట్లోని కొవ్వు పేరుకుపోతున్న సంగతిని ముందుగానే గుర్తించి, కరిగించుకునే చర్యలు త్వరగా మొదలుపెడితే తప్ప ఫలితం ఉండదు.
మరి ఒంట్లో పేరుకుపోతున్న కొవ్వును ముందుగానే గుర్తించడం ఎలా అనుకుంటున్నారా? ఈ ఫొటోలో కనిపిస్తున్న బుల్లి పరికరాన్ని చూశారుగా! ఇది చేతిలో ఉంటే చాలు, ఒంట్లో కొవ్వు ఎక్కడ పేరుకున్నా, ఇట్టే కనిపెట్టేస్తుంది. ఈ పరికరం పేరు ‘బెల్లో’. ఇది ‘డిస్క్రీట్ మల్టీ వేవ్‌లెంగ్త్ నియర్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ’ సాంకేతికతతో పనిచేస్తుంది.
దీన్ని స్విచాన్ చేసుకుని, ఒంట్లో కొవ్వు పెరిగిందనుకునే భాగాల వద్ద ఉంచి, స్కాన్ బటన్ నొక్కితే చాలు, మూడు నిమిషాల్లోనే యాప్ ద్వారా మొబైల్ ఫోన్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఆలివ్ హెల్త్‌కేర్’ దీనిని రూపొందించింది. దీని ధర 189 డాలర్లు (రూ.15,427) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment