ఫొటోలో కనిపిస్తున్న లిప్‌స్టిక్ సాధారణమైనది కాదు. మహిళల అందానికే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం.. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన శ్యామ్ చౌరేసియా అనే ఔత్సాహిక శాస్త్రవేత్త మహిళల స్వీయ రక్షణ కోసం ఓ ఆయుధాన్ని తయారు చేశారు. ఇది అచ్చంగా లిప్‌స్టిక్‌ను పోలి ఉండే లిప్‌స్టిక్ గన్. దీన్ని నొక్కితే పేలుడు శబ్ధం వినిపిస్తుంది. అంతేకాక నేరుగా ఎమర్జెన్సీ నంబర్ 112కు కనెక్ట్ అవుతుంది. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై ప్రమాదంలో ఉన్న మహిళకు సాయపడతారు.
ఈ లిప్‌స్టిక్ గన్ ఆవిష్కర్త శ్యామ్ మాట్లాడుతూ.. ‘ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనపుడు మహిళలు ఈ లిప్‌స్టిక్‌పై ఉన్న బటన్ నొక్కితే సరిపోతుంది. వెంటనే పోలీసులకు ఫోన్ వెళుతుంది. దీనికి చార్జింగ్ సదుపాయంతో పాటు బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. నిస్సందేహంగా అందరూ తమ వెంట దీన్ని తీసుకెళ్లవచ్చు’ అని పేర్కొన్నాడు. ఈ పరికరాన్ని తయారు చేయడానికి అతనికి సుమారు ఒక నెల సమయం పట్టగా కేవలం రూ.600 మాత్రమే ఖర్చయ్యాయని తెలిపాడు.
త్వరలోనే అతను ఈ లిప్‌స్టిక్ గన్‌పై పేటెంట్ హక్కులు తీసుకోనున్నాడు. కాగా ఈ పరికరాన్ని ముందుగా బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన షెఫాలి రాయ్ ప్రయోగించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇది వెంట తీసుకెళ్లడానికి ఎంతో సౌకర్యంగా ఉంది. ఈ గన్ చేసే శబ్ధం ఎంతో భయాన్ని కల్పించేదిగా ఉంది. ఇది మీ వెంట ఉంటే మిమ్మల్ని ఎవరూ అనుమానించరు. ఎందుకంటే అందరూ దీన్ని మామూలు లిప్‌స్టిక్‌గా భ్రమపడతారు’ అని చెప్పుకొచ్చింది.
ఇది మామూలు లిప్‌స్టిక్ కాదు
Published Thu, Jan 9 2020 1:33 PM | Last Updated on Thu, Jan 9 2020 2:30 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment