Lipstick
-
పెదవుల అందం.. పదవికి చేటు!
ఆడాళ్లు అనుకువగా ఉండడం అసాధ్యమంటారు పెద్దలు.. ఇది అక్షరాలా నిజం అనిపించే ఘటన చెన్నై నడిరోడ్డున కార్పొరేషన్ కార్యాలయం సాక్షిగా చోటు చేసుకుంది. ఒక ఒరలో రెండు కత్తులు.. సాధ్యం కాదనేలా.. కార్పొషన్ను శాసించే మేయర్‌కు.. ఆమెకు సహాయకారిగా ఉండే మహిళా దఫేదార్కు మధ్య ఏర్పడిన చిరు వివాదం.. చిలికిచిలికి గాలివానలా మారి రచ్చకెక్కింది. చివరికి ఒకరి ఉద్యోగానికి ఎసరు తెచ్చింది... అదెలాగో మీరూ చూడండి! సాక్షి, చెన్నై: నగర కార్పొరేషన్లో మహిళలు పెదావుల కు వేసుకునే లిప్‌స్టిక్ వ్యవహారం బుధవారం పెద్ద చర్చకే దారి తీసింది. మేయర్ ప్రియ వెన్నంటి ఉండే మహిళా దఫేదార్ మాధవి బదిలీ ఈ లిప్‌స్టిక్ గొడవను తెరమీదకు తెచ్చింది. వివరాలు.. చెన్నై కార్పొరేషన్లో గత 15 ఏళ్లుగా మాధవి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె డీఎంకే మేయర్ ఆర్ ప్రియకు దఫేదార్‌గా ఉన్నారు. హఠాత్తుగా మాధవిని మనలి మండలానికి బదిలీ చేశారు. అలాగే ఆమెకు ఓ మెమో జారీ చేయడంతో ఈ వ్యవహారం లిప్‌స్టిక్ గొడవను తెరమీదకు వచ్చింది. మేయర్ ఆర్.ప్రియతో సమానంగా మాధవి లిప్‌స్టిక్ వేసుకుని రావడమే ఈ బదిలీకి కారణం అనే చర్చ జోరందుకుంది.మేయర్ వేసుకునే రంగులోనే లిప్‌స్టిక్‌ను ఆమె అనేక సందర్భాలలో వేసుకుని రావడాన్ని ప్రియ పీఏలు ఖండించినట్టు సమాచారం. చిన్నతనం నుంచి తాను లిప్‌స్టిక్ వాడుతున్నాని, తనకు నచ్చిన రంగు,ఫ్లేవర్ వాడుతానని, దీనిని హఠాత్తుగా మార్చుకోమడం సబబు కాదని వారికి మాధవి సూచించిన నేపథ్యంలో ఈ బదిలీ వేటు పడటమే కాకుండా, ఆమె సరిగ్గా పనిచేయడం లే దంటూ మెమో జారీ చేసినట్టు కార్పొరేషన్లో చర్చ ఊ పందుకుంది. ఈ విషయంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ, తాను వేసుకునే లిప్‌స్టిక్, మేయర్ వేసుకునే లిప్‌స్టిక్ ఒకే విధంగా ఉందని పేర్కొంటున్నారని వాపోయారు. తనకు నచ్చిన రంగు తాను వాడుతున్నానని, ఇది తన వ్యక్తిగతం అని వ్యాఖ్యలు చేశారు. పురుష దఫేదార్ ఇంటికి వెళ్లి పోయినా, తాను మాత్రం కుటుంబాన్ని సైతం వీడి మేయర్‌కు వెన్నంటి రేయింబవళ్లు శ్రమించినందుకు మంచి గుర్తింపునే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా వీరికి మరో రెండేళ్లు పదవి ఉండవచ్చునని, తాను ఓ ఉద్యోగిని అని, తన జర్నీ మరింతగా కార్పొరేషన్లో కొనసాగాల్సి ఉంటుందని వ్యాఖ్యనించడం కొనమెరుపు. -
ఉద్యోగులను తొలగించిన లిప్‌స్టిక్ కంపెనీ
పర్సనల్ కేర్, కాస్మొటిక్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే గుడ్ గ్లామ్ గ్రూప్ దాదాపు 150 మంది లేదా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది చివర్లో ఐపీవోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ యూనికార్న్ కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు తన మానవ వనరులను పునర్నిర్మించడంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 12-15 నెలల్లో వివిధ విభాగాలలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో లాభదాయకమైన కంపెనీగా ఉండాలనే దృఢమైన లక్ష్యానికి ఈ వ్యూహాత్మక చొరవ దోహదపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గుడ్ గ్లామ్ గ్రూప్ ఇటీవల పోప్గ్జో, ప్లిగ్సో, బేబీ చక్ర, మామ్స్కో, స్కూప్ఊప్, ట్వీక్ ఇండియా కంపెనీలను కొనుగోలు చేసింది. గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా మనన్ జైన్, గ్రూప్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఫౌండర్ ఇనిషియేటివ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కార్తీక్ రావు, బ్రాండ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా అంకితా భరద్వాజ్‌ని నియమించింది. ఇటీవలే గ్రూప్ కొత్త గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కమల్ లత్ నియామకాన్ని కూడా ప్రకటించింది. -
పెదాలకు అందంగా లిప్ప్లంపర్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు
ఈ రోజుల్లో అందాన్ని కాస్మెటిక్స్తోనే కాదు.. ఇలాంటి స్మార్ట్ డివైస్లతోనూ సొంతం చేసుకోవచ్చు. ‘మొహానికి క్రీములు, పౌడర్లు రాసుకున్నా.. రాసుకోకపోయినా పెదవులకు మాత్రం లిప్‌స్టిక్ ఉండాల్సిందే’ అని అభిప్రాయపడుతుంటారు సౌందర్యప్రియులు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హ్యాండ్‌బ్యాగ్‌లో లిప్‌స్టిక్‌తో పాటు లిప్ ప్లంపర్ కూడా మెయిన్టైన్ చేసేవాళ్లు పెరుగుతున్నారు. ఇది సైలెంట్‌గా పనిచేస్తుంది. దాంతో ఎక్కడైనా, ఏ సమయంలోనైనా చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీనికి నెలకోసారి చార్జింగ్ పెడితే సరిపోతుంది. డివైస్‌కి ఒకవైపు.. టైమ్ కంట్రోల్, పవర్ బటన్, బ్యాటరీ ఇండికేషన్ వంటి ఆప్షన్స్‌తో డిస్ప్లే ఉంటుంది. ఈ డివైస్‌తో పాటు ఓవెల్ షేప్, రౌండ్ షేప్ అనే రెండు రీప్లేస్ హెడ్స్ కూడా లభిస్తాయి. అభిరుచిని బట్టి వాటిని మెషిన్‌కి అమర్చుకుని.. ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ప్లంపర్ వాడటంతో పెదవులు మృదువుగా.. అందమైన షేప్‌లోకి మారతాయి. దీన్ని బాత్రూమ్లోనైనా, ఆఫీస్‌లోనైనా, ప్రయాణాల్లోనైనా.. ఎక్కడైనా తేలికగా వాడుకోవచ్చు. ధర సుమారుగా 44 డాలర్లు. అంటే 3,611 రూపాయలన్న మాట. దీన్ని ఆన్ చేసిన తర్వాత ప్లస్ లేదా మైనస్ బటన్ల సహాయంతో పెదవులకు రౌండ్ లేదా ఓవెల్ ఎఫెక్ట్‌ను తెచ్చుకోవచ్చు. అనంతరం పెదవులకు లిప్ బామ్ రాస్తే సరిపోతుంది. మెరుస్తూ.. ప్రత్యేకంగా కనిపిస్తాయి. దాంతో ముఖం మరింత అందంగా మారుతుంది. -
రోజూ లిప్‌స్టిక్ వాడుతున్నారా? ఇందులోని కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వల్ల..
అమ్మాయిలు అందంగా కనిపించేందుకు రకరకాల వస్తువులు వాడుతుంటారు. ముఖ్యంగా కాస్మొటిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు.వాటికోసం వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. బ్యూటీ ఉత్పత్తులపై రోజూ కొన్ని కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంటుంది. అందులో ఒకటి లిప్‌స్టిక్. ఈరోజుల్లో లిప్‌స్టిక్ వాడకం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలు అయితే లిప్‌స్టిక్ లేనిదే కాలు కూడా బయట పెట్టరు. లిప్‌స్టిక్ లేకుండా అసలు మేకప్ పూర్తి అవదు. ముఖాన్ని మరింత కాంతివంతంగా, అందంగా కనిపించేందుకు లిప్‌స్టిక్ వాడుతుంటారు. కొందరైతే డ్రెస్ కలర్‌కి తగ్గట్లు రకరకాల లిప్‌స్టిక్స్‌ను వాడుతుంటారు. అయితే అందాన్ని పెంచే లిప్స్టిక్స్ రోజూ వాడితే ప్రమాదం పొంచిఉన్నట్లే..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ♦లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత మనం ఏదైనా తిన్నా, తాగినా ఎంతోకొంత మన నోట్లోకి వెళుతుంది. లిప్‌స్టిక్‌లలో శరీరానికి హాని కలిగించే అనేక రకాల ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ♦ లిప్‌స్టిక్‌లో ఉండే అల్యూమినియం,క్రోమియం,కాడ్మియం వంటి హానికారమైన పదార్థాలు అనేక విధాలుగా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ♦ ముఖ్యంగా లిప్‌స్టిక్‌లోని అల్యూమినియం పొట్టలోకి చేరితే అల్సర్‌కు దారి తీస్తుంది.లిప్‌స్టిక్‌లోని సీసం సామర్థ్యం, జ్ఞాపకశక్తి స్థాయిని తగ్గిస్తుంది. ♦ అరుదైన సందర్భాల్లో, లిప్‌స్టిక్ వల్ల కళ్ల కింద దురద, ఉక్కిరిబిక్కిరి చేయడం, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ♦ లిప్‌స్టిక్స్‌లో వాడే సీసం వల్ల హైపర్‌టెన్షన్, గుండె సమస్యలు వస్తాయి. ♦ బిస్మత్ ఆక్సిక్లోరైడ్‌ను లిప్‌స్టిక్‌లో ప్రిజర్వేటివ్‌గా కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల అలర్జీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ♦ కొన్ని చవక లిప్‌స్టిక్‌లను వాడితే చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ లిప్స్టిక్స్ వాడాలనుకునేవారు ఖరీధైన, హెర్బల్ ఉత్పత్తులను వాడితే మంచిది. లిప్స్టిక్స్ వాడేముందు ఇలా చేయండి.. ► కొందరు తెలిసో తెలియకనో డైరెక్ట్‌గా లిప్స్‌కు లిప్‌స్టిక్‌ను వేసేసుకుంటారు. అలా అస్సలు చేయొద్దు. ముందుగా లిప్‌బామ్ రాసుకొని దానిపైన లిప్‌స్టిక్ వాడాలి. ► లిప్‌బామ్ అందుబాటులో లేకపోతే పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె లాంటివి కూడా వాడొచ్చు. ► లిప్స్టిక్స్ ప్రతిరోజూ వాడటం వల్ల పెదాలు నల్లగా మారిపోతుంటాయి. అందువల్ల పాలతో రబ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ► పడుకునేముందు కశ్చితంగా లిప్‌స్టిక్‌ను తొలగించిన తర్వాతే నిద్రపోవాలి. లేదంటే లిప్‌స్టిక్స్‌లోని కెమికల్స్ పెదాలను డ్యామేజ్ చేస్తాయి. ► పెదాలు హైడ్రేటెడ్‌గా ఉంచడానికి నీళ్లు ఎక్కువగా తాగాలి. లేదా పొడిబారే అవకాశం ఎక్కువగా ఉంటుంది -
సరికొత్త కలెక్షన్‌తో మీ పెదాలకు మరింత అందం
-
పాపం.. అప్పుల ఊబిలో రెవలాన్!
కింగ్ నాగార్జున సినీ కెరీర్లోనే కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన చిత్రం 'మన్మథుడు'. ఈ సినిమాలో డైలాగ్‌లు, సీన్లు ప్రేక్షకులకు ఇప్పటికీ గిలిగింతలు పెడతాయి. ఇదే సినిమాలో ఓ లిప్‌స్టిక్ యాడ్ గుర్తుందా? "ఆడ పిల్ల పెదాలు ముడుచుకొని ఉన్నాయంటే బాధగా ఉన్నట్లు అర్ధం. అదే పెదాలు విచ్చుకొని ఉన్నాయంటే ఆనందంగా ఉన్నాయని అర్ధం. ఆ పెదాలు మునుపంటి కింద నలుగుతున్నాయంటే కోపంగా ఉన్నట్లు అర్ధం. కానీ ఒకమ్మాయి పెదాలు అందంగా ఉన్నాయంటే మాత్రం వాటిమీద రెవలాన్ లిప్‌స్టిక్ ఉందని అర్ధం' అంటూ వచ్చే రెవలాన్ లిప్టిక్ యాడ్ సీన్ ఆ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ రెవలాన్ కంపెనీ.. ఇప్పుడు రుణ భారాన్ని మోయలేక కోర్ట్‌ను ఆశ్రయించింది. రెవలాన్ హెడ్‌క్వార్టర్స్ న్యూయార్క్‌లో ఉంది. సుమారు 150 దేశాల్లో వీటి ఉత్పత్తులు అమ్ముడుపోయేవి. అయితే.. తొమ్మిది దశాబ్దాల చరిత్ర ఉన్న రెవలాన్ బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సప్లై చైన్ సమస్యలు, పెరిగిపోతున్న అప్పుల కారణంగా న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఛాప్టర్-11 దివాలా రక్షణ కోసం దాఖలు చేసింది. ఇందులో భాగంగా దాని ప్రస్తుత రుణదాతల నుండి 575 మిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పోటీ పెరిగింది రెవలాన్, అల్మే నుండి ఎలిజబెత్ ఆర్డెన్ వరకు బ్రాండ్లు బ్యూటీ మార్కెట్లో రారాజులుగా కొనసాగుతున్నాయి. కానీ గత కొన్నేళ్లుగా మారుతున్న అందం, అభిరుచులు, పుట్టుకొస్తున్న బ్యూటీ ప్రొడక్ట్ కంపెనీలతో పోటీ పడలేక పోతున్నాయి. రెవలాన్ లాంటి సంస్థలు కుదేలవుతున్నాయి. -
Beauty Tips: మ్యాట్ లిపిస్టిక్ వేసుకునే ముందు ఇవి పాటించండి! లేదంటే
Beauty Tips In Telugu: లిప్‌స్టిక్ కొనే ముందు దానిలో ఆయిల్ కంటెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. లేదంటే లిప్‌స్టిక్ వేసిన తరువాత పెదాలు పగిలినట్లు అవుతాయి. అందుకే మ్యాట్ లిపిస్టిక్ వేయకముందు పెదాలకు లిప్‌బామ్ లేదా కొబ్బరి నూనెతో మర్ధన చేయాలి. ►లిప్‌లైనర్‌తో అవుట్‌లైన్ వేయాలి. ►బ్రష్‌తో కాకుండా ట్యూబ్‌తోనే మ్యాట్ లిప్‌స్టిక్‌ను వేసుకోవాలి ►మ్యాట్ వేసిన తరువాత కాసేపు చేతులు పెట్టకుండా ఆగాలి. ►ఈ లిప్‌స్టిక్ ఆరడానికి సమయం పడుతుంది కాబట్టి వెంటనే టచ్ చేయకూడదు. ►లేదంటే లిప్‌స్టిక్ షేపవుట్ అవుతుంది. ►ఇవన్నీ పాటిస్తే మీ మ్యాట్ లిప్‌స్టిక్ క్లాసీగా, పెదవులు మరింత అందంగా కనిపిస్తాయి. చదవండి: Korean Slap Therapy: ముఖ నిగారింపు పెంచుకోవాలంటే.. చెంప చెళ్లుమనాల్సిందే! -
Eyeliner: ఐలైనర్ వాడుతున్నారా.. అయితే...
మేకప్ ముఖాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతుంది. అయితే కళ్లకు పెట్టుకునే ఐలైనర్ మేకప్‌లో కీలకపాత్ర పోషిస్తుంది. ఐలైనర్ కాస్త అటూ ఇటూ అయినా మేకప్ మొత్తం చెడిపోతుంది. ఐలైనర్ లైన్ దాటకుండా అందాన్ని మరింతగా ఎలా పెంచుకోవచ్చో చూద్దాం... మార్కెట్లో వివిధ రకాలా ఐలైనర్లు దొరుకుతుంటాయి. అయితే మన్నికనిచ్చే కంపెనీ లేదా బ్రాండ్ ఐలైనర్‌ను మాత్రమే కొనాలి. ముఖ్యంగా వాటర్ ప్రూఫ్ అయ్యి ఉండేలా చూసుకోవాలి. వాటర్ ప్రూఫ్ అయితే ఎక్కువ సమయం నిలిచి ఉండడమేగాక, కళ్లకు ఎటువంటి హానీ కలిగించదు. ఐలైనర్ వేసే ముందుకంటే ముందుగా కనురెప్పలకు ప్రైమర్ వేయాలి. ప్రైమర్ వేసిన తరువాతే ఐలైనర్ వేయాలి. దీనివల్ల ఐలైనర్ ఎక్కువసమయం ఉండడమేగాక, కళ్లు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. మేకప్ వేసే ముందు కంటికింది భాగంలో కన్సీలర్ రాయడం వల్ల మచ్చలు పోయి కళ్లు వికసించినట్లు కనిపిస్తాయి. అంతేగాకుండా ఐలైనర్ వేసేముందు కూడా కన్సీలర్ రాయడం మరింత మంచిది. పెన్సిల్ లేదా జెల్ ఐలైనర్ వాడేటప్పుడు తప్పనిసరిగా కళ్లకు నప్పే ఐషాడో వేయాలి. దీనివల్ల కంటి అందం మరింత మెరుగుపడుతుంది. లిప్‌స్టిక్ వేసినట్లుగా ఐలైనర్‌ను రెండు కోటింగ్‌లు వేయడం వల్ల ఐలైనర్ మరింత బ్రైట్‌గా కనిపించడమేగాక, కళ్లు పెద్దవిగానూ, అందంగానూ కనిపిస్తాయి. చదవండి: Dry Eye Irritation: కంట్లో దురదా.. ఇలా చేస్తే సమస్యలకు చెక్ పెట్టవచ్చు! -
లిప్‌స్టిక్ తయారీలో వాడే గింజలు ఏంటో తెలుసా..!
సాక్షి, బుట్టాయగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో కొత్తరకం సాగుకు గిరిజన రైతు శ్రీకారం చుట్టాడు. లిప్‌స్టిక్ గింజలుగా పేర్గాంచిన జాఫ్రా పంట సాగు మొదలుపెట్టి తొలి ప్రయత్నంలోనే సత్ఫలితాలు సాధించాడు. బుట్టాయగూడెం మండలం దాసయ్యపాలెంకు చెందిన మడకం జంపాలరావు దాదాపు 30 ఏళ్లుగా 100 ఎకరాల్లో పలు రకాల పంటలు సాగుచేస్తున్నాడు. ఇటీవల తూర్పుగోదావరి, విశాఖ మన్య ప్రాంతంలో పర్యటించిన సమయంలో జాఫ్రా సాగు గురించి తెలుసుకున్నాడు. ఈ సాగు అతడిని ఆకట్టుకోవడంతో మొదటగా మూడు ఎకరాల్లో సాగు ప్రారంభించాడు. సాధారణంగా 14 నెలల్లోపు పంట చేతికి రావాల్సి ఉండగా 9 నెలలకే దిగుబడి సాధించాడు. జాఫ్రా అంటే.. ►జాఫ్రా మొక్కలు కొండలు, గుట్టల్లో సహజ సిద్ధంగా పెరుగుతాయి. ►జాఫ్రా మొక్కల కాయల నుంచి ఎర్రటి గింజలు (లిప్‌స్టిక్ గింజలు) తీస్తారు. ►ఈ గింజలను లిప్‌స్టిక్, సౌందర్య సాధనాలు, ఫుడ్ కలర్స్, ఆహార ఉత్పత్తులు, అద్దకాలు, మందుల తయారీకి వినియోగిస్తారు. ►ఆహార ఉత్పత్తుల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని అమెరికా నిషేధించడంతో జాఫ్రా గింజలకు డిమాండ్ పెరిగింది. ►జాఫ్రా గింజల వినియోగం పెరగడంతో వాణిజ్య పంటగా రూపుదిద్దుకుంది. ►జాఫ్రా ఆకులను కామెర్లు, పాము కాటుకు మందుగా ఉపయోగిస్తారు. ►బెరడను గనేరియా వ్యాధి నివారణకు వినియోగిస్తారు. ►జీసీసీ ద్వారా జాఫ్రా గింజలను కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు 160 మొక్కల చొప్పున రంపచోడవరం నుంచి మొక్కలను తీసుకువచ్చి ఎకరాకు 160 చొప్పున మూడెకరాల్లో నాటాను. మొక్కల ఎదుగుదల ఆశాజనకంగా ఉంది. సాధారణంగా పంట 14 నెలలకు చేతికి వస్తుంది. అయితే నేను వేసిన పంట 9 నెలలకే దిగుబడి వచి్చంది. తూర్పుగోదావరి జిల్లా రైతులు ఎకరాకు ఏడున్నర క్వింటాళ్ల దిగుబడి సాధించగా మా పంట 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం మూడెకరాల్లో పంటను వేశాను. వచ్చే ఏడాది 50 ఎకరాల్లో పంట వేయాలని అనుకుంటున్నా. ఐటీడీఏ ద్వారా పంటను కొనుగోలు చేస్తే మరింత మంది గిరిజనులు జాఫ్రా సాగుకు ముందుకు వస్తారు. ఇంటర్నెట్లోనూ సాగు వివరాలు తెలుసుకున్నా. అంతర్జాతీయ మార్కెట్లో జాఫ్రా గింజలకు కిలో రూ.1,200 వరకు ధర పలుకుతోంది. –మడకం జంపాలు, గిరిజన రైతు, దాసియ్యపాలెం, బుట్టాయగూడెం మండలం జాఫ్రా గింజలు -
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క!
దొంగతనం చేసి, పట్టుబడ్డ ఓ కుక్క ఇప్పుడో సోషల్ మీడియా సెలెబ్రిటీ అయ్యింది. తను చేసిన దొంగతనంతో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. వివరాలు.. డాక్టర్ సుల్భా కేజీ అరోరా అనే యవతి తన ట్విటర్ ఖాతాలో మంగళవారం ఓ ట్వీట్ చేసింది. ‘‘ నిన్న రాత్రి ఓ దొంగ డ్రెసర్లోంచి మా అమ్మ లిప్‌స్టిక్‌ను దొంగిలించుకుపోయాడు. అదృష్టం! ఆ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం’’ అని పేర్కొంది. కాళ్లకు లిప్‌స్టిక్ రంగుతో ఉన్న పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ట్వీట్ ఇప్పటి వరకు 2 వేలకుపైగా లైకులు సంపాదించుకుంది. ( లేడీ కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్ ) దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ తిన్నింటి వాసాలు లెక్కపెట్టడానికి సిగ్గులేదు’’.. ‘‘ దొంగతనం చేసి, అమాయకంగా ఫేస్ ఎలా పెట్టాడో చూడండి!’’.. ‘‘ఇలాంటి దొంగల్ని ఊరికే వదిలిపెట్టకూడదు.. గోడకుర్చీ వేయించాలి’’ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. అయితే కుక్క వైపునుంచి డాక్టర్ సుల్భా కేజీ అరోరా స్పందిస్తూ.. ‘‘ నేను దొంగను పట్టుకుని లిప్‌స్టిక్‌ను స్వాధీనం చేసుకున్నా.. అందుకే నా పాదాలు ఎర్రగా అయ్యాయమ్మా..’’ అని కామెంట్ చేశారు. Last night a thief stole one of mom's lipsticks from her dresser and ran away with it but luckily we caught him 'red-handed'. pic.twitter.com/1LwwDDm1Qh — Dr Sulbha KG Arora (@SulbhaArora) February 9, 2021 "I caught the thief and retrieved the lipstick and that's how my paws got red, mom!" — Dr Sulbha KG Arora (@SulbhaArora) February 9, 2021 -
ఆర్మీ: నెయిల్ పాలిష్, పోనిటెయిల్‌కు ఓకే
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.. అగ్రరాజ్య సైన్యానికి సంబంధించి పలు కీలక మార్పులకు ఆమోదం తెలిపారు. సైన్యంలో మహిళా సైనికుల వస్త్రధారణకు సంబంధించి కొన్ని నియమాల్లో కీలక మార్పులు చేశారు. ఇక మీదట అమెరికన్ సైన్యంలోని మహిళా సైనికులు షార్ట్ పోనిటెయిల్ వేసుకోవడానికి.. లిప్‌స్టిక్ పెట్టుకోవడానికి అనుమతించారు. అలానే మగ సైనికులు స్పష్టమైన రంగుల నెయిల్ పాలిష్ ధరించవచ్చని తెలిపారు. ఇక బిడ్డకు పాలిచ్చే మహిళా సైనికులు వస్త్రధారణకు సంబంధించి పలు సడలింపులు ఇచ్చారు. బ్రెస్ట్ ఫీడింగ్, పంపింగ్ ద్వారా బిడ్డకు పాలిచ్చే తల్లులు ప్రస్తుత వస్త్రధారణ ప్రమాణాలకు అదనంగా లోపల మరో వస్త్రం ధరించేందుకు అనుమతిచ్చారు. ఈ నూతన మార్పులు ఫిబ్రవరి 25 నుంచి అమల్లోకి రానున్నాయి అని తెలిపారు. ప్రస్తుత మార్పులు అమెరికా సైన్యంలో చేరే మహిళల సంఖ్యను పెంచుతాయని.. అంతేకాక ప్రస్తుతం ఉన్న మహిళా సైనికులపై అసమాన ప్రభావాన్ని చూపుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: బైడెన్ వలస చట్టంపై హోరాహోరీ ) మాజీ డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ సూచనల ఫలితమే ఈ మార్పులు. ఈ కమిటీ మిలటరీలో జాతివివక్ష, మైనారిటీలపై అధికార దుర్వినియోగం వంటి పలు అంశాల పరిశీలనకు ఉద్దేశించబడింది. గతంలో అమెరికా సైన్యంలోని మహిళలు పొడవాటి జుట్టును బన్(కొప్పు)లా కట్టుకోవాల్సి వచ్చేది. ఇది అసౌకర్యంగా ఉండటమే కాక.. హెల్మెట్ ధరించడంలో ఇబ్బంది కలిగేది. ఇక తాజా సవరణలతో ఈ సమస్యలు తొలగిపోనున్నాయి. ఈ సందర్భంగా ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ గ్యారీ బిట్రో మాట్లాడుతూ.. ‘‘మా విధానాలను నిరంతరం పరిశీలించుకుంటూ.. అవసరమైన చోట మార్పులు చేసుకుంటూ.. ముందుకు సాగుతున్నాం. ఇక మేం అవలించే విధానాల వల్ల సైన్యంలోని సైనికులందరు మాకు ఎంత విలువైన వారో.. వారి పట్ల మాకు ఎంత నిబద్ధత ఉందో వెల్లడవుతుంది. మా ర్యాంకుల్లో చేరిక, ఈక్విటీ వంటి అంశాల్లో.. మాటల కంటే చేతలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని ఈ రోజు మేం మరోసారి నిరూపించాం. మేం ప్రకటించిన ఈ మార్పులు మన ప్రజలను మొదటి స్థానంలో ఉంచే విధానాలకు ఒక ఉదాహరణ అని మేం నమ్ముతున్నాం’’ అన్నారు. (చదవండి: అంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్) The #USArmy has revised Army Regulation 670-1, Wear and Appearance of Army Uniforms and Insignia. The updates will be effective Feb. 25, 2021 and directly supports the Army’s diversity and inclusion efforts. Learn more in this STAND-TO! ➡️ https://t.co/Y2VlaZgQHr#ArmyLife pic.twitter.com/4y9e7hBJ5a — U.S. Army (@USArmy) January 27, 2021 ఇక ఆర్మీలో చేసిన ఈ మార్పులు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మగ వారికి నెయిల్ పాలిషా.. వ్వాటే జోక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అమెరికా వాయు సేన తన విభాగంలో పని చేస్తున్న మహిళా సైనికుల హెయిర్ స్టైల్ విషయంలో పలు మార్పులు చేసిన వారం రోజుల తర్వాత మిలిటరీ ఈ నూతన మార్పులు ప్రకటించింది. ఇక ఇదే కాక బైడెన్ లింగమార్పిడి వ్యక్తులను సైన్యంలోకి నిషేధిస్తూ.. ట్రంప్ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. అంతేకాక ‘‘దేశానికి సేవ చేయాలనుకునే వారిని ప్రోత్సాహిస్తేనే.. అమెరికా సురక్షితంగా ఉంటుంది. అలాంటి వారి విషయంలో వివక్ష చూపకూడదని.. వారి పట్ల గర్వంగా భావించాలి’’ అని బైడెన్ ట్వీట్ చేశారు. -
పెదవుల మృదుత్వానికి... బ్యూటిప్స్
కొంతమందికి తరచుగా పెదవులు చిట్లడం,.పై పొర లేచిపోయి పొట్టు రాలడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు అవుతుందంటే... శరీరంలో వచ్చిన మార్పులను, వాతావరణంలోని మార్పులను పెదవులు ఇట్టే ప్రతిబింబిస్తాయి. ఇందుకు దారితీసే కారణాలు . కాఫీలు ఎక్కువగా తాగడం, ఆల్కహాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనితో పెదవులు పొడిబారుతాయి. ∙వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పును పెదవులు భరించలేవు. ఎక్కువ చలిని, ఎక్కువ వేడిని తట్టుకోలేక తేమకోల్పోయి పొడిబారతాయి. ∙పని ఎక్కువైనందువల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థలో ఒడిదుడుకులు వస్తాయి. ఆ ప్రభావం మొదట కనిపించేది పెదవులలోనే. ∙లిప్‌స్టిక్‌ల వల్ల ఇరిటేషన్ వచ్చినా కూడా పెదవులు పొడిబారి, చిట్లుతాయి. ∙ఏదైనా రుగ్మతకు మందులు వేసుకున్నప్పుడు శరీరం తేమను కోల్పోయినట్లయితేకూడా బయటకు కనిపించే సమస్యల్లో ఇదేమొదటిది. పెదవులకు సాంత్వన చేకూరాలంటే... ఐదు మిల్లీ లీటర్ల గ్లిజరిన్‌లో అంతే మోతాదు నిమ్మరసం, పన్నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారిసాయంత్రం ఒకసారి పెదవులకు పట్టించాలి. పెదవులకు పట్టించి దానంతట అదిఆరే వరకు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని మూడు రోజుల వరకు వాడవచ్చు. మరీ ఎక్కువగా పొడిబారినట్లనిపిస్తే రెండు గంటలకొకసారి కాని ఉదయం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లుకాని పట్టించవచ్చు. ఇవేవీ వీలుకానప్పుడు నీటితోనే మర్దన చేస్తేతాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. చలికి పెదవులు చిట్లినప్పుడు వేడి నీటిలోదూది ముంచి పెదవులకు పట్టించాలి. ఎండలకు చిట్లినట్లయితే దూదితో చల్లటి నీటినిపట్టించాలి. వీలైతే నీటిలోనే గ్లిజరిన్, వాజలిన్, తేనె ఏదో ఒకటి కొద్దిగా వేసుకోవచ్చు. లిప్‌స్టిక్ కొనేటప్పుడు అందులో వాడినపదార్థాల జాబితాను ఒకసారి సరి చూసుకోవడం తప్పని సరి. బ్రాండెడ్ కంపెనీలుతప్పని సరిగా ఈ లిస్ట్‌ను ప్రచురిస్తాయి. మాయిశ్చరైజర్ ఉన్న లిప్‌స్టిక్‌నే ఎంచుకోవాలి. సాధారణంగా లిప్‌స్టిక్‌లలో గ్లిజరిన్‌తోపాటు యాంటిసెప్టిక్ ప్రాపర్టీస్ కూడాఉంటాయి. -
కళతప్పిన ‘లిప్‌స్టిక్’
కోవిడ్-19 మహమ్మారితో చాలా రకాల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ జాబితాలోకి లిప్‌స్టిక్ కూడా చేరింది. కోవిడ్ విజృంభణను అదుపుచేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్డౌన్ విధించారు. కొన్ని దేశాల్లో లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ మరికొన్ని దేశాల్లో ఇప్పటికీ లాక్డౌన్ కొనసాగుతుంది. దీంతో ఎక్కువమంది ఇంట్లో నుంచే పనిచేయాల్సి వస్తోంది. ఇంట్లో ఉన్నవారు లిప్‌స్టిక్‌ని తక్కువగా వినియోగించడంతో వీటి అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఒక వేళ ఎవరైనా బయటకొచ్చినా గానీ మాస్క్ తప్పనిసరి కాబట్టి లిప్‌స్టిక్ పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. అందువల్ల వినియోగం తగ్గిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా లాక్డౌన్ తర్వాత కూడా ఆఫీసు కార్యాలయాల్లో మాస్క్‌లు ధరిచడం తప్పనిసరి కావున అప్పుడు కూడా విక్రయాలు పెద్దగా ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిమాండ్ తగ్గి విక్రయాలు పడిపోవడంతో లిప్‌స్టిక్ వ్యాపారాలు చేసేవారంతా ‘ఐ’ మెకప్పై దృష్టిపెడుతున్నారు. దీనిలో భాగంగా ఐలైనర్స్, మస్కారా, ఐ షాడో వంటి ఉత్పత్తుల తయారీకి మొగ్గుచూపుతున్నారు. సామాజిక,విందూ,వినోద, వివాహదీ శుభ కార్యక్రమాలకు ఎక్కువ మందికి అనుమతి లేకపోవడం, వర్కింగ్ ఫ్రంహోంకు ప్రాధాన్యత ఇస్తుండడంతో లిప్స్టిక్కు ప్రాధాన్యత తగ్గిందని లోరియల్ ఇండియా డైరెక్టర్ కవిత అంగ్రే చెబుతున్నారు.ఏవైనా అధికారిక కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించినప్పుడు మాత్రమే లిప్‌స్టిక్‌ను వాడుతున్నారని, అంతకు మించి పెద్దగా డిమాండ్ లేదని, అందువల్ల ఐ మేకప్‌పై దృష్టిపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. మనమంతా మనుషులం, ఎప్పటికైనా సమాజంలో తిరగక తప్పదు. దానికోసం కొత్త మార్గాలను అన్వేషించి మళ్లీ మునుపటి పరిస్థితుల్లోకి వెళతాము. అప్పుడు లిప్స్టిక్కు డిమాండ్ ఏర్పడుతుందన్నారు. వ్యాపారులంతా ఐ మేకప్‌పై ఆసక్తి కనబరుస్తుండడంతో ఐ షాడో విక్రయాలు టాప్-5 నుంచి టాప్-3లోకి వచ్చాయని బ్యూటీ రిటైలర్ నైకా అధికార ప్రతినిధి చెప్పారు. కాగా మరోపక్క వ్యక్తిగత పరిశుభ్రతకు వినియోగదారుల ప్రాధాన్యం పెరిగినందున లిప్ బామ్స్, ఫేస్క్రీమ్స్కు డిమాండ్ భారీగా పెరిగింది. -
దొండపండు లాంటి పెదవుల కోసం
మగువల అందంలో పెదవులు చాలా ప్రత్యేకం. చర్మం రంగు ఏదైనా కానీ.. పెదవుల అందం ఎరుపైతే ఆ ముఖంలో వచ్చే కళ అంతా ఇంతా కాదు. పెదవులు ఎర్రగా, దొండపండులా ఉంటే.. ఆ అందం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే ఎర్రదనం కోసం రంగు పూసుకోవచ్చు కానీ.. దొండపండు లాంటి పెదవుల కోసం ఏం చెయ్యగలం? మేకప్‌లో భాగంగా చాలా మంది తన పెదవులను హైలెట్ చేసుకోవడానికి..లిప్ గ్లాస్, లిప్ బామ్, లిప్‌స్టిక్.. ఇలా చాలానే వాడుతుంటారు. నిజానికి కొందరి పెదవులు సన్నగా, చిన్నగా, ముడుచుకున్నట్లుగా ఉంటాయి. మరికొందరివి పేలవంగా, కళాహీనంగా కనిపిస్తాయి. లిప్‌స్టిక్ వేసినా అంత అందంగా అనిపించవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బొద్దుగా, ముద్దొచ్చేలా మారవు. అయితే చిత్రంలో కనిపిస్తున్న ‘లిప్ ప్లంపర్’ మేకప్ కిట్‌లో ఉంటే.. సన్నగా, పేలవంగా ఉండే పెదవులను కూడా దొండపండుల్లా మార్చుకోవచ్చు. అదెలా అంటే.. చూడటానికి ట్రిమర్లా ఉన్న ఈ గాడ్జెట్ ముందు భాగంలో (రెడ్ కలర్ కనిపిస్తున్న చోట) పెదవుల ఆకారంతో ఉన్న ఓ రంధ్రం ఉంటుంది. దానిలో పెదవులని ఉంచి మోడ్స్ మార్చుకోవాలి. దీన్ని ముప్ఫై సెకన్స్ పాటు ఉపయోగిస్తే చాలు. ఇందులో హై, మీడియం, లో అనే మూడు మోడ్స్‌తో పాటు.. యాపిల్ లిప్ ఎఫెక్ట్, ఫుల్ లిప్ ఎఫెక్ట్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. యాపిల్ లిప్ అంటే కింద పెదవి మధ్యలో నిలువుగా, అందంగా సన్నని గీత ఏర్పడుతుంది. ఫుల్ లిప్ అంటే కింద పెదవి మధ్యలో ఎలాంటి గీత ఏర్పడదు. దీన్ని చార్జింగ్ పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. పెదవుల్లో వచ్చిన ఆ మార్పు 4 నుంచి 10 గంటల వరకూ ఉంటుంది. దీని ధర 27 డాలర్లు. అంటే 1,930 రూపాయలు. భలే ఉంది కదూ! మరి ఇంకెందుకు ఆలస్యం మోడ్స్ మార్చి, ఎఫెక్ట్స్ ప్రయత్నించండి. -
ఈ లిప్‌స్టిక్ మిమ్మల్ని కాపాడుతుంది
ఫొటోలో కనిపిస్తున్న లిప్‌స్టిక్ సాధారణమైనది కాదు. మహిళల అందానికే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం.. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన శ్యామ్ చౌరేసియా అనే ఔత్సాహిక శాస్త్రవేత్త మహిళల స్వీయ రక్షణ కోసం ఓ ఆయుధాన్ని తయారు చేశారు. ఇది అచ్చంగా లిప్‌స్టిక్‌ను పోలి ఉండే లిప్‌స్టిక్ గన్. దీన్ని నొక్కితే పేలుడు శబ్ధం వినిపిస్తుంది. అంతేకాక నేరుగా ఎమర్జెన్సీ నంబర్ 112కు కనెక్ట్ అవుతుంది. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై ప్రమాదంలో ఉన్న మహిళకు సాయపడతారు. ఈ లిప్‌స్టిక్ గన్ ఆవిష్కర్త శ్యామ్ మాట్లాడుతూ.. ‘ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనపుడు మహిళలు ఈ లిప్‌స్టిక్‌పై ఉన్న బటన్ నొక్కితే సరిపోతుంది. వెంటనే పోలీసులకు ఫోన్ వెళుతుంది. దీనికి చార్జింగ్ సదుపాయంతో పాటు బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. నిస్సందేహంగా అందరూ తమ వెంట దీన్ని తీసుకెళ్లవచ్చు’ అని పేర్కొన్నాడు. ఈ పరికరాన్ని తయారు చేయడానికి అతనికి సుమారు ఒక నెల సమయం పట్టగా కేవలం రూ.600 మాత్రమే ఖర్చయ్యాయని తెలిపాడు. త్వరలోనే అతను ఈ లిప్‌స్టిక్ గన్‌పై పేటెంట్ హక్కులు తీసుకోనున్నాడు. కాగా ఈ పరికరాన్ని ముందుగా బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన షెఫాలి రాయ్ ప్రయోగించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇది వెంట తీసుకెళ్లడానికి ఎంతో సౌకర్యంగా ఉంది. ఈ గన్ చేసే శబ్ధం ఎంతో భయాన్ని కల్పించేదిగా ఉంది. ఇది మీ వెంట ఉంటే మిమ్మల్ని ఎవరూ అనుమానించరు. ఎందుకంటే అందరూ దీన్ని మామూలు లిప్‌స్టిక్‌గా భ్రమపడతారు’ అని చెప్పుకొచ్చింది. -
మేకప్‌తో మెరుగులు
వస్త్రధారణకు తగ్గట్టు మేకప్ ఉంటేనే అందంగా కనిపిస్తారు. అయితే, మేకప్ ఎలా ఉండాలంటే... ►సమకాలీన పరిస్థితులను అనుసరిస్తూ ఫ్యాషన్‌లోనూ, మేకప్‌లోనూ ట్రెండ్స్‌ను పరిశీలిస్తూ మేనికి నప్పే సౌందర్య ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలి. ►మేకప్‌లో ఫౌండేషన్‌ను ఎక్కువ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జిడ్డు చర్మానికి ఫౌండేషన్ మరింతగా అతుక్కుపోయి, సహజకాంతిని దూరం చేస్తుంది. ►పెదవులకు ముదురు రంగు లిప్‌స్టిక్‌లను వాడితే వయసు పైబడినట్టుగా చూపిస్తాయి. అసహజంగానూ కనిపిస్తాయి. తప్పనిసరై ముదురు రంగు లిప్‌స్టిక్ వాడితే, పైన లిప్‌గ్లాస్ సహజసిద్ధమైనది ఎంచుకోవాలి. ►మేకప్ అంటే పెదవులకు గాఢమైన ముదురు రంగు, కనురెప్పలకు మెరుపులద్దే షిమ్మర్‌ని ఉపయోగించాలనుకోకూడదు. ముఖంలో పెదవులు, కళ్లు, బుగ్గలు.. ఇలా ప్రతి భాగాన్ని అత్యంత జాగ్రత్తగా చిత్రకారుడు బొమ్మను గీసినంత అందంగా తీర్చిదిద్దాలి. ►ఎప్పుడైనా ముఖం సహజమైన మెరుపుతో కనిపించాలి. ఇందుకోసం అత్యంత తక్కువ మేకప్‌ను ఎంచుకోవాలి. -
బ్యూటిప్స్
మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు వెంట లిప్‌స్టిక్, బ్లషర్, పౌడర్, దువ్వెన, టిష్యూపేపర్, సేఫ్టీపిన్స్... ఇలాంటివన్నీ ఉండే చిన్న ‘టచ్–అప్’ కిట్‌ని వెంట తీసుకెళ్లాలి. మేకప్ చెదిరినా, తీసివేయాలన్నా తడుముకోవాల్సిన అవసరం ఉండదు. -
మేకప్‌తో మెరుగులు
వస్త్రధారణకు తగ్గట్టు మేకప్ ఉంటేనే అందంగా కనిపిస్తారు. అయితే, మేకప్ ఎలా ఉండాలంటే... ►సమకాలీన పరిస్థితులను అనుసరిస్తూ ఫ్యాషన్‌లోనూ, మేకప్‌లోనూ ట్రెండ్స్‌ను పరిశీలిస్తూ మేనికి నప్పే సౌందర్య ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలి. ►మేకప్‌లో ఫౌండేషన్‌ను ఎక్కువ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జిడ్డు చర్మానికి ఫౌండేషన్ మరింతగా అతుక్కుపోయి, సహజకాంతిని దూరం చేస్తుంది. ►పెదవులకు ముదురు రంగు లిప్‌స్టిక్‌లను వాడితే వయసు పైబడినట్టుగా చూపిస్తాయి. అసహజంగానూ కనిపిస్తాయి. తప్పనిసరై ముదురు రంగు లిప్‌స్టిక్ వాడితే, పైన లిప్‌గ్లాస్ సహజసిద్ధమైనది ఎంచుకోవాలి. ►మేకప్ అంటే పెదవులకు గాఢమైన ముదురు రంగు, కనురెప్పలకు మెరుపులద్దే షిమ్మర్‌ని ఉపయోగించాలనుకోకూడదు. ముఖంలో పెదవులు, కళ్లు, బుగ్గలు.. ఇలా ప్రతి భాగాన్ని అత్యంత జాగ్రత్తగా చిత్రకారుడు బొమ్మను గీసినంత అందంగా తీర్చిదిద్దాలి. ►ఎప్పుడైనా ముఖం సహజమైన మెరుపుతో కనిపించాలి. ఇందుకోసం అత్యంత తక్కువ మేకప్‌ను ఎంచుకోవాలి. -
నప్పేలా లిప్‌స్టిక్
పెదాలకు రంగు వేసుకొని ముచ్చటపడేవారు చాలామందే ఉంటారు. కానీ వారి చర్మరంగు, దుస్తుల మ్యాచింగ్ ఇవేవీ పట్టించుకోకుండా లిప్‌స్టిక్ వాడితే అందంగా ఉండటానికి బదులు ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే లిప్‌స్టిక్ వాడేవారికి కొన్ని సూచనలు... ముదురు రంగులకు దూరం: పెదవులకు ముదురురంగు లిప్‌స్టిక్ వాడితే పెదాలు చిన్నగా కనిపిస్తాయి. పెదవుల రంగులోనే కనిపించాలంటే న్యూడ్ లేదా క్లియర్ షేడ్స్ గల లిప్‌స్టిక్‌ను ఎంచుకోవాలి. అప్పుడే పెదవులు సహజమైన కాంతితో కనిపిస్తాయి. షాడో తప్పనిసరి: ముదురు గోధుమ రంగు, వాటర్ ఫ్రూఫ్ ఐలైనర్‌తో కిందిపెదవి అంచు వద్ద చిన్న లైన్ గీయాలి. తర్వాత లిప్‌స్టిక్ వేసుకోవాలి. ఈ చిన్న మార్క్ వల్ల పెదవులు పెద్దగా, మరింత వంపుతిరిగినట్టు అందంగా కనిపిస్తాయి. గ్లాసీ లిప్‌స్టిక్: ఎంచుకున్న లిప్‌స్టిక్‌తో పెదవులను తీర్చిదిద్దాక అలాగే వదిలేస్తే జీవం కోల్పోయి కనిపిస్తాయి. పైన కాంతిని ఇచ్చే షైనీ ఫినిష్‌తో టచప్ చేయాలి. పగిలిన పెదవులు: పెదవులపై చర్మం పొడిబారితే మృతకణాలు తేలి, లిప్‌స్టిక్ వేసినా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మెత్తటి టూత్‌బ్రష్‌తో కొద్దిపాటి ఒత్తిడిని కలిగిస్తూ రుద్దాలి. తర్వాత నీటితో కడిగి, లిప్‌బామ్ రాయాలి. -
'టాయిలెట్లో ముద్దు ఎవరు పెట్టారబ్బా..?'
ట్విటర్‌ను ఓ ప్రశ్న వేధిస్తోంది. ఆ ప్రశ్న విన్నాక సిల్లీగా అనిపించినా.. నిజంగానే ఆ పని ఎవరు చేసుంటరబ్బా అని అనుకోవడం మాత్రం పక్క. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటని అనుకుంటున్నారా? టాయిలెట్ బేసిన్ లోపలి అంచుకు ముద్దెవరు ఇచ్చారు? ఇది నిజానిక ప్రశ్న కాదు. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత మాత్రం ఇదే ప్రశ్న వస్తుంది. ఆ దృశ్యం ఏమిటంటే ఓ టాయిలెట్‌లోని సిట్టింగ్ బేసిన్ లోపలి అంచుకు పింక్ లిప్‌స్టిక్ మార్క్ కనిపించింది. సాధారణంగా టాయిలెట్ అనగానే గబ్బు అనే ఆలోచన వస్తుంది. ఎవరు ఎంత శుభ్రం చేసినా టాయిలెట్‌ను టాయిలెట్గానే చూస్తాం తప్ప అదేదో విశ్రాంతి మందిరం అని మాత్రం అస్సలు అనుకోము. అందులోని వస్తువులను కూడా దగ్గరగా పట్టుకునే సాహసం చేయము. అలాంటిది ఓ యువతి తన అందమైన పెదాలతో గులాబీ రంగు లిప్‌స్టిక్ పెట్టుకొని టాయిలెట్ బేసిన్ లోపలి అంచుకు ఎలా ముద్దు పెట్టింది. ఇంత సాహసం ఆ యువతి ఎలా చేసింది. అసలు ఆ యువతి ఎవరు? అంటూ ట్విటర్లో నెటిజన్లు తలలు బద్ధలు కొట్టుకుంటున్నారు. ఇప్పటికే దీనికి ఓ 5వేలమంది రీ ట్వీట్ చేయగా పది వేల షేర్లు వచ్చాయి. Stranger Things - 2018 pic.twitter.com/WfLrTgGthd — ✪ Veer ✪ (@ClawedHumor) 10 January 2018 me after 12 sangrias — Sushri Sahu (@SushriSahu) 10 January 2018 pic.twitter.com/JYqxwcREdZ — Vinay (@vnay85) 10 January 2018 I'll be happy to spend the rest of my existence not knowing how this happened. — Matthew Palumbo, MBA (@MattGPalumbo) 10 January 2018 This is the story. Period. pic.twitter.com/j7MBWHsczE — Feel it Tweet it!❤✋ (@LiZaisatweetie) 10 January 2018 -
అక్కడ లిప్‌స్టిక్ ధర రూ.72 వేలు
న్యూఢిల్లీ: భారతీయ మహిళలు ఎరుపెక్కిన పెదాలు, గులాబీ బుగ్గలు, తీరైన నల్లటి కనుబొమలు, కొసదేరిని ముక్కు, అందమైన కురులతో అందంగా కనిపించడం కోసం తహతహలాడుతుండడంతో దేశంలో బ్యూటీ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. అయినప్పటికీ ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా బ్యూటీ బిజినెస్ ఎక్కువగా ఉన్న 50 దేశాల్లోకెల్లా భారత్‌లోనే లిప్‌స్టిక్ ధరలు చాలా తక్కువగా ఉండడం విశేషం. భారత్‌లో ఓ లిప్‌స్టిక్ ధర సరాసరి 926 రూపాయలు ఉండగా, ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వెనిజులా దేశంలో ఉండడం ఆశ్చర్యం. ఆ దేశంలో సరాసరి లిప్‌స్టిక్ ధర 71,627 రూపాయలు పలుకుతుంది. అక్కడి ద్రవ్య సంక్షోభమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వెనిజులా తర్వాత పెరూలో లిప్‌స్టిక్ ధర 3,792 రూపాయలు పలుకుతోంది. భారత్‌లో కాస్మోటెక్ సర్జరీలు కూడా చవగ్గా అందుబాటులో ఉన్నాయని మెక్సికో ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ 'లినియో' బ్యూటీ ప్రైస్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. బ్రెస్ట్ పెంచుకునేందుకు చేసుకునే కాస్మోటిక్ సర్జరీలకు స్విడ్జర్లాండ్ దేశాల్లో ఆరేడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుండగా, భారత్‌లో కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఖర్చవుతుందట. అయితే భారత దేశంలో ముక్కు కాస్మోటిక్ సర్జరీకి ఎక్కువ ఖర్చు అవుతుందట. సరాసరి 83,922 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపింది. బ్యూటీ బ్రాండ్లు, సర్వీసులు, కాస్మోటెక్ ప్రొసీజర్లను పరిగణనలోకి తీసుకొని లినియో కంపెనీ బ్యూటీ ధరల సూచికను తయారు చేసింది. సోషల్ మీడియా, బ్లాగుల కారణంగా భారత్‌లోని పట్టణ ప్రాంతాల్లో బ్యూటీ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ మార్కెట్ ఒక్క 2016లోనే 16 శాతం వద్ధి చెందింది. ఒక్క లిప్‌స్టిక్ రంగంలోనే 3,338 కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోంది. లాక్మీ, నైకా లాంటి స్థానిక బ్రాండ్లను ఆదరిస్తున్న మహిళలు, స్మాష్బాక్స్, సెఫోరా లాంటి విదేశీ బ్రాండ్లను సైతం ఆదరిస్తున్నారు. కనుబొమలపై అవాంఛిత రోమాలను తొలగించడంతోపాటు జుట్టును అందంగా తీర్చిదిద్దినట్లు కత్తిరించడం లాంటి బ్యూటీ సర్వీసులకు కూడా భారత్‌లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా మగవాళ్లకు రోడ్డుపక్కనుండే సాలూన్ షాపులు తక్కువ ధరలకే సేవలిందిస్తున్నాయి. భారతీయ మహిళలు అందమైన కనుబొమల కోసం సరాసరి 150 రూపాయలు ఖర్చు పెడుతుండగా, అదే అమెరికా మహిళలు దాదాపు 700 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. భారత్‌లో హేర్ కటింగ్ కోసం పురుషులు సరాసరి 175 రూపాయలు ఖర్చు పెడుతుండగా, అమెరికాలో పురుషులు దాదాపు 910 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. -
బ్యూటిప్
పెదవులకు లిప్‌స్టిక్ వేయడం ఓ ఆర్ట్. పెదవుల ఆకృతిని బట్టి లిప్‌లైన్ గీయాలి. ఆ తర్వాత సన్నని బ్రష్‌తో లిప్‌స్టిక్ వేయాలి. మధ్యలో ఎప్పుడైనా టచప్ చేయాల్సినప్పుడు మాత్రమే నేరుగా లిప్‌స్టిక్‌తో పెదవులను అద్దాలి. -
కోమల సౌందర్యం
⇔ లిప్‌స్టిక్ వేసే ముందు పెదవులకు సన్‌స్క్రీన్ లోషన్ రాయాలి. పెదవుల మీద చర్మం మరీ సున్నితంగా ఉంటుంది. మిగతా శరీరంతో పోలిస్తే పెదవుల మీద సూర్యకిరణాల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రపు రక్షణ తప్పనిసరి. ⇔ పెదవులు పొడిబారి చర్మం పొట్టులా రాలే సమస్యతో బాధపడే వాళ్లు లిప్‌కలర్ వేసుకోవాలంటే ముందుగా పెదవులకు లిప్‌బామ్ కాని, కోల్డ్‌క్రీమ్ కాని రాయాలి. ⇔ పెదవుల మీద పొడిబారిన చర్మాన్ని చాలా సున్నితంగా తొలగించాలి. వ్యాక్సింగ్, పళ్లతో కొరకడం వంటివి... ఏది చేసినా సమస్య జటిలమవుతుంది. లిప్‌స్టిక్ వేసుకునే అలవాటున్న వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. మెత్తటి టవల్‌తో పెదవుల మీద మెల్లగా రుద్దుతూ పొడిబారిన చర్మాన్ని వదిలించాలి. ఆ తర్వాత కొద్దిగా కోల్డ్‌క్రీమ్ తీసుకుని పలుచగా రాసి ఆ పైన లిప్‌స్టిక్ వేయాలి. ⇔ పెదవులు మెరవాలంటే లిప్‌స్టిక్ వేసిన తర్వాత లిప్‌గ్లాస్ వేయాలి. పెదవులు సహజంగా ఉన్న రంగులోనే మెరుస్తూ కనిపించాలంటే లిప్‌గ్లాస్ మాత్రమే వాడాలి. ⇔ నిద్రపోయే ముందు లిప్‌స్టిక్ తొలగించడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయరాదు. రాత్రంతా లిప్‌స్టిక్ ఉన్నట్లయితే పెదవులు నల్లబడడమే కాక ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. -
ముద్దొచ్చే చిత్రాలు...
కాన్వాస్‌పై ఓ చిత్రకారిణి.. ముద్దుల వర్షం కురిపిస్తోంది. అధరాల అందాలను కళాఖండాలుగా మలుస్తోంది. ముఖారవిందానికి మరింత అందాన్ని ఇచ్చే లిప్‌స్టిక్‌నే తన పెయింట్‌గా మార్చుకుని ముద్దులతో విభిన్న రూపాలకు ప్రాణం పోస్తోంది. టొరొంటోకు చెందిన చిత్రకారిణి మేకప్ ఆర్టిస్ట్ అలెక్సిస్ ఫ్రేజర్ కుంచెకు బదులు.. అధరాలను ఆధారం చేసుకుంది. కాన్వాస్‌పై కళారూపాలను సాక్షాత్కరింపజేసేందుకు ఏకేఏ లిప్‌స్టిక్ లెక్స్‌ను వినియోగిస్తూ అద్భుత కళాఖండాలను రూపొందిస్తోంది. తాను గీసే చిత్రాన్ని బట్టి సరైన స్థానంలో సరిగా పేర్చే లిప్‌స్టిక్ ప్రింట్లే కళాభిమానుల మనో ఫలకంపై చెరగని ముద్రలు వేస్తున్నాయి. ఆయిల్ పెయింటింగ్‌లో స్పెషలిస్ట్ అయిన ఫ్రేజర్.. ‘కిస్ ప్రింట్ పాయింటలిజమ్’లోనూ ప్రత్యేకతను సాధించింది. తన అధరాలకు రంగును అద్దుకుని కాన్వాస్‌పై పెట్టే ముద్దులే కళారూపాలుగా మారుతున్నాయి. ఆమె రూపొందించే చిత్రాల్లో అధిక శాతం, తన పెదాలకు పూసుకున్న లిప్‌స్టిక్ ముద్దులతో సాక్షాత్కరించినవే. ఏకేఏ లిప్‌స్టిక్ లెక్స్ తో చిన్న తరహాలో సెలబ్రిటీల చిత్రాలను రూపొం దించేందుకు ఫ్రేజర్‌కు కొన్ని గంటల సమయం పడితే పెద్ద తరహాలో చిత్రాలకు మాత్రం రోజుల తరబడి సమయం పడుతుంది. ఒక్కోసారి ప్రత్యేక చిత్రాలను రూపొందించాలనుకున్నప్పుడు వారం వరకూ కూడా ఆమె కాన్వాస్‌పై ముద్దులు కురిపించాల్సి వస్తుందట. అంతేకాదు అటువంటి పోట్రైట్ల కోసం కొన్ని ట్యూబ్‌ల కొద్దీ లిప్‌స్టిక్ వాడాల్సి ఉంటుందని చెప్తోంది. అందుకు అతి పెద్ద నిదర్శనం 2014లో ఆమె రూపొందించిన మార్లిన్ మాన్రో కాన్వాస్ కళాఖండమే. దీనికోసం ఆమె నాలుగు రోజుల సమయాన్ని వెచ్చించడంతో పాటు, రెండు ట్యూబ్‌ల లిప్‌స్టిక్‌ను వాడిందట. -
కాలా జామూన్... రుమాలీ రోటీ..!
అది లిప్స్టిక్కా.. పెయింటా? ఒకవేళ ఫంక్షన్‌కి వచ్చే ముందు ‘కాలా జామూన్’ (నలుపు రంగులో ఉండే గులాబ్ జామ్) తిని ఉంటుందా? ఏదైనా పెయింట్కి సంబంధించిన ఉత్పత్తిదారులు పెయింట్‌ని ఉచితంగా ఇచ్చారా? అంటూ ఐశ్వర్యా రాయ్ పెదవుల గురించి అదేపనిగా కామెంట్స్. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి ఐష్ వేసుకున్న ఫ్రాక్ అందరికీ నచ్చింది. కానీ, పెదవులకు వేసుకున్న ‘పర్పుల్ కలర్’ లిప్‌స్టిక్ మాత్రం ఐష్‌కి సూట్ కాలేదు. దాంతో సోషల్ మీడియా ద్వారా చాలామంది వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఐష్ వాటిని పట్టించుకోలేదు. అసలు ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నప్పుడు తాను ఫ్యాషన్‌గా కనిపించడం కోసం పెద్దగా ఒత్తిడికి గురి కానని ఆమె అంటున్నారు. ‘‘నేను ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాను. ఒక నటిగా ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌గా కనిపించడానికి ట్రై చేస్తుంటాను. ఫ్యాషన్‌ని నేనో కళలా భావిస్తా. కొత్తగా ఏదైనా ట్రై చేస్తా. అది బాగుంటుందో, లేదో అని భయపడను’’ అని ఐష్ పేర్కొన్నారు. ఈ అందాల సుందరి గురించి అలా ఉంచితే... ఆదివారం సోనమ్ కపూర్ ధరించిన తెలుపు రంగు గౌను కూడా హాట్ టాపిక్ అయ్యింది. వెనకాల ఒక మనిషి ఆ ఫ్రాక్‌ని సెట్ చేస్తూ, సోనమ్‌తో పాటు నడిస్తే కానీ, ఆమె సరిగ్గా నడవలేరు. రెడ్ కార్పెట్ పై నడిచే వరకూ నిజంగానే ఆమెకు ఓ వ్యక్తి హెల్ప్ చేశారు. కానీ, రెడ్ కార్పెట్ పై ఏ మాత్రం తడబాటు లేకుండా సోనమ్ అందంగా వాక్ చేసి, భేష్ అనిపించుకున్నారు. కొంతమంది ఆమె గౌనును ‘రుమాలీ రోటీ’ అంటూ జోక్ చేశారు. షార్ట్ ఫిలిమ్ విభాగంలో తెలుగు కుర్రాడి సినిమా! మొత్తం మీద మన భారతీయ తారల హంగామా కాన్స్ చలనచిత్రోత్సవాల్లో బాగానే సాగుతోంది. ఇప్పటికే కాన్సలో నడుస్తున్న హంగామాలో మరో కొత్త విశేషం వచ్చి చేరింది. మన తెలుగు కుర్రాడు రాజా నిషాంత్ పోతినేని దర్శకత్వం వహించిన ‘60 ఎయిట్’ అనే షార్ట్ ఫిలిమ్ కూడా అక్కడ ప్రదర్శితం కానుంది. ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తమ్ముడు - ప్రముఖ వైద్యుడు డాక్టర్ రమేశ్‌బాబు కుమారుడు, హీరో రామ్‌కు కజిన్ బ్రదరూ అయిన రాజా నిషాంత్ రూపొందించిన ఈ చిత్రం నిడివి 15 నిమిషాలు. ‘జాన్ అనే ఎనిమిదేళ్ల కుర్రాడు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురవుతాడు. ఆ కారణంగా కొద్దిపాటి స్పృహతో మిగులుతాడు. 52 ఏళ్ల వయసు వచ్చేవరకూ జీవచ్ఛవంలా బతుకుతాడు. ఆ సమయంలో తన బాల్య స్నేహితురాలు తారసపడతుంది. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది ఈ చిత్రకథ. -
అతిపురాతనం అధరాలంకరణం!
పురాణాలు, ప్రబంధాలలో బింబాధర వర్ణనలను విరివిగానే చదువుకుని ఉంటాం. వాటిని చదివినప్పుడల్లా లిప్స్టిక్లేవీ లేని కాలంలో అప్పటి కవులు పెదవులను అంత సవర్ణభరితంగా ఎలా వర్ణించారబ్బా అని ఆశ్చర్యపోయే ఉంటాం. ఇప్పటి మోడర్న్ మేకప్‌లో వాడే లిప్‌స్టిక్ అప్పట్లో ఉండేది కాదు. అయితే, అధరాలంకరణ అలవాటు అప్పట్లో లేదనుకుంటే పొరపాటే! ఐదువేల ఏళ్ల కిందటే సుమేరియన్లు పెదవులకు రంగు పూసుకునేవారు. పైగా ఆడా మగా తేడా లేకుండా అందరూ పూసుకొనేవాళ్లు. ప్రాచీన ఈజిప్షియన్లు తమ సామాజిక హోదాను చాటుకొనేందుకు పెదవులను శ్రద్ధగా అలంకరించుకునేవారు. మొక్కల నుంచి ఖనిజాల నుంచి ఎరుపు రంగును సేకరించి, శుభ్రపరచి పెదవులకు అలంకారంగా వాడేవారు. పదహారో శతాబ్దిలో బ్రిటిష్ రాణి మొదటి ఎలిజబెత్ నిత్యం ఎర్రబారిన పెదవులతోనే ప్రజలకు దర్శనమిచ్చేది. తెల్లని ముఖంలో ఎర్రని పెదవులను జనం అబ్బురంగా చూసేవాళ్లు. కొన్నాళ్లకు ఈ ఫ్యాషన్‌ను అనుకరించడం మొదలుపెట్టారు. అప్పట్లో తేనెటీగల కొవ్వులో మొక్కల నుంచి సేకరించిన ఎరుపురంగును కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని దీర్ఘకాలం భద్రపరచుకుని ఉపయో గించేవారు. ఆధునిక లిప్స్టిక్కు ఒకరకంగా ఇదే పూర్వరూపం. ప్యారిస్‌లోని ఓ కాస్మొటిక్స్ సంస్థ 1884లో మొదటిసారిగా రకరకాల రసాయనాలను ఉపయోగించి ఆధునిక లిప్‌స్టిక్‌ను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఇక అప్పటి నుంచి పాశ్చాత్య ఫ్యాషన్ రంగంలో లిప్‌స్టిక్ కీలకంగా మారింది. క్రమంగా ఇది ఇతర దేశాలకూ వ్యాపించింది. -
టీ బ్యాగ్స్... చర్మానికి మేలైన పోషణ...
చర్మసౌందర్యానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి అనుకుంటారు చాలా మంది. కానీ, సమయం లేదనో, తప్పనిసరి అనో హడావిడిగా పనులు ముగించేస్తుంటారు. ఆ తర్వాత తొందరపడ్డామే అనుకుని బాధపడుతుంటారు. చిన్నవే అయినా సౌందర్యపోషణలో తరచూ చేసే కొన్ని తప్పులను ఇలా సవరించుకోవచ్చు.. {Xన్ టీ తాగుదామని తెచ్చుకొని, నచ్చక ఆ బ్యాగ్స్‌ని పడేస్తుంటారా? టీ బ్యాగ్స్‌ని పడేయకుండా ఈ సారి వాటిలో కొన్నింటిని టబ్ నీళ్లలో వేసి, అందులో కాసేపు మీ పాదాలను ఉంచండి. పాదాలు రిలాక్స్ అవుతాయి. మురికి వదిలి, పై చర్మం నునుపుగా మారుతుంది.హెయిర్కలర్ని ఉపయోగిస్తున్నారా? అయితే ముందుగా ప్యాచ్‌టెస్ట్ చేసుకోండి. మీరు ఏ రంగైతే జుట్టుకు వేసుకోవాలనుకుంటున్నారో దానిని కొద్దిగా చెవి వెనుకభాగంలో రాసి చూడండి. 24 గంటల పాటు అలాగే వదిలేయండి. చర్మంపై దురద, దద్దుర్లు లేవంటే మరుసటి రోజు ఆ కలర్ ని నిరభ్యంతరంగా వాడవచ్చు. కలర్ వేసుకున్నాక చర్మసమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఇదో చిన్న టెక్నిక్. రోజులో ఎక్కువ గంటలు లిప్‌స్టిక్‌తో ఉండక తప్పనిసరా? అయితే, లిప్‌స్టిక్ తొలగించిన ప్రతీసారి స్వీట్ ఆల్మండ్ ఆయిల్‌ని దూది ఉండతో తీసుకొని, పెదాలకు సున్నితంగా రాయండి. దీని వల్ల లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు పెదాల చర్మాన్ని దెబ్బతీయకుండా కాపాడుకోవచ్చు. మీ చర్మం మొటిమల వల్ల జిడ్డుగా, మరింత నల్లగా కనపడుతుందా? ఈ సమస్యకు విరుగుడుగా ఫేస్‌వాష్ నుంచి మేకప్ వరకు అన్నీ ఆయిల్ ఫ్రీ ఉత్పత్తులను ఉపయోగించండి. అలాగే, ప్రతి రోజూ ఉదయాన్నే మగ్ గోరువెచ్చని నీటిలో మూడు - నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ముఖాన్ని శుభ్రపరచండి. చర్మం తరచూ పొడిబారుతోందా? ఆవనూనెను శరీరమర్దనలో ఉపయోగిస్తారు. చర్మం పగుళ్లు, పిగ్మెంటేషన్ వంటివి నివారిస్తుంది. వారానికి ఒకసారి ఆవనూనెతో ముఖాన్ని, దేహాన్ని మర్దన చేసుకుంటే ఒత్తిడి నుంచి రిలీఫ్ కలుగుతుంది. -
‘అధర’హో...
లిప్‌స్టిక్ వేసుకునే ముందు పెదాలను శుభ్రం చేసుకోవాలి. అంటే స్క్రబ్ చేసి వాటిపై ఉండే డెడ్సెల్స్ను తొలగించాలి. తర్వాత వాటిపై పెట్రోలియం జెల్లీ లాంటి లిప్‌బామ్ అప్లై చేశాక మీకు నచ్చిన రంగు లిప్‌స్టిక్ వేసుకుంటే పెదవులు పగిలినట్టు కనిపించకుండా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇప్పుడు మార్కెట్లో అన్ని రంగుల లిప్స్టిక్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ధరించే దుస్తుల రంగు లిప్‌స్టిక్‌ను ఎంచుకోవచ్చు. కానీ అది మీ స్కిన్‌టోన్‌కు సరిపోయేలా ఉంటేనే మరింత అందంగా కనిపిస్తారు. ఎందుకంటే కొందరికి ముదురు రంగు లిప్స్టిక్స్ నప్పినట్టు కనిపించవు. వేసుకున్న లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు లిప్‌బామ్ రుద్దిన కింది పెదవికి మధ్యభాగంలో లిప్‌స్టిక్‌ను అప్లై చేయిలి. తర్వాత రెండు పెదవులను కంప్రెస్ చేస్తే అది పై పెదవికి అందంగా అంటుతుంది. అప్పుడు ఒక టిష్యూపేపర్‌ని ఆ లిప్‌స్టిక్‌పై అద్ది మరో కోటింగ్ వేయాలి. అలా చేస్తే రంగు గాఢంగా చక్కగా కనిపించడంతో పాటు రోజంతా పెదవులు తాజాగానూ కనిపిస్తాయి. {బాండెడ్ లిప్‌స్టిక్స్‌ను ఎంచుకుంటే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే తక్కువ ధరలో దొరికే లిప్‌స్టిక్స్‌లో రసాయనాల వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాగే లిప్‌స్టిక్ వేసుకున్నాక లిప్ గ్లాస్ రాసుకుంటే పెదవులు మెరుస్తుంటాయి. అలాంటి లిప్గ్లాస్ల విషయంలోనూ జాగ్రత్తగా వహించాలి. రంగు రంగుల లిప్గ్లాస్ల కంటే కలర్లెస్ది ఎంచుకోవడం మంచిది. -
బ్యూటిప్స్
పార్టీలు కానీ పండుగలు కానీ వచ్చాయంటే అమ్మాయిలు వేసుకునే మేకప్‌లో తప్పకుండా లిప్‌స్టిక్ ఉండాల్సిందే. యువత స్మైల్ వెనుక ఉండే కొండంత కాన్ఫిడెన్స్ ఈ లిప్స్టిక్కే అంటున్నారు బ్యూటీషియన్లు. మరి అలాంటి వాటిలో జాగ్రత్తలు, చిట్కాలు పాటించకపోతే ఎలా? అందుకే ఇవి.. -
లిప్‌స్టిక్...
మెట్రో కథలు షూటింగ్ నుంచి వస్తున్నారా? డోర్ తీస్తుంటే అడిగింది. అబ్బే... లేదండీ... మేకప్ ఉన్నట్టు అనిపిస్తేనూ... నవ్వుతూ డోర్ తీసుకుని లోపలికి వచ్చింది. లోపల రెండు ఫొటోలు అలౌ చేస్తామన్నారు. కొడుకుదీ మనవరాలిదీ వేలాడదీద్దామనుకుంది. కాని మనసొప్పలేదు. ఇద్దరు నటుల ఫొటోలు అమర్చుకుంది. సినిమా వాళ్లు కాదు. నాటకాల వాళ్లు. తనకు అన్నం పెట్టిన గురువులు. ఏ.సి. ఆన్ చేసింది. మళ్లీ మనసు మార్చుకుని ఆఫ్ చేసి కర్టెన్లు తీసి విండో డోర్‌ను స్లైడ్ చేసింది. ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. వేడి తగ్గలేదు. కాని గాలి మాత్రం చనువుగా వచ్చి తాకుతూ ఉంది. నుదుటిని... కళ్లను... పెదాలను... పెదాల మీద ఉన్న లిప్స్టిక్నూ. టొమాటో కలర్‌ది. ముందు నుంచి అదే అలవాటు. మూడు నెలలైంది ఏదైనా షూటింగ్ చేసి. ఇంకో నెల దాకా కూడా ఏదీ ఉన్నట్టు కనిపించడం లేదు. ఇద్దరు ముగ్గురు డెరైక్టర్లకు కాల్ చేసింది. అయ్యో.. అమ్మా... మీరు చేయాలా... మీకు యాప్ట్ అయ్యే కేరెక్టర్ ఉంటే మిమ్మల్ని దాటి పోనిస్తామా... అందరూ అదే చెప్పారు. నిజంగానే చెప్పారు. అందరికీ తనంటే ఇష్టమే. టేకులు తినదు. న్యూసెన్స్ చేయదు. ముఖ్యంగా ప్రామ్టింగ్ అవసరం లేకుండా ఒత్తులూ పొల్లులూ ఎగరకొట్టకుండా డైలాగ్ చెప్పగలిగే అచ్చ తెలుగు ఆర్టిస్టు. నిజమే కానీ షూటింగ్ లేకుండా ఉంటే విసుగ్గా ఉంటుంది. మేకప్ వేసుకోకపోయినా విసుగ్గా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా లిప్‌స్టిక్ పూసుకోకపోతే చాలా విసుగ్గా ఉంటుంది. అందుకే కొద్దిపాటి మేకప్‌తో ఉండటం అలవాటు. పడుకోబోయే ముందు తప్ప కొంచెం లైట్‌గా అయినా లిప్‌స్టిక్ వేసుకొని ఉండటం అలవాటు. మీ అమ్మకు ఇదేం అలవాటండీ అందట కోడలు ఒకరోజు. చెప్పలేక చెప్పలేక చెప్పాడు. నవ్వి ఊరుకుంది. కొడుకు పెళ్లి అయ్యేవరకు చాలా చిన్న ఫ్లాట్‌లో ఉండేది. పేరుకు టూ బెడ్రూమ్ కాని ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టి కూడా ఉండదు. పెళ్లికి ముందే కొంచెం అవస్థలు పడి పెద్ద ఫ్లాట్ కొంది. మరేం చేయడం? వయసులో ఉన్నప్పుడు పేమెంట్స్ లేవు. పేమెంట్స్ పెరిగినప్పుడు వయసు లేదు. ఇప్పుడైనా గుడ్‌విల్ పని చేయబట్టి ఒకరిద్దరు నిర్మాతలు కాస్త చేయి వేయబట్టి సాధ్యమైంది. మీ అమ్మకు ఆ నిర్మాతలు అంత క్లోజా ఏమిటండీ అందట కోడలు. ఆ మాట మాత్రం చెప్పలేదు. షూటింగ్ ఉంటే ఉదయాన్నే వెహికల్ వస్తుంది. మళ్లీ రాత్రి దింపేసి పోతుంది. మేకప్ బాయ్ వస్తాడు. అటెండెంట్‌గా ఇంకో కుర్రాణ్ణి పెట్టుకుంది. నిజంగా వీళ్లను మోయలేదు. కాని ఇంత హంగామా చేస్తే తప్ప పాత్ర పుట్టదు. వీళ్లుగాక సీనియర్ ఆర్టిస్టనీ నాటకాల బ్యాక్‌గ్రౌండ్ ఉందనీ కొత్త డెరైక్టర్లు వచ్చి పోతుంటారు. కథలు చెప్తుంటారు. కాస్టింగ్ ఏజెంట్లు వస్తుంటారు. కమిషన్లు చెబుతుంటారు. సాటి ఆర్టిస్టులు- ఆడ సరేగాని మగ కూడా వచ్చి కాసేపు కూర్చుని పోతుంటారు. ఇల్లు అన్నపూర్ణా స్టుడియోలాగుందండీ అందట ఒకరోజు. ఆ మాట అయినా ఎలా చెబుతాడు? ఎలా ఉన్నారు అత్తయ్యా... ఏం చేయమంటారు అత్తయ్యా... కోడలు అడిగిన పాపాన పోలేదు. తనూ బలవంతపెట్టలేదు. ఏం బలవంత పెడుతుంది? వేలు ఖర్చు పెట్టినా అంతంత మాత్రమే చదివాడు. అంతంత మాత్రపు ఉద్యోగమే తెచ్చుకున్నాడు. సంబంధం వెతకడం ఒక కష్టం. మనుషులు వచ్చిపోయే ఇంటికి కోడల్ని తీసుకురావడం ఇంకా కష్టం. కాకుంటే ఒకటి. మూడో నెలకంతా నెల తప్పాను అత్తయ్యా అంది. ఆ మాట చాలు ఎన్ని తప్పులు చేసినా క్షమించేయడానికి. మనవరాలు పుడితే ఆర్భాటంగా బారసాల చేసిందిగాని వచ్చినవాళ్లంతా అచ్చు నానమ్మ నోట్లో నుంచి ఊడిపడింది అంటుంటే కాస్త భయపడింది. అవును. అచ్చు తనలాగే ఉంది. పెద్ద పెద్ద కళ్లు. మంచి కనుబొమలు. రంగు. ముఖ్యంగా పెదాలు.... అవన్నీ ఉంటే ఏమవుతుందో తెలుసు. దూరంగా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్న కొడుకు వైపు చూసింది. చూస్తూ గమనించింది.ఎవరి పోలిక ఉంది వాడిలో? పెళ్లైన మూడేళ్లకు పారిపోయిన భర్త. చచ్చిందా బతికిందా పుట్టిన పిల్లాడు ఉన్నాడా పోయాడా పట్టించుకోని భర్త. అతని పోలిక ఉందా వాడిలో. పద్నాలుగేళ్ల పిల్ల... చదువుకుంటా నాన్నా నాకిష్టం లేదు నాన్నా అంటున్నా స్టేజ్ ఎక్కించిన తండ్రి... రంగు పూయించిన తండ్రి... సారా కోసం లిప్‌స్టిక్ వేయించిన తండ్రి.... ఎవడికో ఒకడికి కట్టబెట్టేస్తే తన పని అయిపోతుందనుకున్న తండ్రి... ఆ తాత పోలిక ఉందా వాడిలో? భయమేసింది.ఎందుకు భయం? తను ఉంది. ఆ పోలికలు అంటకుండా తనే చక్కగా పెంచుకుంటుంది. బాగా చదివించుకుంటుంది. అవసరమైతే ఇంకా ఎక్కువ నటించి ఇంకా ఎక్కువ పాత్రలు చేసి ఆర్థికంగా ఏ ఇబ్బందీ రాకుండా స్థిరపరుస్తుంది. అలా అనుకునే బతికింది. మనవరాలే లోకం. మనవరాలికి నానమ్మ లోకం. ఇదేమిటండీ... కన్నవాళ్లు అంత కాకుండా పోతున్నారేమిటి దానికి అందట ఒకరోజు. నవ్వుతూ నవ్వుతూనే చెప్పాడు. మొన్నా మధ్య గుడికో మరెక్కడికో వెళ్లి వచ్చింది. వస్తూ వస్తూ ఎనిమిదో పుట్టినరోజు రాబోతున్నది కదా అని మనవరాలికి కొత్త డ్రస్సు కొనుక్కుని వచ్చింది. అది తొడిగించి చూసి మెటికలు విరిచి సంబరపడాలనుకుంటూ వచ్చింది. వచ్చే సరికి ఇల్లు ఇల్లులా లేదు. అంత చిందర వందరగా ఉంది. రాద్ధాంతం జరిగినట్టుగా ఉంది. కొడుకూ కోడలూ... ఏడుస్తూ మనవరాలు... నానమ్మా... పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టేసుకుంది. ఏమైంది తల్లీ... ఏమైంది... మేకప్ కిట్ తెరిచి లిప్‌స్టిక్ వేసుకోవడానికి చూసిందట. అది గమనించి వాళ్లమ్మ చావ గొట్టిందట. అడ్డుకోబోయిన భర్తను నానామాటలు అందట. ఇంట్లో ఆల్రెడీ ఒక టక్కులాడి ఉంది. ఇంకో టక్కులాడిని తయారు చేయబోతారా? అందట. ఈ మాటలు కాదు. నిజంగా ఏమందో. మార్చి మర్యాదగా చెప్పాడు. ఇవన్నీ ఇక మానెయ్యమ్మా. ఇంట్లో ఉండు. తిరక్కు. ఆ మేకప్ కిట్ తీసి బయట పారెయ్... చూసింది. భర్త పారిపోయినప్పుడు సంవత్సరం పిల్లవాడు. రాత్రి నాటకాలు. మేకప్ వేసుకొని లిప్‌స్టిక్ పూసుకుని సరిగ్గా స్టేజ్ మీదకు వెళ్లేసమయానికి ఏడుపు మొదలుపెడితే ఓపలేక బుగ్గలంతా ముద్దులు పెడితే ఎర్రటి మరకలంతా పడేవి. సినిమా నాటికలు వేసేప్పుడు బ్లౌజ్ లేకుండా పవిట గట్టిగా కట్టి పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లో... డాన్స్ చేస్తుంటే జనం ఆ గుండెల్ని చూడ్డానికి ఏడ్చేవాళ్లు. తను వాటిల్లో ఉన్న పాలు ఇవ్వడానికి ఏడ్చేది. ఇన్నాళ్లు పెంచడానికి చదివించడానికి ఫ్లాట్ కొని ఉంచటానికి అవసరాలను ఆదుకోవడానికి పనికొచ్చిన లిప్‌స్టిక్ ఇప్పుడు అక్కర్లేదంటున్నాడు. నవ్వింది. వస్తున్నారా?.... వెనక్కు తిరిగి చూసింది. ఇందాక పలకరించిన పక్క రూమ్మేట్. డోర్ దగ్గర నిలుచుని ఉంది. డిన్నర్‌కు టైమ్ అయ్యిందిగా... పిలుస్తూ ఉంది. అప్పటికే చీకటి పడిపోయింది. టైమ్ ఏడై ఉంటుంది. ఇక్కడ ఏడుకే డిన్నర్ ముగించేయాలి. ఆ తర్వాత ఏదైనా కాలక్షేపం. చేతులు కడుక్కుని, ముఖం వాష్ చేసుకుని, కొంచెం పౌడర్, లైట్‌గా లిప్‌స్టిక్ టచ్ ఇచ్చి బయలు దేరింది. నాలుగైదు ఎకరాల ఆవరణ అది. ఊరికి కాస్త దూరంగా ప్రశాంతంగా. మీ గురించి విన్నాను... నవ్వింది. ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడున్నాడు? తెలీదు. ఫ్లాట్ అమ్మేశాను. నీ దారి నువ్వు చూస్కో అని చెప్పాను. వచ్చింది బ్యాంక్‌లో డిపాజిట్ చేసి మిగిలింది ఈ హోమ్‌కు కట్టి ఇక్కడకు వచ్చేశాను. మనవరాలు గుర్తుకు రావడం లేదా? వస్తుంది. ఏం చేస్తాం. తప్పదు కదా. పాత్ర ముగిసిందని తెలిశాక స్టేజ్ మీద ఎంత బ్యాడ్ ఆర్టిస్టూ నిలవదు. దిగిపోతుంది... ఒక్కోరూమ్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తూ కనిపిస్తున్నారు. తన వయసు వాళ్లు. తనలాంటివాళ్లు. అన్నట్టు సినిమాల్లో యాక్ట్ చేస్తారా? అమ్మబాబోయ్. నాకు రాదండీ... మీరంటే ఆర్టిస్టు... ఏం లేదండీ. కొంచెం లిప్‌స్టిక్ వేసుకుని నిలబడండి. చాలు. అంతేనా? అంతే... ఇద్దరూ హాయిగా నవ్వుకుంటూ మంచి డిన్నర్ చేయడానికి డైనింగ్ హాల్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయారు. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
లిప్‌స్టిక్ వేసి.. పెర్ఫ్యూమ్ రాసి
ముంబయి: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. షీనా బోరాను హత్య చేసిన అనంతరం ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియా ... మృతదేహానికి లిప్ స్టిక్ రాయడంతో పాటు తలను కూడా అందంగా దువ్వి ముస్తాబు చేసిందట. ఈ విషయాన్ని షీనా కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు వెల్లడించారు. ఎటువంటి చెడువాసన రావద్దని ఆలోచించిందే ఏమో కానీ, షీనా మృతదేహానికి పెర్ఫ్యూమ్ కూడా రాసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రాయ్ గఢ్ తీసుకెళ్లి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ తో కలిసి దహనం చేసింది. అయితే మార్గమధ్యలో పోలీసులు తనిఖీల్లో భాగంగా కారులో ఉన్న షీనా బోరా గురించి ప్రశ్నించగా ఆమెకు ఆరోగ్యం బాగాలేదని నిద్రపోతుందని ఇంద్రాణి చెప్పినట్లు ఓ అధికారి వెల్లడించారు. షీనాను హత్య చేసిన రోజు (ఏప్రిల్ 24, 2012) వర్లీలోని ఇంద్రాణీ ఇంట్లోనే షీనా మృతదేహాన్ని ఉంచారు.మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని కారులో తరలిస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు లిప్ స్టిక్, పెర్ఫ్యూమ్ ఆమెకు రాయడం తల దువ్వడం వంటివి చేసినట్లు పోలీసుల విచారణలో ఇంద్రాణీ వివరించింది. కాగా పోలీస్ కస్టడీ నేటితో ముగియనుండటంతో ఇంద్రాణీ ముఖర్జియాను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. షీనా హత్య తర్వాత మెయిల్ ఐడీ క్రియేట్.. షీనా హత్య అనంతరం మృతదేహం ఆనవాళ్లు కూడా గుర్తించడం కష్టమని భావించిన ఇంద్రాణీ.. ఓ ఉద్యోగికి చెప్పి కూతురి పేరిట హాట్ మెయిల్ అకౌంట్ క్రియేట్ చేయించింది. అయితే షీనా అమెరికాలో చాలా బిజీగా ఉన్నట్లు ఆ ఉద్యోగికి చెప్పి అకౌంట్ ఓపెన్ చేయించి.. ఆ ఐడీ నుంచి చాలా మందికి ఇంద్రాణీ ఈమెయిల్స్ పంపినట్లు అంగీకరించింది. -
ముడతల్ని మడిచేయండి
బ్యూటిప్స్ పెదవులు అందంగా ఉండాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. అందుకు ఒక్క లిప్‌స్టిక్ రాసుకుంటేనే సరి కాదు కదా. వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. కాబట్టి పెదాలకు లిప్‌స్టిక్, లిప్‌బామ్ లాంటివి రాసుకునే ముందు స్క్రబ్ చేసుకోవడం మంచిది. అందుకో మంచి ఇంటి చిట్కా. మెత్తని కాఫీ పౌడర్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని పెదాలకు మర్దన చేసుకుంటూ రాసుకోవాలి. ఓ 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కొని వెంటనే కొబ్బరి నూనె లేదా ఏదైనా నేచురల్ లిప్‌బామ్ రాసుకోవాలి. దాంతో పెదాలు మృదువుగా తయారవుతాయి. చిన్న వయసులోనే ముఖంపై ముడతలు రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతోంది. ఆ ముడతలు రావడానికి అనేక కారణాలున్నాయి. మానసిక ఒత్తిడి, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, పొడి చర్మం ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి నుంచి సత్వర ఉపశమనం పొందాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి నెయ్యి, బాదం నూనె/ కొబ్బరి నూనె కలిపిన మిశ్రమాన్ని రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అరచేతుల్లాగే వాటి వెనుక భాగం (నకల్స్) కూడా అందంగా మెరవాలని అందరూ కోరుకుంటారు. మరి దానికి పాటించాల్సిన చిట్కా ఒకటుంది. అదే చేతులను నానబెట్టడం. ఓ గిన్నెలో గోరువెచ్చని నీళ్లు పోసి అందులో 5-6 చుక్కల గ్లిజరిన్, కొద్దిగా రోజ్‌వాటర్, ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో రెండు చేతులను 10-15 నిమిషాల పాటు పెట్టి వెంటనే వేరే నీటితో కడిగేసుకోకుండా టవల్‌తో తుడుచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో చేతులను కడుక్కోవాలి. దాంతో నల్లగా కనపడే నకల్స్ కూడా అందంగా అరచేతి రంగులోకి వస్తాయి. -
ఆ వ్యామోహం తగ్గించుకున్నా..!
‘‘నాకు లిప్‌స్టిక్ అంటే చాలా ఇష్టం. నేను ఏ ఫంక్షన్‌కు వెళ్లినా నా పెదాలకు లిప్‌స్టిక్ మాత్రం తప్పనిసరి’’ అని బాలీవుడ్ అందాల నటి హ్యూమా ఖురేషీ తన అందం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు చెప్పారు. ఫిట్నెస్ గురించి తీసుకునే జాగ్రత్తలు గురించీ మాట్లాడారు. ‘‘వృత్తిరీత్యా మాకు మేకప్ తప్పనిసరి. ముఖం అందంగా ఉంటే సరిపోదు కదా... దానికి తగ్గట్టే శరీరాకృతి కూడా ఉండాలి. అందుకే ‘బద్లాపూర్’ సినిమాలో అంత అందంగా కనిపించానంటే నా ట్రైనర్ విలాయత్ గొప్పదనమే. నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వాటిని దూరం పెట్టాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. నాకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం. కానీ ఇప్పుడిప్పుడే ఆ వ్యామోహాన్ని తగ్గించుకొని, డైట్ విషయంలో జాగ్రత్త వహిస్తున్నా’’ అని హ్యూమా చెప్పారు. -
వెజ్జా... నాన్‌వెజ్జా?
అధరాలకు అందాలద్దే లిప్‌స్టిక్ వెజ్జా? నాన్‌వెజ్జా? ఇదేం ప్రశ్న... అదేమి తినేది కాదు కదా అనుకుంటున్నారా! అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం లిప్‌స్టిక్ దేనికిందకు వస్తుందో చెప్పితీరాలంటోంది. సౌందర్య సాధానాలతో పాటు సబ్బు, షాంపూ, టూత్‌పేస్ట్ లాంటి వాటిపై కచ్చితంగా అదేంటో చెప్పే సింబల్ ఉండాలట. జంతువుల నుంచి తీసిన పదార్థాలేమైనా (నూనె, కొవ్వు, ఎముకల పొడి తదితరాలు) వాడితే సదరు ఉత్పత్తిపై ఎరుపు లేదా గోధుమ రంగు చుక్క ఉండాలని, పూర్తిగా శాఖాహార సంబంధ పదార్థాలే వాడితే ఆకుపచ్చ రంగు చుక్క ఉండాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్ 16, 2014న ఒక నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై రెకిట్ బెన్కిసర్ అనే కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తినే పదార్థాల విషయంలో ఇలా అడిగితే ఓకేగాని, సౌందర్య సాధనాలు, సబ్బుల లాంటి వాటికి ఇలా అడగడంలో అర్థం లేదని వాదిస్తోంది. నోటిఫికేషన్‌ను కొట్టేయాలని కోరింది. మే 18లోగా స్పందించాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం కేంద్రానికి నోటీసు జారీ చేసింది. -
కళకు మేకప్
చేయి తిరిగిన చిత్రకారులకు.. సప్తవర్ణాల పాలెట్ ఉండాలి. ఆ రంగులను కాన్వాస్‌పై రంగరించడానికి వేళ్ల మధ్య ఒదిగిపోయే కుంచె కావాలి. మనసెరిగిన కళాకారులకు ఇవేవీ ఉండాల్సిన అవసరం లేదు. లిప్‌స్టిక్‌నే కుంచెగా మార్చేయగలరు. మేకప్ కిట్‌తో వేకప్ సీనరీ సృష్టించగలరు. ఫ్రెంచ్ చిత్రకారిణి 62 ఏళ్ల డామినిక్ పాలిన్ ఈ కోవకు చెందినవారే. డాక్టర్‌గా సేవలందిస్తూనే.. తన పేషంట్స్ ముఖాల్లోని బాధను చిత్రాల్లో చూపించారు. మూడు వారాల కిందట ఇండియాకు వచ్చిన డామినిక్ ఇక్కడ తాను చూసిన, తనకు నచ్చిన, అర్థం చేసుకున్న విషయాలను పెయింటింగ్స్‌గా మలిచారు. ఇటీవల నగరంలోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో వీటిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ..:: ఓ మధు కళాకారుల ఇంట్లో పుట్టాను. అమ్మానాన్న, తాత, అంకుల్స్ అందరూ కళాకారులే. అమ్మ వేసిన పెయింటింగ్స్ చూస్తూ పెరగటం వల్లనేమో.. మూడేళ్ల వయసు నుంచే పెయింటింగ్ నా జీవితంలో భాగమైంది. డాక్టర్ అయిన తర్వాత కూడా కుంచె విడిచిపెట్టలేదు. నా ఆసక్తి, అభిరుచి కోసమే బొమ్మలు వేస్తూ వచ్చాను. 2007 వరకూ ప్రదర్శనలు ఇవ్వలేకపోయాను. తర్వాత సే్నిహ తుల ప్రోత్సాహంతో మొదటిసారి పారిస్‌లో నేను గీసిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశాను. అప్పట్నుంచి వివిధ దేశాల్లో చిత్ర ప్రదర్శనలిస్తున్నాను. ఎలా ఉంటుందని.. ఇండియాకు రావడం ఇది తొమ్మిదో సారి. మూడు వారాలైంది ఇక్కడ అడుగుపెట్టి. ఎన్నో ప్రాంతాలు చూశాను. రోజుకు 14 నుంచి 16 గంటల పాటు పని చేసి.. పెయింటింగ్స్ వేశాను. వాటినే ఇక్కడ ప్రదర్శనకు ఉంచాను. ఇవన్నీ మేకప్ కోసం వాడే రంగులతో వేసినవే. ఎందుకలా వేశారని చాలామంది అడుగుతున్నారు. నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ ఒక పెద్ద మేకప్ బాక్స్ తెచ్చి గిఫ్ట్‌గా ఇచ్చింది. వాటి టెక్స్చర్, కలర్స్‌తో డ్రాయింగ్ వేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. లిప్స్టిక్స్, పౌడర్స్, ఐషాడోస్.. ఇలా మేకప్ కిట్‌లో ఉన్న రంగులతోనే ఈ పెయింటింగ్స్ వేశాను. వాటినే కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించాను. హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి. ఇక్కడి గోల్కొండ కోట చూస్తే తెగ ముచ్చటేసింది. మంచి మనుషులు.. ముంబై, రుషికేశ్, గోవా, తమిళనాడు ఇలా ఈ మూడు వారాల్లో చాలా ప్రాంతాలు బుల్లెట్ మీద తిరిగాను. ఇక్కడ ప్రదేశాలే కాదు, మనుషులు.. వారి మనసులు కూడా నాకు ఎంతగానో నచ్చాయి. భారత్‌లోని స్వేచ్ఛావాతావరణం నాకు బాగా ఇష్టం. మా దేశంలో పరిస్థితులు ఇందుకు భిన్నం. ఇంత స్వేచ్ఛగా ఉండలేం. అక్కడికి, ఇక్కడికి ఉన్న ముఖ్య తేడా కమ్యూనికేషన్. ఇక్కడ ఏదైనా అడిగితే ఎవరైనా ఎంతో బాధ్యతగా జవాబు చెబుతారు. ఎంతో సహాయం చేస్తారు. అదే ఫ్రాన్స్‌లో ఏదైనా అడ్రస్ అడిగితే వారిచ్చే బదులు చాలా విసురుగా ఉంటుంది. ఫ్రాన్స్‌లో కళాకారులకు, కళాభిమానులకు కొదవలేదు. ఇక్కడి కళాకారులను ఇంకా కలుసుకోలేదు. ఫ్రాన్స్, ఇండియా మధ్య సాంస్కృతిక సంబంధాలు పటిష్టం చేయాలనుకుంటున్నాను. ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి -
లిప్‌స్టిక్ వాడుతున్నారా?
పెదాలకు రంగు వేసుకొని ముచ్చటపడేవారు చాలామందే ఉంటారు. కానీ వారి చర్మరంగు, దుస్తుల మ్యాచింగ్ ఇవేవీ పట్టించుకోకుండా లిప్‌స్టిక్ వాడితే అందంగా ఉండటానికి బదులు ఎబ్బెట్టుగా ఉంటుంది. వేసవిలో లిప్‌స్టిక్ వాడేవారికి కొన్ని సూచనలు... ముదురు రంగులకు దూరం: పెదవులకు ముదురురంగు లిప్‌స్టిక్ వాడితే పెదాలు చిన్నగా కనిపిస్తాయి. పెదవుల రంగులోనే కనిపించాలంటే న్యూడ్ లేదా క్లియర్ షేడ్స్ గల లిప్‌స్టిక్‌ను ఎంచుకోవాలి. అప్పుడే పెదవులు సహజమైన కాంతితో కనిపిస్తాయి. షాడో తప్పనిసరి: ముదురు గోధుమ రంగు, వాటర్‌ఫ్రూఫ్ ఐలైనర్‌తో కిందిపెదవి అంచు వద్ద చిన్న లైన్ గీయాలి. తర్వాత లిప్‌స్టిక్ వేసుకోవాలి. ఈ చిన్న మార్క్ వల్ల పెదవులు పెద్దగా, మరింత వంపుతిరిగినట్టు అందంగా కనిపిస్తాయి. గ్లాసీ లిప్‌స్టిక్: ఎంచుకున్న లిప్‌స్టిక్‌తో పెదవులను తీర్చిదిద్దాక అలాగే వదిలేస్తే జీవం కోల్పోయి కనిపిస్తాయి. పైన కాంతిని ఇచ్చే షైనీ ఫినిష్‌తో టచప్ చేయాలి. పగిలిన పెదవులు: పెదవులపై చర్మం పొడిబారితే మృతకణాలు తేలి, లిప్‌స్టిక్ వేసినా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మెత్తటి టూత్‌బ్రష్‌తో కొద్దిపాటి ఒత్తిడిని కలిగిస్తూ రుద్దాలి. తర్వాత నీటితో కడిగి, లిప్‌బామ్ రాయాలి.