ముద్దొచ్చే చిత్రాలు... | This Artist's Kisses Are Literally a Work of Art | Sakshi
Sakshi News home page

ముద్దొచ్చే చిత్రాలు...

Published Sun, Aug 28 2016 1:55 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

ముద్దొచ్చే చిత్రాలు...

ముద్దొచ్చే చిత్రాలు...

కాన్వాస్‌పై ఓ చిత్రకారిణి.. ముద్దుల వర్షం కురిపిస్తోంది. అధరాల అందాలను కళాఖండాలుగా మలుస్తోంది. ముఖారవిందానికి మరింత అందాన్ని ఇచ్చే లిప్‌స్టిక్‌నే తన పెయింట్‌గా మార్చుకుని ముద్దులతో విభిన్న రూపాలకు ప్రాణం పోస్తోంది. టొరొంటోకు చెందిన చిత్రకారిణి మేకప్ ఆర్టిస్ట్ అలెక్సిస్ ఫ్రేజర్ కుంచెకు బదులు.. అధరాలను ఆధారం చేసుకుంది. కాన్వాస్‌పై కళారూపాలను సాక్షాత్కరింపజేసేందుకు ఏకేఏ లిప్‌స్టిక్ లెక్స్‌ను వినియోగిస్తూ అద్భుత కళాఖండాలను రూపొందిస్తోంది.

తాను గీసే చిత్రాన్ని బట్టి సరైన స్థానంలో సరిగా పేర్చే లిప్‌స్టిక్ ప్రింట్లే కళాభిమానుల మనో ఫలకంపై చెరగని ముద్రలు వేస్తున్నాయి. ఆయిల్ పెయింటింగ్‌లో స్పెషలిస్ట్ అయిన ఫ్రేజర్.. ‘కిస్ ప్రింట్ పాయింటలిజమ్’లోనూ ప్రత్యేకతను సాధించింది. తన అధరాలకు రంగును అద్దుకుని కాన్వాస్‌పై పెట్టే ముద్దులే కళారూపాలుగా మారుతున్నాయి. ఆమె రూపొందించే చిత్రాల్లో అధిక శాతం, తన పెదాలకు పూసుకున్న లిప్‌స్టిక్ ముద్దులతో సాక్షాత్కరించినవే. ఏకేఏ లిప్‌స్టిక్ లెక్స్ తో చిన్న తరహాలో సెలబ్రిటీల చిత్రాలను రూపొం దించేందుకు ఫ్రేజర్‌కు కొన్ని గంటల సమయం పడితే పెద్ద తరహాలో చిత్రాలకు మాత్రం రోజుల తరబడి సమయం పడుతుంది.

ఒక్కోసారి ప్రత్యేక చిత్రాలను రూపొందించాలనుకున్నప్పుడు వారం వరకూ కూడా ఆమె కాన్వాస్‌పై ముద్దులు కురిపించాల్సి వస్తుందట. అంతేకాదు అటువంటి పోట్రైట్ల కోసం కొన్ని ట్యూబ్‌ల కొద్దీ లిప్‌స్టిక్ వాడాల్సి ఉంటుందని చెప్తోంది. అందుకు అతి పెద్ద నిదర్శనం 2014లో ఆమె రూపొందించిన మార్లిన్ మాన్రో కాన్వాస్ కళాఖండమే. దీనికోసం ఆమె నాలుగు రోజుల సమయాన్ని వెచ్చించడంతో పాటు, రెండు ట్యూబ్‌ల లిప్‌స్టిక్‌ను వాడిందట.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement