'టాయిలెట్‌లో ముద్దు ఎవరు పెట్టారబ్బా..?' | How Did A Lipstick Mark End Up Inside A Toilet Bowl? | Sakshi
Sakshi News home page

'టాయిలెట్‌లో ముద్దు ఎవరు పెట్టారబ్బా..?'

Published Fri, Jan 12 2018 1:13 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

How Did A Lipstick Mark End Up Inside A Toilet Bowl? - Sakshi

ట్విటర్‌ను ఓ ప్రశ్న వేధిస్తోంది. ఆ ప్రశ్న విన్నాక సిల్లీగా అనిపించినా.. నిజంగానే ఆ పని ఎవరు చేసుంటరబ్బా అని అనుకోవడం మాత్రం పక్క. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటని అనుకుంటున్నారా? టాయిలెట్ బేసిన్‌ లోపలి అంచుకు ముద్దెవరు ఇచ్చారు? ఇది నిజానిక ప్రశ్న కాదు. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత మాత్రం ఇదే ప్రశ్న వస్తుంది. ఆ దృశ్యం ఏమిటంటే ఓ టాయిలెట్‌లోని సిట్టింగ్‌ బేసిన్‌ లోపలి అంచుకు పింక్‌ లిప్‌స్టిక్‌ మార్క్‌ కనిపించింది. సాధారణంగా టాయిలెట్‌ అనగానే గబ్బు అనే ఆలోచన వస్తుంది.

ఎవరు ఎంత శుభ్రం చేసినా టాయిలెట్‌ను టాయిలెట్‌గానే చూస్తాం తప్ప అదేదో విశ్రాంతి మందిరం అని మాత్రం అస్సలు అనుకోము. అందులోని వస్తువులను కూడా దగ్గరగా పట్టుకునే సాహసం చేయము. అలాంటిది ఓ యువతి తన అందమైన పెదాలతో గులాబీ రంగు లిప్‌స్టిక్‌ పెట్టుకొని టాయిలెట్‌ బేసిన్‌ లోపలి అంచుకు ఎలా ముద్దు పెట్టింది. ఇంత సాహసం ఆ యువతి ఎలా చేసింది. అసలు ఆ యువతి ఎవరు? అంటూ ట్విటర్‌లో నెటిజన్లు తలలు బద్ధలు కొట్టుకుంటున్నారు. ఇప్పటికే దీనికి ఓ 5వేలమంది రీ ట్వీట్‌ చేయగా పది వేల షేర్లు వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement