సాక్షి, అమరావతి: ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్, ట్విట్టర్ అకౌంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీడియాలో, సోషల్ మీడియాలో దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికలుగా ప్రభుత్వం ఖండిస్తుందన్నారు. నడుస్తున్న ప్రచారం ఎలా తప్పో సాక్ష్యాధారాలతో చూపిస్తారు. నిజమేంటో, అబద్ధం ఏంటో చూపిస్తారు. ఏపీ ఫ్యాక్ట్‌చెక్ ముఖ్య ఉద్దేశం ఇదేనని సీఎం పేర్కొన్నారు.
దురుద్దేశపూర్వక ప్రచారంమీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. దురుద్దేశ పూర్వకంగా ఈ ప్రచారం మొదట ఎక్కడనుంచి మొదలయ్యిందో దాన్ని గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఒక వ్యక్తి ప్రతిష్టను, ఒక వ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదు. వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టుపట్టించే హక్కు ఎవ్వరికీ లేదు. వ్యవస్థలను తప్పుదోవపట్టించే పనులు ఎవరూ చేయకూడదు. ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారు. వేరే కారణాలతో ఇలాంటి దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఎక్కడోచోట ముగింపు పలకాలని’’ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
చదవండి:
హైకోర్టుకు ఎస్‌ఈసీ క్షమాపణ..
చంద్రబాబు ఫ్లాప్ షో: టీడీపీలో నిరుత్సాహం
Comments
Please login to add a commentAdd a comment