కాలా జామూన్... రుమాలీ రోటీ..! | Aishwarya Rai Bachchan's purple lips at Cannes make Twitter laugh | Sakshi
Sakshi News home page

కాలా జామూన్... రుమాలీ రోటీ..!

Published Tue, May 17 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

కాలా జామూన్... రుమాలీ రోటీ..!

కాలా జామూన్... రుమాలీ రోటీ..!

అది లిప్‌స్టిక్కా.. పెయింటా? ఒకవేళ ఫంక్షన్‌కి వచ్చే ముందు ‘కాలా జామూన్’ (నలుపు రంగులో ఉండే గులాబ్ జామ్) తిని ఉంటుందా? ఏదైనా పెయింట్‌కి సంబంధించిన ఉత్పత్తిదారులు పెయింట్‌ని ఉచితంగా ఇచ్చారా? అంటూ ఐశ్వర్యా రాయ్ పెదవుల గురించి అదేపనిగా కామెంట్స్. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి ఐష్ వేసుకున్న ఫ్రాక్ అందరికీ నచ్చింది. కానీ, పెదవులకు వేసుకున్న ‘పర్పుల్ కలర్’ లిప్‌స్టిక్ మాత్రం ఐష్‌కి సూట్ కాలేదు.

దాంతో సోషల్ మీడియా ద్వారా చాలామంది వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఐష్ వాటిని పట్టించుకోలేదు. అసలు ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నప్పుడు తాను ఫ్యాషన్‌గా కనిపించడం కోసం పెద్దగా ఒత్తిడికి గురి కానని ఆమె అంటున్నారు. ‘‘నేను ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాను. ఒక నటిగా ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌గా కనిపించడానికి ట్రై చేస్తుంటాను. ఫ్యాషన్‌ని నేనో కళలా భావిస్తా. కొత్తగా ఏదైనా ట్రై చేస్తా. అది బాగుంటుందో, లేదో అని భయపడను’’ అని ఐష్ పేర్కొన్నారు.

ఈ అందాల సుందరి గురించి అలా ఉంచితే... ఆదివారం సోనమ్ కపూర్ ధరించిన తెలుపు రంగు గౌను కూడా హాట్ టాపిక్ అయ్యింది. వెనకాల ఒక మనిషి ఆ ఫ్రాక్‌ని సెట్ చేస్తూ, సోనమ్‌తో పాటు నడిస్తే కానీ, ఆమె సరిగ్గా నడవలేరు. రెడ్ కార్పెట్ పై నడిచే వరకూ నిజంగానే ఆమెకు ఓ వ్యక్తి హెల్ప్ చేశారు. కానీ, రెడ్ కార్పెట్ పై ఏ మాత్రం తడబాటు లేకుండా సోనమ్ అందంగా వాక్ చేసి, భేష్ అనిపించుకున్నారు. కొంతమంది ఆమె గౌనును ‘రుమాలీ రోటీ’ అంటూ జోక్ చేశారు.
 
షార్ట్ ఫిలిమ్ విభాగంలో తెలుగు కుర్రాడి సినిమా!
మొత్తం మీద మన భారతీయ తారల హంగామా కాన్స్ చలనచిత్రోత్సవాల్లో బాగానే సాగుతోంది. ఇప్పటికే కాన్‌‌సలో నడుస్తున్న హంగామాలో మరో కొత్త విశేషం వచ్చి చేరింది. మన తెలుగు కుర్రాడు రాజా నిషాంత్ పోతినేని దర్శకత్వం వహించిన ‘60 ఎయిట్’ అనే షార్ట్ ఫిలిమ్ కూడా అక్కడ ప్రదర్శితం కానుంది. ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తమ్ముడు - ప్రముఖ వైద్యుడు డాక్టర్ రమేశ్‌బాబు కుమారుడు, హీరో రామ్‌కు కజిన్ బ్రదరూ అయిన రాజా నిషాంత్ రూపొందించిన ఈ చిత్రం నిడివి 15 నిమిషాలు.

‘జాన్ అనే ఎనిమిదేళ్ల కుర్రాడు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురవుతాడు. ఆ కారణంగా కొద్దిపాటి స్పృహతో మిగులుతాడు. 52 ఏళ్ల వయసు వచ్చేవరకూ జీవచ్ఛవంలా బతుకుతాడు. ఆ సమయంలో తన బాల్య స్నేహితురాలు తారసపడతుంది. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది ఈ చిత్రకథ.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement