నప్పేలా లిప్‌స్టిక్‌ | Beauty tips:lip stick | Sakshi
Sakshi News home page

నప్పేలా లిప్‌స్టిక్‌

Published Sat, Jun 9 2018 12:09 AM | Last Updated on Sat, Jun 9 2018 12:09 AM

 Beauty tips:lip stick - Sakshi

పెదాలకు రంగు వేసుకొని ముచ్చటపడేవారు చాలామందే ఉంటారు. కానీ వారి చర్మరంగు, దుస్తుల మ్యాచింగ్‌ ఇవేవీ పట్టించుకోకుండా లిప్‌స్టిక్‌ వాడితే అందంగా ఉండటానికి బదులు ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే లిప్‌స్టిక్‌ వాడేవారికి కొన్ని సూచనలు...
ముదురు రంగులకు దూరం: పెదవులకు ముదురురంగు లిప్‌స్టిక్‌ వాడితే పెదాలు చిన్నగా కనిపిస్తాయి. పెదవుల రంగులోనే కనిపించాలంటే న్యూడ్‌ లేదా క్లియర్‌ షేడ్స్‌ గల లిప్‌స్టిక్‌ను ఎంచుకోవాలి. అప్పుడే పెదవులు సహజమైన కాంతితో కనిపిస్తాయి.

షాడో తప్పనిసరి: ముదురు గోధుమ రంగు, వాటర్‌ ఫ్రూఫ్‌ ఐలైనర్‌తో కిందిపెదవి అంచు వద్ద చిన్న లైన్‌ గీయాలి. తర్వాత లిప్‌స్టిక్‌ వేసుకోవాలి. ఈ చిన్న మార్క్‌ వల్ల పెదవులు పెద్దగా, మరింత వంపుతిరిగినట్టు అందంగా కనిపిస్తాయి.
గ్లాసీ లిప్‌స్టిక్‌: ఎంచుకున్న లిప్‌స్టిక్‌తో  పెదవులను తీర్చిదిద్దాక అలాగే వదిలేస్తే జీవం కోల్పోయి కనిపిస్తాయి. పైన కాంతిని ఇచ్చే షైనీ ఫినిష్‌తో టచప్‌ చేయాలి.
పగిలిన పెదవులు: పెదవులపై చర్మం పొడిబారితే మృతకణాలు తేలి, లిప్‌స్టిక్‌ వేసినా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మెత్తటి టూత్‌బ్రష్‌తో కొద్దిపాటి ఒత్తిడిని కలిగిస్తూ రుద్దాలి. తర్వాత నీటితో కడిగి, లిప్‌బామ్‌ రాయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement