Eyeliner: ఐలైనర్‌ వాడుతున్నారా.. అయితే... | Beauty Tips In Telugu: How To Apply Eyeliner | Sakshi
Sakshi News home page

Eyeliner: ఐలైనర్‌ వాడుతున్నారా.. అయితే...

Oct 6 2021 11:56 AM | Updated on Oct 6 2021 4:58 PM

Beauty Tips In Telugu: How To Apply Eyeliner - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మేకప్‌ ముఖాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతుంది. అయితే కళ్లకు పెట్టుకునే ఐలైనర్‌ మేకప్‌లో కీలకపాత్ర పోషిస్తుంది. ఐలైనర్‌ కాస్త అటూ ఇటూ అయినా మేకప్‌ మొత్తం చెడిపోతుంది. ఐలైనర్‌ లైన్‌ దాటకుండా అందాన్ని మరింతగా ఎలా పెంచుకోవచ్చో చూద్దాం... 

మార్కెట్లో వివిధ రకాలా ఐలైనర్‌లు దొరుకుతుంటాయి. అయితే మన్నికనిచ్చే కంపెనీ లేదా బ్రాండ్‌ ఐలైనర్‌ను మాత్రమే కొనాలి. ముఖ్యంగా వాటర్‌ ప్రూఫ్‌ అయ్యి ఉండేలా చూసుకోవాలి.

వాటర్‌ ప్రూఫ్‌ అయితే ఎక్కువ సమయం నిలిచి ఉండడమేగాక, కళ్లకు ఎటువంటి హానీ కలిగించదు. 

ఐలైనర్‌ వేసే ముందుకంటే ముందుగా కనురెప్పలకు ప్రైమర్‌ వేయాలి. ప్రైమర్‌ వేసిన తరువాతే ఐలైనర్‌ వేయాలి. దీనివల్ల ఐలైనర్‌ ఎక్కువసమయం ఉండడమేగాక, కళ్లు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. 

మేకప్‌ వేసే ముందు కంటికింది భాగంలో కన్‌సీలర్‌ రాయడం వల్ల మచ్చలు పోయి కళ్లు వికసించినట్లు కనిపిస్తాయి. అంతేగాకుండా ఐలైనర్‌ వేసేముందు కూడా కన్‌సీలర్‌ రాయడం మరింత మంచిది. 

పెన్సిల్‌ లేదా జెల్‌ ఐలైనర్‌ వాడేటప్పుడు తప్పనిసరిగా కళ్లకు నప్పే ఐషాడో వేయాలి. దీనివల్ల కంటి అందం మరింత మెరుగుపడుతుంది. 
లిప్‌స్టిక్‌ వేసినట్లుగా ఐలైనర్‌ను రెండు కోటింగ్‌లు వేయడం వల్ల ఐలైనర్‌ మరింత బ్రైట్‌గా కనిపించడమేగాక, కళ్లు పెద్దవిగానూ, అందంగానూ కనిపిస్తాయి.  

చదవండి: Dry Eye Irritation: కంట్లో దురదా.. ఇలా చేస్తే సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement