ఈ రోజుల్లో అందాన్ని కాస్మెటిక్స్‌తోనే కాదు.. ఇలాంటి స్మార్ట్ డివైస్‌లతోనూ సొంతం చేసుకోవచ్చు. ‘మొహానికి క్రీములు, పౌడర్లు రాసుకున్నా.. రాసుకోకపోయినా పెదవులకు మాత్రం లిప్‌స్టిక్ ఉండాల్సిందే’ అని అభిప్రాయపడుతుంటారు సౌందర్యప్రియులు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హ్యాండ్‌బ్యాగ్‌లో లిప్‌స్టిక్‌తో పాటు లిప్ ప్లంపర్ కూడా మెయిన్‌టైన్ చేసేవాళ్లు పెరుగుతున్నారు. ఇది సైలెంట్‌గా పనిచేస్తుంది. దాంతో ఎక్కడైనా, ఏ సమయంలోనైనా చక్కగా ఉపయోగించుకోవచ్చు.
దీనికి నెలకోసారి చార్జింగ్ పెడితే సరిపోతుంది. డివైస్‌కి ఒకవైపు.. టైమ్ కంట్రోల్, పవర్ బటన్, బ్యాటరీ ఇండికేషన్ వంటి ఆప్షన్స్‌తో డిస్‌ప్లే ఉంటుంది. ఈ డివైస్‌తో పాటు ఓవెల్ షేప్, రౌండ్ షేప్ అనే రెండు రీప్లేస్ హెడ్స్ కూడా లభిస్తాయి. అభిరుచిని బట్టి వాటిని మెషిన్‌కి అమర్చుకుని.. ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. ఈ ప్లంపర్ వాడటంతో పెదవులు మృదువుగా.. అందమైన షేప్‌లోకి మారతాయి. దీన్ని బాత్‌రూమ్‌లోనైనా, ఆఫీస్‌లోనైనా, ప్రయాణాల్లోనైనా.. ఎక్కడైనా తేలికగా వాడుకోవచ్చు.
ధర సుమారుగా 44 డాలర్లు. అంటే 3,611 రూపాయలన్న మాట. దీన్ని ఆన్ చేసిన తర్వాత ప్లస్ లేదా మైనస్ బటన్ల సహాయంతో పెదవులకు రౌండ్ లేదా ఓవెల్ ఎఫెక్ట్‌ను తెచ్చుకోవచ్చు. అనంతరం పెదవులకు లిప్ బామ్ రాస్తే సరిపోతుంది. మెరుస్తూ.. ప్రత్యేకంగా కనిపిస్తాయి. దాంతో ముఖం మరింత అందంగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment