
ఆ వ్యామోహం తగ్గించుకున్నా..!
‘‘నాకు లిప్‌స్టిక్ అంటే చాలా ఇష్టం. నేను ఏ ఫంక్షన్‌కు వెళ్లినా నా పెదాలకు లిప్‌స్టిక్ మాత్రం తప్పనిసరి’’ అని బాలీవుడ్ అందాల నటి హ్యూమా ఖురేషీ తన అందం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు చెప్పారు. ఫిట్‌నెస్ గురించి తీసుకునే జాగ్రత్తలు గురించీ మాట్లాడారు. ‘‘వృత్తిరీత్యా మాకు మేకప్ తప్పనిసరి. ముఖం అందంగా ఉంటే సరిపోదు కదా... దానికి తగ్గట్టే శరీరాకృతి కూడా ఉండాలి. అందుకే ‘బద్లాపూర్’ సినిమాలో అంత అందంగా కనిపించానంటే నా ట్రైనర్ విలాయత్ గొప్పదనమే. నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వాటిని దూరం పెట్టాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. నాకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం. కానీ ఇప్పుడిప్పుడే ఆ వ్యామోహాన్ని తగ్గించుకొని, డైట్ విషయంలో జాగ్రత్త వహిస్తున్నా’’ అని హ్యూమా చెప్పారు.